Home / జన సేన / ఊరూ.. వాడా.. వేళ్లూనుకుంటున్న జ‌న‌సేన‌.. స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డే సైన్యం..

ఊరూ.. వాడా.. వేళ్లూనుకుంటున్న జ‌న‌సేన‌.. స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డే సైన్యం..

img-20161124-wa0005

ఓ చెడు.. ఓ మంచికి అన్న‌ట్టు.. ఎల్లో మీడియా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే దెబ్బ‌కి జ‌న‌సైన్యం తుట్టి క‌దిలింది.. సేనానిని ఆరాధించే ప్ర‌తి సైనికుడిలో క‌సిని పెంచింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా పార్టీ విస్త‌ర‌ణ వేగం జెట్ స్పీడ్ అందుకుంది.. కుల‌, మ‌త‌, ప్రాంత విభేదాల‌కు అతీతంగా జ‌న‌సైనికులు క‌థం తొక్కుతున్నారు.. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాట‌ను అనుస‌రిస్తున్నారు.. స‌మ‌స్య ఎక్క‌డుంటే అక్క‌డ సేన ప్రత్య‌క్షం అయిపోతోంది.. ఓ బిడ్డ‌కి వైద్యం ఖ‌ర్చుకి డ‌బ్బు కావాలి.. త‌మ ద‌గ్గ‌ర అంత‌లేవు.. అంతా చేయి చేయి క‌లిపారు.. చందాలు వ‌సూలు చేసి వ‌చ్చినంత ఆ ప‌సిపాప త‌ల్లిదండ్రుల‌కి అప్ప‌గించారు.. వారి క‌ళ్ల‌లో ఆనందాన్ని చూసి., వీరు ఉప్పొంగారు..

img-20161202-wa0056 img-20161202-wa0057ఇంకో చోట ఓ త‌ల్లికి అత్య‌వ‌స‌రంగా ర‌క్తం కావాల్సి వ‌చ్చింది.. అది తెలుసుకున్న ఓ జ‌న‌సైనికుడు త‌న గ్రూప్‌లో మెస్సేజ్ పెట్టాడు.. ప‌లానా బ్ల‌డ్ గ్రూప్ కావాల‌ని అడిగాడు.. అది తెలుసుకున్న ఓ ప‌వ‌న్ అభిమాని నేనున్నానంటూ ముందుకి వ‌చ్చాడు.. ఆ త‌ల్లికి జీవ‌దానం చేశాడు..

img-20161206-wa0089 img-20161206-wa0090

ఇవే కాదు స‌మ‌స్య ఎక్క‌డుంటే అక్క‌డ జ‌న‌సైనికులు వాలి పోతున్నారు.. ఇటీవ‌ల టీడీపీ జ‌న‌చైత‌న్య యాత్ర పేరుతో గోదావ‌రి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ప్రాంతంలోని కె.బేత‌పూడి గ్రామంపై స్థానిక ఎమ్మెల్యే త‌న అనుచ‌ర‌గ‌ణంతో విరుచుకుప‌డ్డారు.. స‌ద‌రు గ్రామంలోని మ‌హిళ‌ల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేయించ‌గా., వారి అండ‌గా మేమున్నాం అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రంగంలోకి దిగారు.. ఆ గ్రామంలో భారీ ర్యాలీ తీసి., ఇక మీద‌ట ఏ స‌మ‌స్య వ‌చ్చినా క్ష‌ణంలో వాలిపోతామ‌ని భ‌రోసా ఇచ్చారు..

img-20161206-wa0034img-20161206-wa0035

ఇక స్థానికంగా జ‌న‌సేన పార్టీని లీడ్ చేస్తున్న నాయ‌కులు గ్రామ‌గ్రామానికి జ‌న‌సేన‌ను విస్త‌రింప‌జేస్తున్నారు.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నాయ‌కులు జ‌గ‌దీష్ చంద్ర వాసు., ప్ర‌తి ఇంటి గ‌డ‌పా త‌డుతూ., జ‌న‌సేనాని ల‌క్ష్యాలు., ఉద్దేశాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.. జ‌న‌సేన ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తుంది.. రాష్ట్రానికి ఏం చేస్తుంది.. ఎందుకు పార్టీకి మ‌ద్ద‌తివ్వాలి అనే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.. త్వ‌ర‌లోనే బూత్ లెవ‌ల్ క‌మిటీలు వేసి., పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.. మూడు గ్రామాల్లో జ‌న‌సేన నేత ప‌ర్య‌టించ‌గా., స్థానిక యువ‌త పార్టీ శ్రేణులకి సాధ‌రంగా ఆహ్వానం ప‌లికింది.. మేమంతా మీ వెంటేన‌న్న భ‌రోసా ఇచ్చింది..

Share This:

1,273 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + seven =