Home / పోరు బాట / ఏపీలో చింత‌మ‌నేని వ్యాఖ్య‌ల దుమారం… రోడ్డెక్కిన జ‌న‌సైన్యం, నిర‌స‌న‌ల వెల్లువ‌..

ఏపీలో చింత‌మ‌నేని వ్యాఖ్య‌ల దుమారం… రోడ్డెక్కిన జ‌న‌సైన్యం, నిర‌స‌న‌ల వెల్లువ‌..

img-20161225-wa0094

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై జ‌న‌సైనికులు యుద్ధం ప్ర‌క‌టించారు.. సొంత నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ప‌శ్చ‌మ‌గోదావ‌రి జిల్లా వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు మిన్నంటాయి.. జంగారెడ్డిగూడెంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చింత‌మ‌నేని దిష్టిబొమ్మ‌కు శ‌వ‌యాత్ర నిర్వ‌హించి., ద‌గ్దం చేశారు.. ఆ వెంట‌నే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోస్ట‌ర్‌కి పాలాభిషేకం చేసి శుద్ది చేశారు..

img-20161225-wa0133

చింత‌మ‌నేని వ్యాఖ్య‌లు ఏరుదాటాకి తెప్ప త‌గ‌లేసిన‌ట్టు ఉన్నాయ‌ని మండిప‌డుతున్నారు.. గెలిచే వ‌ర‌కు మీరే దిక్కు అని., ఇప్పుడు మా గొప్పే అంటారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.. చింత‌మ‌నేని వ్యాఖ్య‌ల‌ను టీడీపీ నాయ‌క‌త్వం ఖండించ‌క పోవ‌డం ప‌ట్ల జ‌న‌సైనికులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.. పైకి ప‌వ‌న్ మా మిత్రుడు., శ్రేయోభిలాషి అంటున్న చంద్ర‌బాబు ఆ వ్యాఖ్య‌ల్లో నిజం ఉంటే చింత‌మ‌నేనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు..

చింత‌మ‌నేనికి ధైర్యం ఉంటే., చేసిన వ్యాఖ్య‌ల‌కి క‌ట్టుబ‌డి ఉంటే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి వెంట‌నే రాజీనామా చేసి బైఎల‌క్ష‌న్‌లో ఎవ‌రి మ‌ద్ద‌తులేకుండా గెల‌వాల‌ని జ‌న‌సైనికులు డిమాండ్ చేస్తున్నారు.. లేదంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు..

Share This:

766 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =