Home / పాలి 'ట్రిక్స్' / ఏపీలో పాల‌కుల్ని జ‌న‌సేన బ‌లం భ‌య‌పెడుతోందా..?

ఏపీలో పాల‌కుల్ని జ‌న‌సేన బ‌లం భ‌య‌పెడుతోందా..?

2014 ఎన్నిక‌ల్లో ఇంటికెళ్లి ఆయ‌న కాళ్లు ప‌ట్టుకుంటే., ప‌బ్బం గ‌డిచిపోయింది.. ప్ర‌త్య‌ర్ధికి ఆధిక్యం ఉన్న ప‌రిస్థితుల నుంచి ఆయ‌న ప్ర‌చారంతో ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టేసింది నేటి ఏపీ స‌ర్కారు.. ఆ సాయం చేసింది ఎవ‌రో అంద‌రికీ తెలిసిందే., జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అది గ‌తం.. మ‌రి భ‌విష్య‌త్తు.. ఆనాడు త‌మ విజ‌యానికి బాట‌లు వేసిన జ‌న‌సేనాని., వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప్రధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి కానున్నారు.. ఆయ‌న ఎదురుపడితే ఎవ‌రికి లాభం..? ప‌వ‌ర్ ప్ర‌త్య‌ర్ధి చేతుల్లోకి మారుతుందా..? రాష్ట్రంలో మ‌రో ప‌వ‌ర్ పాయింట్‌కి నాంది అవుతుందా..? ఇదే భ‌యం ఇప్పుడు పాల‌కుల్ని వేధిస్తోంది.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల ఉన్న వ్య‌తిరేక‌త నానాటికీ పెచ్చుమీరుతోన్న నేప‌ధ్యంలో., ఈ ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్క‌డం ఎలా.? ఇదే టాపిక్‌పై టీడీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి.. ప‌చ్చ మీడియాకి కూడా ఇందులో చోటు ఉంది.. ఫైన‌ల్‌గా సావ ధాన దండోపాయాలు ఏమీ జ‌న‌సేనానికి ఆప‌లేవ‌ని తేలిపోయింది.. మ‌రి ఇప్పుడు అమ‌ల్లో పెట్టాల్సింది.. న‌క్క జిత్తులే..

మీరు ఓడిపోతారు అంటే., మాతో క‌లుస్తారేమో.. అన్న‌దే ఆ ప‌న్నాగం.. ఎందుకంటే ఒంట‌రిగా వెళ్తే న‌ష్ట‌పోతారు అని భ‌య‌ప‌డ‌డానికి ఇక్క‌డ ఉన్న‌ది త‌మ దోస్తీ పార్టీ కాదు.. ఇలాంటి ఆలోచ‌న నుంచి పురుడు పోసుకున్న‌దే ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే డ్రామా.. అస‌లు ఈ స‌ర్వేకి ఆధ్యుడుగా చెబుతున్న వ్య‌క్తి., ఇంట్లో కూర్చుని చేసిన ర‌చ‌న ఇది అన్న‌ది ఓ టాక్ అయితే., స‌ర్వే టీం జ‌నంలోకి వెళ్లిన చోట కూడా అధికార పార్టీకి గుండె గుభేలుమ‌నే నిజాలు భ‌య‌టికి వ‌చ్చాయి.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన పూర్తి నిర్మాణాత్మంగా బ‌రిలోకి దిగితే., ప్ర‌స్తుతం బ‌రిలో ఉన్న ప్ర‌ధాన పార్టీల‌కు రెండింటికీ చుక్క‌లు క‌న‌బ‌డ‌టం ఖాయ‌మంట‌.. 85 స్థానాలు క‌ళ్లు మూసుకుని వ‌చ్చేస్తాయ‌ని తేలింది.. కాస్త గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డితే., ఈ సీట్ల సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చంట‌..

15253635_374484246233764_1285920376422631062_n-copy

ఒరిజిన‌ల్ రిపోర్టుల దెబ్బ‌కి క‌ళ్లు తిరిగిన పాల‌కులు, వారి అధికారిక మీడియా., తాజా ఏబీఎన్ స‌ర్వేకి రూప‌క‌ల్ప‌న చేశారంట‌.. దీనికి సంబంధించిన గ్రాఫ్‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. అంతేకాదు ఏబీఎస్ స‌ర్వే జ‌న‌సైన్యంలో క‌సిని మ‌రింత పెంచింది.. మ‌రికొన్ని వ‌ర్గాల‌ను జ‌న‌సేనానికి చేరువ కూడా చేసింది.. మీరాలోచించిన చెడు కూడా జ‌న‌సేనానికి మంచే అయ్యింది.. ఫీల్ అవ‌కండే.. ఆయ‌న్ని ఎదుర్కొనేందుకు మ‌రేదైనా మార్గం ఉందేమో వెతుక్కోండి.. వెతుక్కునే ముందు ఒక‌టి మాత్రం గుర్తుంచుకోండి., మీ తాటాకు చ‌ప్పుళ్ల‌కి భ‌య‌ప‌డ‌డానికిఇ అక్క‌డ ఉన్న‌ది కుందేలు కాదు.., సింహం.. సింగిల్‌గానే వ‌స్తుంది.. స్వీప్ చేసేస్తుంది..

Share This:

2,076 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

One comment

  1. Yes ur right.youth is with our Janasena .vallu enni naatakalu adina prayojanam sunyam.jai Pawanism .jaihindh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + 20 =