Home / జన సేన / ఉద్య‌మ‌బాట‌లో ఉనికిని చాటుతున్న జ‌న‌సేన జెండా.. విశాఖ‌లో డిసిఐ ఉద్యోగుల‌కి అండ‌గా సైన్యం..

ఉద్య‌మ‌బాట‌లో ఉనికిని చాటుతున్న జ‌న‌సేన జెండా.. విశాఖ‌లో డిసిఐ ఉద్యోగుల‌కి అండ‌గా సైన్యం..

ప్ర‌జా స‌మ‌స్య‌లంటే ఇష్టం.. ఆ స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం అంటే ఇష్టం.. వాటిని ప్ర‌జ‌ల‌కి దూరం చేయ‌డ‌మంటే ఇష్టం.. అంటూ జ‌న‌సేనుడు చెప్పిన నాటి నుంచి ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త‌మ‌వంతు పోరాటం చేస్తూనే ఉన్నారు.. విశాఖ‌లో వంద‌లాది మంది ఉద్యోగుల క‌డుపుకొట్టేందుకు స‌ర్కారు చేస్తున్న ప్ర‌య‌త్నం., డెడ్జింగ్ కార్పొరేష‌న్ మూత‌.. ఈ వ్య‌వ‌హారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌ర‌కు వెళ్లింది.. పైకి చెయ్య‌మంటూనే., అందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ని మాత్రం ప్ర‌భుత్వం చాప‌కింద నీరులా కొన‌సాగిస్తోంది.. దీన్ని వ్య‌తిరేకిస్తూ ఉద్యోగులు నిర‌స‌న తెలుపుతూనే ఉన్నారు.. స‌ర్కారు నుంచి ఓ స్ప‌ష్ట‌మైన హామీ కోసం ఎదురు చూస్తున్నారు..

డ్రెడ్జింగ్ కార్పోరేష‌న్ ప్ర‌యివేటీక‌ర‌ణకి వ్య‌తిరేకంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నారో., ఆ నాటి నుంచి విశాఖ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి అడుగులో ఉద్యోగుల‌కి అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు.. వారు చేసే ప్ర‌తి ఆందోళ‌న‌లో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడిస్తున్నారు.. తాజాగా డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఉద్యోగులు చేప‌ట్టిన ఉద్య‌మంలో., జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొని గళం విప్పారు..

జ‌న‌సేన‌కి యువ‌త మ‌ద్ద‌తు ఉంది.. యువ‌త ఏం చేస్తుందిలే అని తేలిగ్గా తీసేసిన వారికి ఉప్పెనై ఉవ్వెత్తున ఎగిసిప‌డి., త‌మ స‌త్తా ఏంటో చాటింది.. ఉద్య‌మిస్తున్న ఉద్యోగులు సైతం ఆశ్చర్య‌ప‌డే రీతిలో ., వారికి మద్ద‌తుగా భారీ సంఖ్య‌లో జ‌న‌సైనికులు పాల్గొన్నారు.. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా., పోరాడేందుకు మేమున్నాం అంటూ భ‌రోసా ఇచ్చారు..

Share This:

679 views

About Syamkumar Lebaka

Check Also

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − 13 =