Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ఉద్దానాన్ని ఉద్ద‌రించే తీరిక ప‌వ‌న్ వ‌చ్చాకే దొరికిందా.. అచ్చెన్నాయుడు గారు..?

ఉద్దానాన్ని ఉద్ద‌రించే తీరిక ప‌వ‌న్ వ‌చ్చాకే దొరికిందా.. అచ్చెన్నాయుడు గారు..?

anaidu2

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దానం ప‌ర్య‌ట‌న‌., పాల‌కుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.. ప‌వ‌న్ డిమాండ్ల‌పై ఎలా స్పందించాలో తెలియ‌క మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. ఏదో చేసేస్తాం అంటారు..@@ చేయ‌డానికి ఏం లేదంటారు@@ డ‌బ్బు ఎంతైనా ఇవ్వ‌డానికి సిద్దం అంటారు.. జ‌బ్బు తెలియ‌కుండా మందు ఎలా వేయాలి అంటారు..? జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న అనంత‌రం అధికారపార్టీ నేత‌లు చెబుతున్న క‌బుర్లు ఇవి..

శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాల్లో పండిపోయిన త‌ల‌కాయ‌వంటి వారు మంత్రి అచ్చ‌న్నాయుడు.. ద‌శాబ్దాల నుంచి వీరి కుటుంబానికి, సిక్కోలు రాజ‌కీయాల‌కీ విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది.. మ‌రి ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? జ‌న‌సేనాని ప‌ట్టించుకునే స‌రికి మీకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయా..? రాష్ట్ర ప్ర‌భుత్వం శాశ్విత ప‌రిష్కారం వైపు దృష్టి సారించింది అన్నారు.. స‌మ‌స్య ఇప్ప‌టిది కాద‌ని మీరే సెల‌విచ్చారు.. ఈ సారి టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాకే డ‌యాల‌సిస్ సెంట‌ర్లు పెట్టామ‌న్నారు.. శ‌భాష్.. శ‌భాష్.. మ‌రి గ‌తంలో కాంగ్రెస్ కంటే ముందు తొమ్మిదేళ్లు ఇదే బాబు గారు పాలించారు.. మీ ఫ్యామిలీ ప‌ద‌వులు అనుభ‌వించారు.. మ‌రి అప్పుడు ఉద్దానం స‌మ‌స్య ఎందుకు గుర్తుకు రాలేదు..? దీనికి మీరు మిమ్మ‌ల్ని అసెంబ్లీకి పంపిన మీ ఓట‌ర్ల‌కి బ‌దులు చెప్పాలి..

జ‌బ్బు ఎందుకు వ‌స్తుందో తెలియ‌దు.. తెలిస్తే మందేస్తాం.. రోగం ఎందుకొస్తుందో తెలియ‌న‌ప్పుడు దేనికి ఖ‌ర్చుపెట్టాలి..? ఇది మీ ప్ర‌శ్న‌.. రోగం వ‌చ్చిన వారికి మందులు ఇప్పించేందుకు డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాలి.. కొత్త‌గా రోగం రాకుండా చ‌ర్య‌లు తీసుకునేందుకు డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాలి.. మిమ్మ‌ల్ని న‌మ్మి ఓట్లేసిన పాపానికి అంతులేని వ్యాధుల భారిన ప‌డి మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఖ‌ర్చు పెట్టాలి.. జ‌న‌సేనాని అడిగింది.. ఇదే.. పుష్క‌రాల‌కీ, రాజ‌ధానికి డ‌బ్బు ఖ‌ర్చు పెడుతున్నారంటే మీకంత కోపం వ‌చ్చిందే.. మ‌రి మీకు ఓట్లేసిన జ‌నం ప్రాణాలు పిట్ట‌ల్లా రాలిపోతుంటే ఇన్నాళ్లు ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన మీపై ఎంత కోపం రావాలి..

రోగుల‌కి బ‌స్ పాస్‌లు ఇవ్వ‌డానికి కూడా కాక‌మ్మ క‌బుర్లు చెబుతారేంటి అచ్చెన్నాయుడు., మీరు మాట‌ల్లో చెప్పే చిత్త‌శుద్ది జ‌నానికి చేత‌ల్లో క‌న‌బ‌డ‌ట్లా., జ‌న‌సేనుడి మాటను పెడ‌చెవిన పెడితే., 2019 త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్లో మీరు క‌న‌బ‌డ‌రు జాగ్ర‌త్త‌.. ఇది జ‌నం హెచ్చ‌రికండోయ్‌..

Share This:

1,836 views

About Syamkumar Lebaka

Check Also

పథకాలే జనరంజకం.. పాలన జనవిరుద్ధం.. 100 రోజుల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

* ఇసుకలో అధిక వసూళ్లు ఎటు పోతున్నాయి * పెట్టుబడి దారులను పంపించేస్తే నవరత్నాలకు సొమ్ములేవీ? * అమరావతి, పోలవరంలపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =