Home / జన సేన / ఎమ్మెల్యేనా..రౌడీషీట‌రా.. చింత‌మ‌నేని ధౌర్జ‌న్యాల‌పై జ‌న‌సేనాని ఫైర్‌..

ఎమ్మెల్యేనా..రౌడీషీట‌రా.. చింత‌మ‌నేని ధౌర్జ‌న్యాల‌పై జ‌న‌సేనాని ఫైర్‌..

దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్ రాజ్యాంగేత‌ర శ‌క్తిలా త‌యారయ్యార‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ అధికారుల‌ను కొట్ట‌డం, పోలీసుల‌ను తుపాకీతో బెదిరించ‌డం, తాజాగా ఏలూరు లిక్కర్ డిపోలో మాట విన‌లేద‌ని ద‌ళిత కార్మికుడిని కులం పేరుతో దూషించి, దాడి చేయ‌డం చూస్తుంటే ఆయ‌న ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంద‌ని అన్నారు. మంగ‌ళ‌వారం ఏలూరులోని క్రాంతి క‌ల్యాణ మండపంలో ఆలిండియా దళిత హక్కుల నేతలు, హమాలీలతో సమావేశ‌మయ్యారు. ఈ వేదిక‌పై బాధితుడు త‌న‌పై దాడి జ‌రిగిన విధానాన్ని జ‌న‌సేనానికి వివ‌రించాడు.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డ‌ర్ బ‌లంగా అమ‌లు చేసి, భ‌ద్ర‌త‌తో కూడిన పాల‌న అందిస్తార‌నే న‌మ్మ‌కంతోనే 2014 ఎల‌క్ష‌న్ లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు తెలిపాన‌న్నారు. బెదిరింపులు, దౌర్జ‌న్యాలు చూస్తుంటే చింత‌మ‌నేని ప‌నులు రౌడీషీట‌ర్ ను త‌ల‌పిస్తున్నాయ‌న్నారు. 37 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఆయ‌న‌పై ఇది 38వ కేసు అన్నారు.. మ‌న‌ది ప్ర‌జాస్వామ్యం అని మ‌రిచిపోయి, చింత‌మ‌నేని రాచ‌రికంలా న‌డుచుకుంటున్నారంటూ మండిప‌డ్డారు..

ఒక‌వైపు ముఖ్యమంత్రి ద‌ళిత‌తేజం అంటూ ప్ర‌చారాలు ఊద‌ర‌గొడుతుంటే., మ‌రోవైపు వారి ఎమ్మెల్యేలు కులాల పేరిట దూష‌ణ‌ల‌కి, దాడుల‌కి దిగుతున్నార‌ని జ‌న‌సేనాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. దాడికి పాల్పడ్డ చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. సీఎం త‌న ఎమ్మెల్యేను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టుకోక‌పోతే., ఆ బాధ్య‌త‌ను ప్ర‌జ‌లే తీసుకోవ‌ల్సిన రోజులు వ‌స్తాయంటూ హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి, ప్ర‌భుత్వ యంత్రాంగం ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకుంటారా..? లేక ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే ఏలా ఉంటుందో చూస్తారా ..? అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిల‌దీశారు..

Advertisement.

Advertisement.

Share This:

943 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 7 =