Home / జన సేన / ఏపీలో జ‌న‌సేన క్యాలెండ‌ర్ల హోరు.. ప్ర‌త్య‌ర్ధుల‌కి ధీటుగా ఆవిష్క‌ర‌ణ‌లు..

ఏపీలో జ‌న‌సేన క్యాలెండ‌ర్ల హోరు.. ప్ర‌త్య‌ర్ధుల‌కి ధీటుగా ఆవిష్క‌ర‌ణ‌లు..

img-20170118-wa0052 img-20170118-wa0054

జ‌న‌సేన పార్టీ బ‌లం, బ‌ల‌గం ఏంటి అన్న విష‌యం నెమ్మ‌ది నెమ్మ‌దిగా ప్ర‌త్య‌ర్ధుల‌కి అవ‌గ‌తం అవుతోంది.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కే కాదు.. స్థానిక నేత‌లు ఏర్పాటు చేసే అంత‌రంగిక స‌మావేశాల‌కు కూడా భారీ ఎత్తున జ‌నం త‌ర‌లివ‌స్తున్నారు.. తామంతా ప‌వ‌న్ వెనుకే ఉన్నామ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు.. జ‌న‌సేన పార్టీకి సంబంధించి అది ఏ కార్య‌క్ర‌మ‌మైనా., పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసేదైనా., అభిమాన సంఘాల ఆధ్వ‌ర్యంలో జ‌రిగేదైనా., అన్ని వ‌ర్గాల ఆధ‌ర‌ణ చొర‌గొంటున్నాయి.. తాజాగా జ‌న‌సేన పార్టీకి సంబంధించి నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్లు జిల్లాల వారీగా, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌త్య‌ర్ధుల‌కి ధీటుగా ఆవిష్కృత‌మౌతున్నాయి.. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇప్ప‌టికే చాలా క్యాలెండ‌ర్లు హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యం వేదిక‌గా ఆవిష్కరించ‌బ‌డ్డాయి..

img-20170120-wa0025

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా పార్టీ క్యాలెండ‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతున్నాయి.. తాజాగా ప్ర‌కాశం జిల్లా జ‌న‌సేన పార్టీ క్యాలెండ‌ర్‌., హైద‌రాబాద్ కార్యాల‌యంలో ఘ‌నంగా ఆవిష్క‌రించారు.. జిల్లా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల సంఘం అధ్య‌క్షుడు రావూరి బుజ్జి ఆధ్వ‌ర్యంలోని బృందం పార్టీ ఆఫీస్‌కి చేరుకుని అందుబాటులో ఉన్న నాయ‌కుల‌తో క్యాలెండ‌ర్‌ను ఓపెన్ చేయించారు..

img-20170123-wa0002

అందుకు రెండు రోజుల ముందు ప్ర‌కాశం జిల్లా హెడ్‌క్వార్ట‌ర్‌లో జ‌రిగిన క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ మ‌హోత్సవం గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది.. వివిధ వ‌ర్గాల మేధావులు., ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర్చాల్సిన ప‌రిస్థితుల్ని., పార్టీని గ్రామ‌స్థాయిలో బ‌ల‌ప‌ర్చే అంశాల‌కు సంబంధించి కీల‌క చ‌ర్చ జ‌రిగింది.. రావూరి బుజ్జి నాయ‌క‌త్వంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం., ప్ర‌త్య‌ర్ధి పార్టీల నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించింది.. సిట్టింగ్‌లు సైతం జ‌న‌సేన క్యాలెండ‌ర్ ప్రారంభానికి ఎవరెవ‌రు వెళ్లారంటూ ఆరా తీసే స్థాయిలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.. రాష్ట్ర వ్యాప్తంగా మ‌రి కొన్ని చోట్ల కూడా జ‌న‌సేన పార్టీ క్యాలెండ‌ర్లు స‌త్తా చాట‌డం గ‌మ‌నార్హం..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 15 =

%d bloggers like this: