Home / జన సేన / ఏపీలో వీస్తున్న‌ది జ‌న‌సేన ప‌వ‌నాలే – రాజ‌కీయ వ్య‌వ‌హారాల చైర్మ‌న్ మాదాసు

ఏపీలో వీస్తున్న‌ది జ‌న‌సేన ప‌వ‌నాలే – రాజ‌కీయ వ్య‌వ‌హారాల చైర్మ‌న్ మాదాసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని వ‌ర్గాలు జ‌న‌సేన పార్టీకి బ్ర‌హ్మ‌రథం ప‌ట్టాయ‌ని, అది చూసి వ‌ణుకు పుట్టి ప్ర‌త్య‌ర్ధులు ఎగ్జిట్ పోల్స్ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నాయ‌ని పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితులు జ‌న‌సేన పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయ‌ని, కార్య‌క‌ర్త‌లు ఎవరూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు.. జ‌న‌సేన పార్టీ విజ‌య‌వాడ కార్యాల‌యం నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాదాసు ఓ వీడియో సందేశం పంపారు.. జ‌న‌సేన పార్టీ బ‌లం చూసి ఓర్వ‌లేకే పాల‌క ప్ర‌తిప‌క్షాలు లెక్క‌లేన‌ట్టు మాట్లాడుతూ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌న్నారు.. కేవ‌లం జ‌న‌సేన పార్టీ మాత్ర‌మే ఎన్నిక‌ల్లో డ‌బ్బుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా సామాన్యుల‌కు సీట్లు కేటాయించిందనీ, సామాన్యుడికి రాజ‌కీయ జీవితం ప్ర‌సాధించే ఉద్దేశంలో జ‌న‌సేనాని సీట్లు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.. ప్ర‌త్య‌ర్ధి పార్టీలు ఓట్ల కోసం కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు చేసినా., అణ‌గారిన వ‌ర్గాలు, మైనారిటీల మ‌ద్ద‌తుతో జ‌న‌సేన పార్టీ గెలుపు దిశ‌గా అడుగులు వేసింద‌న్నారు.. అది చూసి పాల‌క ప్ర‌తిప‌క్షాలు ఎగ్జిట్ పోల్స్ అంటూ మైండ్ గేమ్ మొద‌లుపెట్టాయ‌న్నారు.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు చాలా సంద‌ర్బాల్లో త‌ల్ల‌కిందుల‌య్యాయన్న మాదాసు., మొన్నీ మ‌ధ్య తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎగ్జిట్ పోల్స్ ఏమ‌య్యాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌ని తెలిపారు.. ఎగ్జిట్ పోల్స్ వ్య‌వ‌హారం అంతా ఇప్పుడు ఓ వ్యాపారం అయిపోయింద‌ని ఆరోపించారు.. బెట్టింగ్ మాఫియాల‌ను ప్రోత్స‌హిస్తూ చాలా సంసారాలు నాశ‌నం అవ‌డానికి ఈ ఎగ్జిట్ పోల్స్ కార‌ణ‌మ‌య్యాయంటూ మండిప‌డ్డారు.. యువ‌త‌, మ‌హిళ‌లు, బీసీలు, షెడ్యూల్ కులాల నుంచి జ‌న‌సేన పార్టీకి భారీగా మ‌ద్ద‌తు లభించిన‌ట్టు పార్టీ అంత‌ర్గ‌త నివేధిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని తెలిపారు.. జ‌న‌సేన పార్టీ చ‌రిత్ర సృష్టించి తీరుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు..
కౌంటింగ్‌లో జాగ్ర‌త్త‌..
జ‌న‌సైనికులు కౌంటింగ్ సంద‌ర్బంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని., ఇప్ప‌టికే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కు సంబంధించి పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టికే బుక్స్ ఇచ్చామ‌ని మాదాసు తెలిపారు.. కౌంటింగ్ సంద‌ర్బంగా ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా వాద‌ప్ర‌తివాద‌న‌ల‌కు తావివ్వ‌కుండా రిటర్నింగ్ ఆఫీస‌ర్‌కు లిఖిత పూర్వ‌కంగా తెలియ ప‌ర్చాల‌ని సూచించారు.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌ల‌వాలంటూ చాలా మంది మెసేజ్‌లు పెడుతున్నారన్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్., గురువారం ఎవ‌రూ విజ‌యవాడ రావ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు ఉండి అభ్య‌ర్ధుల‌కు స‌హ‌క‌రించాల‌ని సూచించారు.. పార్టీ అధినేత త్వ‌ర‌లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అంద‌ర్నీ క‌లుస్తారని తెలిపారు..

Share This:

775 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + 1 =