Home / జన సేన / ఎస్.పి.వై రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ఎస్.పి.వై రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ఇటీవ‌ల మృతి చెందిన జ‌న‌సేన పార్టీ నంద్యాల లోక్‌స‌భ అభ్య‌ర్ధి ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రామ‌ర్శించారు.. శ‌నివారం మ‌ధ్యాహ్నం పార్టీ ముఖ్య నేత‌ల‌తో క‌ల‌సి నంద్యాల వెళ్లిన ప‌వ‌న్‌., ఎస్పీవై రెడ్డి స‌మాధి వ‌ద్ద పుష్ప‌గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.. ఎస్పీవై రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి వారికి అండ‌గా ఉంటామంటూ ధైర్యాన్ని నింపారు.. ఆయ‌న కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని, వారంద‌ర్నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.. ఎస్పీవై రెడ్డి గారు దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న మ‌ధ్య లేక‌పోయినా., ఆయ‌న ఆశ‌యాల‌ను జ‌న‌సేన పార్టీ కొన‌సాగిస్తుంద‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు.. గ‌డ‌చిన 15 ఏళ్లుగా ఆయ‌న‌తో అనుబంధాన్ని నెమ‌ర‌వేసుకున్నారు.. ఆయ‌న వ్య‌క్తిత్వం బాగా నచ్చిందని చెప్పారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికీ సుపరిచిత వ్యక్తే అన్నారు. ఎస్పీవై రెడ్డి మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో ఎస్పీవై రెడ్డి త‌నదైన ముద్ర వేశారు.. ఒక్క రూపాయికి పప్పు, రొట్టె, ఒక్క రూపాయికి మజ్జిగ, ఒక్క రూపాయి అద్దెతో సాగునీటి సరఫరాకు పీవీసీ పైపు, బిందు సేద్యానికి సగం ధరకే సామగ్రి అందించడం వంటివి మామూలు విష‌యాలు కాద‌న్నారు.. ఒక పారిశ్రామికవేత్త ఈ స్థాయిలో సామాజిక సేవ‌ చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని జ‌న‌సేనాని కొనియాడారు.. అందుకే ఆయ‌న రైతు ప‌క్ష‌పాతిగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు.. జ‌న‌సేన అధినేత‌తో పాటు పార్టీ ముఖ్య‌నేత‌లు నాదెండ్ల మ‌నోహ‌ర్ , మాదాసు గంగాధ‌రం, పి.రామ్మోహ‌న్ రావుతో పాటు క‌ర్నూలు జిల్లా జ‌న‌సేన నేత‌లు పాల్గొన్నారు.

Share This:

265 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − two =