Home / పోరు బాట / ఉసురు తీస్తున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం..

ఉసురు తీస్తున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం..

61481929417_625x300

ప్ర‌ధాని మోడీ తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం., పేద మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఉసురు తీస్తోంది.. బ్యాంకుల వద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డ‌లేక వ‌యోవృద్దులు ప్రాణాలు కోల్పోతుంటే., పెళ్లిల్లు మ‌ధ్య‌లో ఆగిపోయిన అవ‌మానాల‌తో కొంద‌రు., చేసిన ప‌నికి డ‌బ్బురాక మ‌రికొంద‌రు., చేసిన అప్పులు తీర్చ‌లేక., అవ‌స‌రానికి అప్పు దొర‌క్క కూడా ఇంకొంద‌రి ఊపిరి ఆగిపోతోంది.. ఇందుకు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మండ‌లం కొప్ప‌ర్రుకి చెందిన పొలిశెట్టి న‌ర‌సింహ‌మూర్తి ఒక ఉదాహ‌ర‌ణ‌.. ఇత‌ను జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని కావ‌డం వ‌ల్ల మ‌న వెబ్‌లో న‌ర‌సింహ‌మూర్తి దీన‌గాద‌ను ప్ర‌చురిస్తున్నాము.. జ‌న‌సేనానిని ఆద‌ర్శంగా జీవించే న‌ర‌సింహ‌మూర్తికి స్వ‌త‌హాగా ఆత్మాభిమానం ఎక్కువ‌., చేసేది తాపీ ప‌నే అయినా ఎవ‌రితోనూ మాట‌ప‌డి ఎర‌గ‌డు.. అలాంటిది పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో అత‌నికి ఆ ప‌రిస్థితి దాపురించింది.. చ‌మ‌టోడ్చినా చేతిలో చిల్లిగ‌వ్వ ప‌డ‌క‌పోవ‌డంతో., వేసిన చీటిలు క‌ట్ట‌లేక‌., ఎక్క‌డ ప‌రువు పోతుందోన‌న్న చింత‌తో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు..

img-20161220-wa0080 img-20161220-wa0081

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గారికి ఓ లేఖ రాసి మ‌రీ న‌ర‌సింహ‌మూర్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.. అయ్యా మోడీ గారు మీ నిర్ణ‌యం పుణ్య‌మా అని ఒక్క రూపాయి కూడా దొర‌క్క ప్రాణాలు తీసుకుంటున్న‌ట్టు ఈ లేఖ‌లో రాశాడు.. మీ నిర్ణ‌యం వ‌ల్ల చేసిన ప‌నికి డ‌బ్బు దొరికే సంగతి ప‌క్క‌న పెడితే., క‌నీసం అప్పు కూడా పుట్ట‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని త‌న లేఖ‌లో రాశాడు.. చీటీల వాళ్ల‌కి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ప్రాణాలు తీసుకుంటున్న‌ట్టు తెలిపాడు.. త‌న‌పైనే ఆధార‌ప‌డి ఉన్న త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల‌కు ఏదైనా ఉప‌కారం చేయ‌మ‌ని విజ్ఞ‌ప్తి చేశాడు..

తాపీ ప‌నితో పాటు చీటీలు క‌ట్టించుకుంటూ జీవ‌నం సాగించే న‌ర‌సింహ‌మూర్తి., మోడీ దెబ్బకి జ‌నం నుంచి డ‌బ్బు వ‌సూలు కాక‌పోవ‌డం., ఇవ్వ‌వ‌ల‌సిన వారి నుంచి ఒత్తిడి పెర‌గ‌డంతో మ‌న‌స్థాపంతో ప్రాణాలు తీసుకున్నాడు.. నోట్ల ర‌ద్దు వ‌ల్ల ఇబ్బందులు వ‌చ్చాయ‌ని., అప్పులు తీర్చ‌లేక‌., వారికి ముఖం చూప‌లేక త‌నువు చాలిస్తున్న‌ట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.. ఎన్ ఆర్ ఐ జ‌న‌సేన స‌భ్యులు న‌ర‌సింహ‌మూర్తి దీన‌గాధ‌ను మ‌న‌కు చేర‌వేశారు.. స్వ‌త‌హాగా ప‌వ‌న్ అభిమాని అయిన అత‌ని కుటుంబాన్ని ఆదుకునేందుకు త‌మ‌తో పాటు జిల్లాకు చెందిన మ‌రికొంద‌రు ముందు వ‌స్తార‌న్న ఆకాంక్ష వెలిబుచ్చారు.. న‌ర‌సింహ‌మూర్తి లాంటి వెలుగులోకి వ‌చ్చిన ఉదంతాలు చాలా త‌క్కువ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో పోతున్న ప్రాణాలు లెక్క‌కు మించి పోతున్నాయి.. అయినా ముంద‌స్తు స‌న్నాహాలు లేకుండా తీసుకున్న నిర్ణ‌యాన్ని పాల‌కులు ఇంకా జ‌నంపై బ‌ల‌వంతంగా రుద్దేందుకే పాట్లు ప‌డుతున్నారు..

Share This:

1,198 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + three =