Home / జన సేన / ఉపాధి ఇస్తామని భూమి లాక్కుంటారు.. రైతుల నోట్లో మ‌ట్టికొట్టి కార్పొరేట్ల‌కి క‌ట్ట‌బెడ‌తారు.. జ‌న‌సేనాని ధ్వ‌జం..

ఉపాధి ఇస్తామని భూమి లాక్కుంటారు.. రైతుల నోట్లో మ‌ట్టికొట్టి కార్పొరేట్ల‌కి క‌ట్ట‌బెడ‌తారు.. జ‌న‌సేనాని ధ్వ‌జం..

స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్స్‌(ఎస్ఈజెడ్‌)ల ముసుగులో సాగుతున్న అక్ర‌మాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ధ్వ‌జ‌మెత్తారు.. సెజ్‌ల పేరుతో రైతుల నుంచి వేలాది ఎక‌రాలు లాక్కుంటున్నార‌ని, గ్రామాల‌కి గ్రామాలు ఖాళీ చేయిస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌కి స‌రైన ఉపాధి మాత్రం క‌ల్పించ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు.. రాష్ట్రంలోనే అతిపెద్ద సెజ్‌ల‌లో ఒక్క‌టైన అచ్యుతాపురం సెజ్‌ని ప‌రిశీలించిన ఆయ‌న‌., ప్ర‌భుత్వం ప్రామిస్ చేసిన ఉద్యోగాలు ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నించారు..

60 వేల ఉద్యోగాలు ఇస్తామ‌న్న బ్రాండెక్స్ కంపెనీకి ఎక‌రా కేవ‌లం రూపాయికి ప్ర‌భుత్వం క‌ట్ట‌బెట్టింద‌నీ., అయితే బ్రాండెక్స్ ఇచ్చింది మాత్రం కేవ‌లం 18 వేల ఉద్యోగాలేన‌న్నారు.. మిగిలిన ఉద్యోగాలు ఎక్క‌డో చెప్పాల‌ని పాల‌కుల్ని నిల‌దీశారు.. కంపెనీ-ప్ర‌భుత్వం ఇద్ద‌రూ క‌లిసే ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్నార‌న్నారు.. అచ్యుతాపురం సెజ్ కోసం రెండు విడ‌త‌ల్లో మొత్తం 13, 288 ఎక‌రాల భూమిని కేటాయించారు.. అందులో ఇప్ప‌టి వ‌ర‌కు పురుడు పోసుకున్న కంపెనీలు కేవ‌లం 40 మాత్ర‌మే.. అందునా బ్రాండెక్స్‌కి ఏకంగా ఎక‌రా రూపాయి చొప్పున‌, ఒక ర‌కంగా ఉచితంగా వెయ్యి ఎక‌రాలు ప్ర‌భుత్వం ఇచ్చింది.. అయితే ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో మాత్రం స‌ద‌రు కంపెనీలు తూతూ మంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి..

ఇక కెమిక‌ల్ వ్య‌ర్ధాలు విడుద‌ల చేసే కంపెనీలు, నేరుగా వాటిని స‌ముద్రంలో ఎలా క‌లిపేస్తున్నాయో కూడా ప‌రిశీలించిన జ‌న‌సేన అధినేత‌., మ‌త్స్య‌కారులు కూడా ఈ సెజ్‌ల వ‌ల్ల ఉపాధి కోల్పోతున్నార‌న్నారు.. 2019లో జ‌న‌సేన అధికారం చేప‌డుతుంద‌న్న ప‌వ‌న్‌., అన్నింటికీ తెగించి ముందుకి వ‌చ్చిన త‌న‌కు ప్ర‌జ‌ల ఆశీర్వాదం కావాల‌ని కోరారు.. గ్రామాల్లోకి వెళ్లి స‌మ‌స్య‌లు తెలుసుకుని, వాటిపై ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం పోరాటం చేయాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి పార్టీ అధినేత సూచించారు.. మ‌ధ్య‌లో టీడీపీ అవినీతి చేప‌లు దొరికితే జాగ్ర‌త్త‌గా వ‌ల‌వేసి ప‌ట్టాల‌ని చెప్పారు.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంద‌ని జ‌న‌సేన అధినేత భ‌రోసా ఇచ్చారు.. అటు పాడేరు నుంచి మొద‌లైన విశాఖ జిల్లా జ‌న‌సేన పోరాట యాత్ర‌కి ప్ర‌తి అడుగులో జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు.. ప్ర‌తి క‌వాతుకీ వేలాది మంది హాజ‌రుకావ‌డంతో ప్ర‌త్య‌ర్ధులు జాగ్ర‌త్త‌గా లెక్క‌లు వేసుకుంటున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం.. ఇక్క‌డి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాలు..

జ‌న‌సేన పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం కొత్త భ‌వ‌నానికి మారింది.. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ భ‌వంతిలో నూత‌న కార్యాల‌యం ప్రారంభ‌మైంది.. శుక్ర‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 17 =

%d bloggers like this: