Home / జన సేన / ఎన్నిక‌ల కోసం వ‌చ్చిన పార్టీ కాదు జ‌న‌సేన.. అభ్య‌ర్ధుల‌కు ప‌వ‌న్ ఉద్భోద‌..

ఎన్నిక‌ల కోసం వ‌చ్చిన పార్టీ కాదు జ‌న‌సేన.. అభ్య‌ర్ధుల‌కు ప‌వ‌న్ ఉద్భోద‌..

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంతరం తొలిసారి పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మీక్షా స‌మావేశాలు ప్రారంభించారు.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జిల్లాల వారీగా అభ్య‌ర్ధుల‌తో స‌మావేశ‌మ‌వుతున్న ఆయ‌న‌., త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణపై చ‌ర్చిస్తున్నారు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌తికూలంగా వ‌చ్చిన నేప‌ధ్యంలో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని., ప్ర‌జ‌ల్లో ఉంటూ ముందుకు వెళ్దామ‌ని స్ప‌ష్టం చేశారు.. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలో కాదు ప్ర‌తి క్ష‌ణం జ‌నంతో మ‌మేక‌మ‌వుతూ వారికి ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా మేమున్నాం అంటూ భ‌రోసా ఇవ్వాలంటూ పిలుపు నిచ్చారు.. ఫ‌లితాల మీద ఎవ‌రికి వారు సొంతంగా విశ్లేష‌ణ చేసుకోవాల‌ని సూచించారు.. ఒక ఎన్నిక‌ల కోసం వ‌చ్చిన పార్టీ జ‌న‌సేన కాద‌ని తెలిపిన ఆయ‌న‌., నిత్యం జ‌నం ప‌క్షాన ఉండే సిద్ధాంతాల‌తో నిర్మిత‌మ‌య్యింద‌ని స్ప‌ష్టం చేశారు.. ఓ సుధీర్ఘ ల‌క్ష్యం పాతికేళ్ల ప్ర‌ణాళిక‌తో, ల‌క్ష్యంతో ప‌ని చేస్తుంద‌ని తాను ప‌దే ప‌దే చెప్పే విష‌యాన్ని గుర్తు చేశారు.. ఇప్పుడు పార్టీకి ప‌డిన ఓటు జ‌న‌సేన పార్టీని బ‌లంగా న‌మ్మిన వారి ఓటు అని తెలిపారు.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయం లేకుండా చేసేందుకు., పార్టీని ఏదో విధంగా అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటార‌ని., అయినా ఏ ద‌శ‌లో వెన‌క‌డుగు వేసేది లేద‌ని తేల్చి చెప్పారు.. జ‌న‌సేన‌కు జ‌న బ‌లం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశార‌న్న ప‌వ‌న్‌., ప్ర‌త్య‌ర్ధుల‌ను బ‌లంగా ఎదుర్కోవాల‌ని తెలిపారు.. పార్టీ కోసం కమిటెడ్‌గా ప‌ని చేసే వారిని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్లాల‌ని అభ్య‌ర్ధుల‌కు సూచించారు.. జిల్లా స్థాయి స‌మీక్షా స‌మావేశాలు పూర్త‌యిన త‌ర్వాత క్షేత్ర స్థాయిలో ఎలా బ‌లోపేతం కావాలి అనే అంశం మీద మ‌రో సారి అంద‌రితో చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిపారు.. బెధిరింపులు, కేసుల బ‌యం లేకుండా ప‌ని చేసుకోవాల‌ని చెప్పారు.. తొలి రోజు ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణాజిల్లాల అభ్య‌ర్ధుల‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., శుక్ర‌వారం తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులతో చ‌ర్చిస్తారు..

Share This:

494 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × four =