Home / జన సేన / ఎగ్జాట్ పోల్స్‌పై దృష్టి పెడ‌దాం.. కౌంటింగ్‌కు క‌ల‌సి పనిచేద్దాం- జ‌న‌సైన్యానికి పిలుపు

ఎగ్జాట్ పోల్స్‌పై దృష్టి పెడ‌దాం.. కౌంటింగ్‌కు క‌ల‌సి పనిచేద్దాం- జ‌న‌సైన్యానికి పిలుపు

ఎగ్జిట్ పోల్స్… ఎగ్జాట్ పోల్స్‌కి దూరంగా., ఒక‌రి మీద ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ నంబ‌ర్ల ప్ర‌జెంటేష‌న్ చేసేశారు.. ఎగ్జిట్ పోల్స్‌కు త‌గ్గ‌ట్టు ఆయా పార్టీల నాయ‌కుల్లో విర్ర‌వీగుడు కూడా మొద‌లైంది.. ఇందులో ఏ ఒక్క స‌ర్వే నిబ‌ద్ధ‌త ఏంట‌న్న‌ది 23వ తేదీ తేలుతుంది.. గెలుపు-ఓట‌మి అనే అంశాల‌కు దూరంగా ప్ర‌జ‌ల్లో ఓ స్ప‌ష్ట‌మైన మార్పు కోసం బ‌రిలోకి దిగిన జ‌న‌సేన పార్టీ., పోలింగ్‌లో ప్ర‌త్య‌ర్ధుల ప్ర‌లోభాల‌ను దీటుగా ఎదుర్కొంది.. ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన మార్పు క‌న‌బ‌డింద‌న్న న‌మ్మ‌కంతో ఉంది.. ఎల‌క్ష‌నియ‌రింగ్‌లో పార్టీ గెలుపు కోసం త‌మ‌వంతు కృషి చేసిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌లో అదే న‌మ్మ‌కం ఉంది.. ఆ న‌మ్మ‌కం నిజం అని తేలే రోజు కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.. చూస్తూ ఉండ‌గానే కౌంటింగ్ డే మ‌న ముందుకు వ‌చ్చేసింది.. మ‌రి ఫ‌లితం తేల్చే కౌంటింగ్ రోజున మ‌నం ఏం చేయాలి అనే అంశం మీద పార్టీ ఇప్పటికే కొన్ని సూచ‌న‌లు ఇచ్చింది.. తాజాగా అంతా క‌ల‌సి క‌ట్టుగా ప‌ని చేద్దాం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయ స‌ల‌హాదారు, మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ రామ్మోహ‌న్‌రావు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు..

ప్రియ‌మైన జ‌న‌సేన నేత‌లు, పోటీ చేసిన అభ్య‌ర్ధుల‌కు జ‌న‌సైనికుల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాభినంద‌న‌లు తెలిపిన ఆయ‌న‌., కొత్త త‌రం రాజ‌కీయాల‌ను ఆవిష్క‌రించాల‌ని అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన పిలుపు, ఆయ‌న చేస్తున్న ఆలుపెరుగ‌ని పోరాటంలో భాగంగా అంతా ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ పోలింగ్‌లో విశేషంగా కృషి చేసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు ..కౌంటింగ్ గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌ధ్యంలో అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని., కౌంటింగ్ స‌మ‌యంలో కూడా స‌మిష్టి శ‌క్తిని చాటాలని కోరారు.. ప్ర‌త్య‌ర్ధులు ర‌క‌ర‌కాల‌ కుయుక్తుల‌తో కౌంటింగ్‌కు అవ‌రోధాలు క‌లిపించే ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని, వాటిని తిప్పికొట్టేందుకు అంతా క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని రామ్మోహ‌న్‌రావు పిలుపునిచ్చారు.. పోలింగ్ సంద‌ర్బంగా మ‌నం ఎటువంటి స్ఫూర్తితో ప‌ని చేశామో అదే స్ఫూర్తిని కౌంటింగ్‌లోనూ ప్ర‌ద‌ర్శించాలి విజ్ఞ‌ప్తి చేశారు.. ప్ర‌త్య‌ర్ధుల‌కు ఎటువంటి అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్దని., గెలుపు, ఓట‌ముల మ‌ధ్య తేడా స్వ‌ల్పంగా ఉండే అవ‌కాశం ఉన్నందున అనుక్ష‌ణం అప్ర‌మ‌త్త‌తో ఉండాల‌ని సూచించారు.. మ‌న అభ్య‌ర్ధుల‌కు జ‌న‌సైనికులంతా అండ‌గా నిల‌వాల‌ని కోరారు.. సో క్లిష్ట‌మైన ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది.. మ‌రో రెండు రోజుల్లో కౌంటింగ్ ఇది మ‌రింత జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌క్రియ బీ కేర్‌ఫుల్‌..

Share This:

561 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 12 =