Home / పోరు బాట / ఉద్య‌మాన్ని అణ‌చాల‌నుకుంటే.. ఆంధ్రుల‌తో పోరాటానికి సిద్ధం కండి- కేంద్ర‌, రాష్ట్రాల‌కు జ‌న‌సేనుడి హెచ్చ‌రిక‌..

ఉద్య‌మాన్ని అణ‌చాల‌నుకుంటే.. ఆంధ్రుల‌తో పోరాటానికి సిద్ధం కండి- కేంద్ర‌, రాష్ట్రాల‌కు జ‌న‌సేనుడి హెచ్చ‌రిక‌..

pk-battle

ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ కోసం రాష్ట్ర యువ‌త చేయ‌ద‌ల‌చిన శాంతియుత పోరాటాన్ని అడ్డుకోవాల‌ని భావిస్తే.. హ‌క్కుల కోసం ఆంధ్రులు చేసే దీర్ఘ‌కాలిక పోరాటాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.. జ‌న‌వ‌రి 26 ఉద్య‌మానికి సంబంధించి ఇప్ప‌టికే యువ‌త‌ను ఉత్తేజప‌రుస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస‌గా పాల‌కుల‌పై విరుచుకుప‌డుతున్న జ‌న‌సేనుడు., పాల‌కుల‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు..

pkbatle

జ‌ల్లిక‌ట్టు పోరాటం చేసిన వారికి జ‌న‌సేన సెల్యూట్ చేస్తుంద‌న్న ప‌వ‌న్‌., ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మానికి అదే స్ఫూర్తిగా నిల‌చింద‌న్నారు.. ప్ర‌భుత్వానికి ఎప్పుడు స‌హ‌క‌రించాలో., ఎప్పుడు ఎదురు తిర‌గాలో జ‌న‌సేన పార్టీకి తెలుస‌ని పవ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు..

pk-tgsit

హోదా విష‌యంలో ఆంధ్రా ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన బీజేపీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు..1997లో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మానం చేసింద‌ని, అనంత‌రం అధికారంలోకి వ‌చ్చింద‌ని అన్నారు.. ఆ త‌ర్వాత‌ ప్ర‌త్యేక తెలంగాణ ఊసును బీజేపీ ఎత్త‌లేద‌ని అన్నారు. దాని ప‌ర్య‌వ‌సానంగా నిండు నూరేళ్లు బ‌త‌కాల్సిన 1458 మంది తెలంగాణ యువ‌కులు బ‌లిదానాలని ప‌వ‌న్ ధ్వ‌జ‌మెత్తారు… ఒక సున్నితమైన స‌మ‌స్య‌ని, అనేక కోట్ల మంది భ‌విష్య‌త్తుతో ముడిప‌డి ఉన్న స‌మస్య‌ని 17 సంవ‌త్స‌రాలు నాన్చి, 12 గంట‌ల్లో తేల్చేశార‌న్న జ‌న‌సేనాని., ఇదే నా సుదీర్ఘ‌ రాజ‌కీయ అనుభ‌వం అంటూ ఎద్దేవా చేశారు..

 

Share This:

491 views

About Syamkumar Lebaka

Check Also

ఓట్ల మాయంపై రోడ్డెక్కిన జ‌నసేన‌.. మా ఓటు-మా హ‌క్కు అంటూ నిర‌స‌న‌..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఓ వైపు ఎన్నిక‌ల సంఘం ప్ర‌తి నెలా డ్రైవ్‌లు పెట్టి మరీ 18 సంవ‌త్స‌రాలు నిండిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × three =