Home / ఎడిటోరియల్స్ / ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే.. ఎందుకంటే.. JFC నివేదిక‌లో నిజానిజాలు చూడండి..

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే.. ఎందుకంటే.. JFC నివేదిక‌లో నిజానిజాలు చూడండి..

కేంద్ర ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్య‌ప‌డ‌దా..? ప‌్ర‌త్యేక హోదా అనే ప‌దాన్ని పూర్తిగా ఎత్తివేశారా..? 14వ ఆర్ధిక సంఘం హోదాని ర‌ద్దు చేసిందా..? చేస్తే ప్ర‌స్తుతం హోదా అనుభ‌విస్తున్న 11 రాష్ట్రాల మాటేంటి..? హోదాతో వ‌చ్చే ప్ర‌త్యేక లాభాలు ఏంటి..? చాలా స్ప‌ష్టంగా., విపులంగా విడ‌మ‌ర్చి మ‌రీ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ త‌న నివేదిక‌లో పేర్కొంది.. JFC కేంద్రానికిచ్చిన నివేదిక‌లో పేర్కొన్న 11 అంశాల్లో ప్ర‌త్యేక హోదా అనే అంశానికే మొద‌టి ప్రాధాన్య‌త ఇచ్చింది.. ఎందుకంటే ., ప్ర‌తి స‌మ‌స్య‌కీ ఈ స్పెష‌ల్ కేట‌గిరీ స్టేట‌స్ బ‌దులుచెప్ప‌గ‌ల‌ద‌న్న‌దే JFC వాద‌న‌..

అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం అనే అంశం ఎక్క‌డ ఉత్ప‌న్నం అయ్యింది.. అంటే రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంపై చ‌ర్చ సంద‌ర్బంగా 2014 ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన రాజ్య‌స‌భ సాక్షిగా అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ ఈ అంశాన్ని ప్ర‌స్థావించారు.. అలా ప్ర‌స్తావించ‌డానికి కార‌ణం., విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌రిగిన తీవ్ర‌మైన న‌ష్ట‌మే.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి చెందిన 95 శాతం ఆస్తులు హైద‌రాబాద్‌లో ఇరుక్కుపోయాయి.. పైగా 90 శాతం ప్ర‌భుత్వ ఆధీనంలోని ట్రైనింగ్ ఇనిస్టిట్యూష‌న్లు తెలంగాణ‌లో ఉండ‌గా., ఒప్పందం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాటిని వినియోగించుకున్నందుకు గాను., తెలంగాణ స‌ర్కారుకి ఎదురు స‌ర్వీస్ టాక్స్ క‌డుతోంది.. ఇలాంటి చాలా నిర్ణ‌యాల వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీవ్ర‌మైన ఆర్ధిక‌లోటుని ఎదుర్కొనే ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయింది.. ఇదే అంశాన్ని JFC త‌న నివేదిక‌లో పేర్కొంది.. ఇంకో విష‌యం ఏమంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అప్ప‌టి కేబినెట్ నిర్ణ‌యం తీసుకోగా., ఇప్ప‌టి ప్ర‌ధాని కూడా ఎన్నిక‌ల వేళ హామీ ఇచ్చారు..

ఇప్పుడు జ‌రుగుతున్న‌ది ఏంటంటే..? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా అనే అంశాన్ని ఎగ్గొట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చాలా అబ‌ద్దాలు చెబుతూ., వంక‌లు వెతుకుతుంది.. అందులో అతిపెద్ద అబ‌ద్దం.. 14వ ఆర్ధిక సంఘం ప్ర‌త్యేక హోదా అనే అంశాన్ని తీసివేసింది అని చెప్ప‌డం.. కానీ ఆర్ధిక సంఘం మాత్రం అలాంటి మాట ఎక్క‌డా అన‌లేదు అంటోంది.. ఆయా రాష్ట్రాల ఆర్ధిక స్థితిగ‌తుల్ని భ‌ట్టి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా త‌మ నుంచి ఆర్ధిక స‌హ‌కారం ఉంటుంద‌ని మాత్ర‌మే చెప్పిట్టు పేర్కొంది.. అంతే త‌ప్ప ప్ర‌త్యేక‌హోదాని తీసివేయ‌డం అనేమాట ఎక్క‌డా చెప్ప‌లేద‌ని ఆర్ధిక సంఘం చెబుతోంది.. ఇక్క‌డ ఖ‌చ్చితంగా ఏపీ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వ మోస‌పూరిత ధోర‌ణి అర్ధం అవుతోంది..

ఇక ప్ర‌ణాళికా సంఘం స్థానంలో బీజేపీ పుట్టించిన నీతిఆయోగ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి హోదా ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పింది అన్న‌ది కేంద్రం చేసిన మ‌రో ప్ర‌క‌ట‌న‌.. ఈ ప్ర‌క‌ట‌న‌ని JFC త‌ప్పుబ‌డుతోంది.. ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేని నీతిఆయోగ్‌., కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఎలా మార్చ‌ల‌గ‌దు అన్న‌ది JFC ప్ర‌శ్న‌.. ఈ ప్ర‌శ్న ఉత్ప‌న్నం అయ్యింది రాజ‌కీయ నాయ‌కుల నుంచి కాదు.. కేంద్ర స్థాయిలో ప‌నిచేసిన సీనియ‌ర్ ఐఏఎస్‌ల‌కే అర్ధంకాని ధ‌ర్మ సందేహం.. ఇక్క‌డా హోదా ఎగ్గొట్టేందుకు కేంద్రం నాట‌కం ఆడుతున్న విష‌యాన్ని JFC ప్ర‌జ‌ల ముందు ఉంచింది..

చాలా దారుణ‌మైన ఆర్ధిక‌లోటు, వెనుక‌బాటు ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌., హోదా అనుభ‌విస్తున్న 11 రాష్ట్రాల‌తో పాటు చేరేందుకు అన్ని అర్హ‌త‌లు ఉన్న రాష్ట్ర‌మే.. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో గానీ., రానున్న ఏడాదిలోగానీ., దేశంలోనే తీవ్ర‌మైన ఆర్ధిక‌లోటు ఎదుర్కొంటున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే.. ఈ ఒక్క అర్హ‌త హోదా ఇచ్చేందుకు స‌రిపోతుంద‌న్న‌ది JFC వాద‌న‌..

హోదా వ‌ల్ల ఉప‌యోగం ఏంటి..? హోదాతో ఉద్యోగాలు ఎలా వ‌స్తాయి..? రాష్ట్ర అభివృద్దికి హోదాకి ఉన్న లింకేంటి..? ఇందుకు సంబంధించి అంశాల‌ను JFC చాలా స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల‌కి అర్ధ‌మ‌య్యేలా నివేదిక రూపొందించింది.. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా అనుభ‌విస్తున్న 11 రాష్ట్రాలు.. ఏడు ఈశాన్య రాష్ట్రాలు., హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌రాంచ‌ల్‌, జ‌మ్మూ కశ్మీర్ చాలా స‌బ్సీడిలు పొందుతున్నాయి.. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వ స్కీమ్‌లు, ఈఏపీ స్కీమ్‌ల వ్య‌వ‌హారంలో కేంద్రం-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల వాటా 90:10 రేషియోలో ఉంటుంది.. అంటే ఒక రాష్ట్రంలో కేంద్రం ఒక రోడ్డు నిర్మించాలంటే సాధార‌ణ రాష్ట్రాల్లో కేంద్రం 60 శాతం భారం మోస్తే., రాష్ట్రాలు 40 శాతం భారాన్ని మోస్తాయి.. హోదా ఉన్న రాష్ట్రాల్లో అయితే 90 శాతం భారాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంది..

స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ లాంటి అంశాల్లో కేంద్రం నుంచి ఊహించ‌ని స్థాయిలో స‌బ్సిడీలు అందుతాయి.. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు ఎలాంటి ట్యాక్సులు ఉండ‌వు.. 10 ఏళ్ల పాటు ఎక్సైజ్ డ్యూటీ మిన‌హాయింపు.. కొత్త పెట్టే ఇండ‌స్ట్రీల‌కి ఇన్వెస్టిమెంట్ స‌బ్సిడి, వ‌ర్కింగ్ కేపిట‌ల్ ఇంట్ర‌స్ట్‌పై స‌బ్సిడి, ట్రాన్స్‌పోర్ట‌ర్ సిబ్సిడి ఇలా చాలా ర‌కాల స‌దుపాయాలు ప్ర‌త్యేక హోదాతో మాత్ర‌మే ల‌భిస్తాయ‌ని JFC నివేదిక‌లో తెలిపింది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ని ప‌రిశీలించి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌న్న డిమాండ్ను JFC చేస్తోంది..

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన బ‌కాయిల మొత్తం 74 వేల కోట్ల చిల్ల‌ర‌గా JFC గుర్తించింది.. దీనికి సౌక‌ర్యాల క‌ల్ప‌న అద‌నం.. ఆర్ధిక సంక్షోభం, సౌక‌ర్యాల క‌ల్ప‌న వ్య‌వ‌హారానికి సంబంధించి ఇచ్చిన హామీల అమ‌లులో జాప్యం కార‌ణంగా అభివృద్దిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిగా న‌ష్ట‌పోయింది.. ఇప్ప‌టి వ‌ర‌కు తొలి ఏడాది 2014-15కి సంబంధించి రావాల్సిన ఎరియ‌ర్స్‌ క్లియ‌ర్ కాలేదు.. ఇంకా అభివృద్ది ఎలా సాధ్యం.. ఇచ్చిన హామీలు అమ‌లుకి నోచుకునే స‌మ‌యానికి రాష్ట్రం ఇంకా ఎక్క‌డ ఉంటుంది.. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల త‌రుపున JFC సంధించిన ప్ర‌శ్నాస్త్రాలు..

ప్ర‌త్యేక‌హోదాతో వ‌చ్చే ఉప‌యోగాలు, రాక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం అనుభ‌విస్తున్న క‌ష్టాల‌ను చాలా విపులంగా JFC వివ‌రించింది.. జ‌న‌సేనాని మాట‌ల్లో రెండు పాచిపోయిన ల‌డ్డూలు ప్యాకేజీ అంటూ కేంద్రం ఇస్తే., అవే మాకు బంగారు ల‌డ్డూలు అంటూ స్వీక‌రించిన టీడీపీ దొందూ దొందే.. అప్పుడు ఆ పాచిపోయిన ల‌డ్డూలు అయినా చాలు అన్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్పుడు ., ల‌బోదిబో మ‌న‌డం., మ‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని నిల‌దీసేందుకు సైతం వెనుకాడ‌డం., జ‌వాబుదారీ త‌నం లేక‌పోవ‌డ‌మేన‌ని జ‌న‌సేనాని తేల్చారు.. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు పొలిటిక‌ల్ యాక్ష‌న్ త‌ప్ప‌ద‌న్న నిర్ణ‌యానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, JFC వ‌చ్చేశాయి..

Share This:

2,797 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 4 =