Home / సేన సేవ / ఎల్ల‌లు దాటిన జ‌న‌సైన్యం సేవ‌.. బాల రోగికి కువైట్ జ‌న‌సేన టీమ్ సాయం..

ఎల్ల‌లు దాటిన జ‌న‌సైన్యం సేవ‌.. బాల రోగికి కువైట్ జ‌న‌సేన టీమ్ సాయం..

img-20161216-wa0045                          img-20161216-wa0046 img-20161216-wa0047

ఎదుటివాడి క‌ష్టాన్ని చూసి స్పందించే హృద‌యం ఎక్క‌డ ఉన్నా., ఆప‌న్నులకు భ‌రోసా ఉన్న‌ట్టే.. ఎదుటివాడి క‌డుపు మంట త‌న ఆక‌లిగా భావించే జ‌న‌సేనాని సైన్యం ఎక్క‌డ ఉన్నా ఆప‌న్నుల‌కి ఆ భ‌రోసా ఖ‌చ్చితంగా ఉంటుంది.. స్వ‌దేశంలో మెద‌డు సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న ఓ చిన్నారిని కువైట్‌లో ఉన్న జ‌న‌సేన టీమ్ ఆర్ధిక సాయంతో ఆదుకుంది.. స‌మాజసేవ విష‌యంలో త‌మ సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జ‌న‌సైన్యం., దేశ‌పు ఎల్ల‌లుదాటినా సేవా మార్గాన్ని మాత్రం వదులుకోలేదు.. సుదూర ప్రాంతాల‌కేగి., చ‌మ‌డోడ్చి సంపాధించిన దాన్లో కొంత‌., త‌మ అభిమాన, ఆరాధ్య హీరో, నేత‌ని రోల్ మోడ‌ల్‌గా భావించి క‌ష్టాల్లో ఉన్న‌వారికి ఆప‌న్న‌హ‌స్తం అందించారు.. ఇవాళ ప‌వ‌న్‌సేన చేసిన సాయం ఓ త‌ల్లి గ‌ర్భ‌సోకాన్ని చ‌ల్లార్చ‌గ‌లిగింది..

కువైట్‌లో 36 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌న‌సేన టీమ్‌., ఒక్కోక్క‌రు 5 నుంచి 15 దినార్స్ చొప్పున చిన్నారి ఫ‌ణీంద్ర‌ను ఆదుకునేందుకు సాయం చేశారు.. మొత్తం 50 వేల 418 రూపాయిలు అకౌంట్లో జ‌మ చేశారు.. వీరితో పాటు అమెరికాకి చెందిన ప‌వ‌న్ అభిమానులు శ్రీధ‌ర్‌, నాగేంద్ర‌లు మ‌రికొంత ఆర్ధిక సాయం అందించారు.. త‌మ కుమారుని ఆదుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు ఆ త‌ల్లి కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలిపింది.. టీమ్ జ‌న‌సేన కువైట్ స‌భ్యులు చేసిన ఈ సాయం మ‌రికొంద‌రికి స్పూర్తి కావాల‌నే కాంక్ష‌తో ఈ విష‌యాన్ని మీ ముందు ఉంచుతున్నాం.. ప్లీజ్ షేర్ ఇట్‌..

Share This:

874 views

About Syamkumar Lebaka

Check Also

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 1 =