Home / పోరు బాట / ఏపీలో సంత‌కాల‌ సేక‌”ర‌ణ” హోరు.. సేనాని హోదా పోరుకు పెరుగుతున్న మ‌ద్ద‌తు..

ఏపీలో సంత‌కాల‌ సేక‌”ర‌ణ” హోరు.. సేనాని హోదా పోరుకు పెరుగుతున్న మ‌ద్ద‌తు..

img-20161113-wa0005 img-20161113-wa0007 ప్ర‌త్యేక హోదా పేరు చెప్ప ఓట్లు దండుకుని., ప‌బ్బం గ‌డిచాక తూచ్ అంటూ జ‌నాన్ని మోసం చేసిన పాల‌కుల కోట‌ల‌కు బీట‌లు వారే రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి.. ఆ నాడు నేటి పాల‌కుల‌కి ఓట్లు వేయండి అని చెప్పిన జ‌న‌సేనాని., వారి వంచ‌న తెలుసుకుని పోరుబాట ప‌ట్టారు.. ప్ర‌త్యేక హోదా ఇస్తారా చ‌స్తారా అంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను న‌డిరోడ్డుపై నిల‌దీస్తున్నారు.. ప్ర‌త్యేక హోదా కాదు అంత‌కు మించిన ప్యాకేజీ ఇచ్చేశామంటూ డ‌బ్బాలు కొట్టుకుంటున్న నాయ‌కుల న‌య‌వంచ‌న‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన ప‌వ‌ర్ స్టార్‌.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదంతో ముందుకి సాగుతున్నారు.. తాజాగా అనంత వేదిక‌గా ఆయ‌న గ‌ర్జించారు.. ప్యాకేజీ లోగుట్టు జ‌నం ముందు విప్పారు.. హోదా ఇచ్చే వ‌ర‌కు పోరాటం అపేది లేద‌ని., ఎలాంటి ప‌రిస్థితులు వ‌చ్చినా మ‌డ‌మ తిప్పేది లేద‌ని తేల్చేశారు.. దీంతో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరాటానికి మ‌ద్ద‌తుగా ఆయ‌న సైన్యం రంగంలోకి దిగింది.. రాజ‌ధాని వేదిక‌గా హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మాన్ని మొద‌లు పెట్టింది.. మ‌న పార్టీ వెబ్ pawantoday.com పిలుపుకి అపూర్వ స్పంద‌న వ‌చ్చింది..

img-20161113-wa0027 img-20161113-wa0022 img-20161113-wa0016

అనంత‌లో ఆయ‌న గ‌ర్జిస్తుంటే., ఆదే స‌మ‌యంలో బెజ‌వాడ వేదిక‌గా జ‌న‌సేన యువ నేత మండ‌లి రాజేష్ ఆధ్వర్యంలో ఈ ఉద్య‌మానికి మొల‌క ప‌డ‌గా., రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్ సైన్యం ముందుకి క‌దిలింది.. pawantoday.com పిలుపుతో త‌మ త‌మ ప్రాంతాల్లో స్వ‌చ్చందంగా ఈ సంత‌కాల సేక‌ర‌ణ ఉద్య‌మాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.. ప‌వ‌న్ అభిమానుల్లో ఈ మ‌హోద్య‌మానికి మ‌రింత ఉత్సాహాన్నిచ్చేందుకు., బెజ‌వాడ‌లో రాజేష్ యువ‌సేన ముందుకి క‌దిలింది.. ప‌వ‌ర్‌స్టార్ స్ఫూర్తితో ప్ర‌త్యేక హోదాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వాడ‌వాడ‌లా పాద‌యాత్ర మొద‌లు పెట్టింది.. హోదా వ‌ల్ల అంద‌రి జీవితాలు భాగుప‌డ‌తాయ‌ని చెబుతూ., జ‌న‌సేనాని ఉద్య‌మానికి స్వ‌చ్చంద‌గా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పేరు పేరునా కోరారు.. అందుకు ప్ర‌జ‌ల నుంచి కూడా అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది.. ప్యాకేజీ పేరుతో పాల‌కులు మోస‌గించార‌న్న విష‌యాన్ని జ‌న‌సేనాని మాట‌ల్లో విన్న జ‌నం., ఉద్య‌మంలో మేము సైతం అంటున్నారు.. అంతా స్వ‌చ్చందంగా సంత‌కాలు చేస్తూ., హోదా పోరుకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.. రాష్ట్రంలో ప్ర‌తి పౌరుడూ జ‌న‌సేనాని ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను చాటుతున్నారు..

ఇప్పుడు ప‌ది వేల మంది సంత‌కాల‌తో అని ప్రారంభ‌మైన ఉద్య‌మం కాస్తా., ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతోంది.. పాల‌కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − 10 =

%d bloggers like this: