Home / పవన్ టుడే / ఏపీలో 175 స్థానాల‌పై జ‌న‌సేన గురి.. జ‌న‌సేనుడి రాజకీయ వ్యూహంతో ప్ర‌త్య‌ర్ధుల్లో అల‌జ‌డి..

ఏపీలో 175 స్థానాల‌పై జ‌న‌సేన గురి.. జ‌న‌సేనుడి రాజకీయ వ్యూహంతో ప్ర‌త్య‌ర్ధుల్లో అల‌జ‌డి..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేసే ప్ర‌తి అడుగు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉధ్య‌మంలో త‌న పాత్ర ఎంత కీల‌క‌మో చాటిచెప్పిన జ‌న‌సేనాని., ఒక్క‌టంటే ఒక్క మాట‌తో., ఒక్క ఎంపి లేకుండా హ‌స్తిన‌లో అల‌జ‌డి పుట్టించారు.. అవిశ్వాసం పెట్టండి ఆన్న ఆయ‌న సూచ‌న పార్ల‌మెంటులో ప్ర‌కంప‌న‌లు రేపింద‌న్న విష‌యం నిర్వివాదాంశం.. మిత్రధ‌ర్మం అడ్డుప‌డో, విభ‌జ‌న‌తో ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌జ‌ల్ని మ‌రింత ఇబ్బందుల‌కి గురిచేయ‌డం ఇష్టం లేక‌నో., నాలుగేళ్ల పాటు టీడీపీ స‌ర్కారు చేసిన త‌ప్పుల్ని లెక్క‌పెట్టుకుంటూ వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుక మ‌డ‌చి మాట‌లు మార్చ‌డంతో, ఆ ప్ర‌జావంచ‌న‌ను మార్చ్ 14వ తేదీ సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.. పాల‌కులు,ప్ర‌తిప‌క్షాలు త‌ప్పు చేస్తున్నా., త‌ప్ప‌ని వేలెత్తిచూప‌లేని ప‌చ్చ మీడియాకి ఎదురెళ్లి అక్క‌డా త‌న పంజా ప‌వ‌ర్ చాటారు.. జ‌న‌సేనుడి వ‌రుస దాడుల‌తో నిద్రక‌రువైన ప్ర‌త్య‌ర్ధుల‌కి ఇప్పుడు అస‌లు దెబ్బ ప‌డింది.. జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్యూహర‌చ‌న ప‌వ‌ర్ ఏంటో ఓ శాంపిల్ బ‌య‌ట‌పెట్టారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

దేవ్‌.. రాజ‌కీయ వ్యూహ ర‌చ‌న‌లో ఆయ‌న ఎక్స్‌ప‌ర్ట్‌.. ప‌ది నెలలుగా అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్‌లో ఉన్నారు.. ఈ విష‌యం కేవ‌లం జ‌న‌సేన అధినేత‌కి మిన‌హా పార్టీలో ఎవ్వ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకున్నారు.. జ‌న‌సేన పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, బ‌రిలోకి దిగే అంశంపై దేవ్‌కి ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చాక‌.. జ‌న‌సేనుడి ముందు నివేదిక పెట్టాక‌.. త‌న ఎన్నిక‌ల స్ట్రాట‌ర్జీ బ‌య‌ట‌పెట్టారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. పార్టీ కార్యాల‌యానికి ముఖ్య‌కార్య‌క‌ర్త‌ల‌ని పిలిచి మ‌రీ జ‌న‌సేన వ్యూహాలు ఎలా ఉండ‌బోతున్నాయో స్వ‌యంగా వివ‌రించారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సంబంధించి 175 స్థానాల్లో జ‌న‌సేన పార్టీ పోటీ చేసేందుకు ప‌క్కా వ్యూహాలు సిద్ధంగా ఉన్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. పూర్తి స్థాయి ప్ర‌ణాళికా బ‌ద్దంగా అడుగులు వేద్దామంటూ కార్య‌క‌ర్త‌ల్లో విశ్వాసాన్ని నింపారు..

పార్టీ ముఖ్య‌కార్య‌క‌ర్త‌ల‌కి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త దేవ్‌ని ప‌రిచ‌యం చేసిన ప‌వ‌న్‌, ప‌ది నెల‌లుగా జ‌న‌సేన‌కు ఆయ‌న ప‌నిచేస్తున్న‌ట్టు తెలిపారు.. సంస్థాగ‌త నిర్మాణ‌ప‌ర‌మైన విధానాల రూప‌క‌ల్ప‌న‌కు పార్టీలో ఉంటార‌ని తెలిపారు.. 350 మంది టీమ్‌తో దేవ్ ప‌ని చేస్తార‌ని., ఆయ‌న‌కు కామ‌న్ మేన్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ నాటి కార్య‌క‌ర్త‌లు స‌హ‌కారం అందిస్తార‌ని తెలిపారు.. పూర్తి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన బ‌ల‌మైన బావ‌జాలంతో జ‌న‌సేన నిర్మిత‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించారు..

గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేద్దామ‌న్న ఆలోచ‌న వ‌చ్చినా., పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఆయ‌న ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ముందుగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న అవ‌స‌రం.. అవేమీ లేకుండా గెలిచేస్తే., ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే అవ‌స‌ర‌మే రాదు.. అందుకే పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని పూర్తి స్థాయిలో ప్ర‌జాక్షేత్రంలో స‌న్న‌దం చేశాకే.. ముంద‌డుగు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు.. ప్ర‌త్య‌ర్ధులు చెప్పిన‌ట్టు జ‌న‌సేన పార్టీకి అనుభ‌వం లేక‌పోవ‌చ్చు గానీ, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి మాత్రం రెండు ఎన్నిక‌ల్లో క్రియాశీల‌క అనుభ‌వం ఉంద‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు..

ఇక ప్ర‌త్యేక హోదా సాధ‌న, విభ‌జ‌న హామీల అమ‌లుకి సంబంధించి ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని తెలియ‌ప‌రిచేలా అతి త్వ‌ర‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌నున్న‌ట్టు కూడా చెప్పి జ‌న‌సేనాని మ‌రో బాంబు పేల్చారు.. ఈ నెల 11 లోపే ఈ ప‌ర్య‌ట‌న‌కి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.. ఏ ఊరి నుంచి యాత్ర ఉంటుంది అనేది అప్పుడే చెబుతాన‌న్న ఆయ‌న‌., ప్ర‌క‌టించిన 48 గంట‌ల్లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉండ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. జ‌న‌సేన అధినేత తాజా ప్ర‌క‌ట‌న‌తో అధికార‌-ప్ర‌తిప‌క్షాలు సందిగ్ధంలో ప‌డ్డాయి.. ఒక్కో అడుగూ ప‌క్కా వ్యూహాత్మ‌కంగా వేస్తున్న జ‌న‌సేనుడు., రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిని మ‌రోసారి రుచిచూపారు..

Share This:

3,526 views

About Syamkumar Lebaka

Check Also

అహం బ్రహ్మాస్మి..! (పిట్టల దొరలు అంతే..! పిట్టల దొరలు అంతే..!) అంతేగా..అంతేగా..అంతేగా..

“సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం మా భువనేశ్వరితోనే ప్రారంభం అయ్యింది” అంటూ బాబోరు ఉద్ఘాటించారు. అది విన్న ప‌చ్చ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 12 =