Home / పెన్ పోటు / ఏబీఎన్ ఎల్లో స‌ర్వేలో నిబ‌ద్ద‌త నేతిబీర‌లో నేతి చంద‌మే..

ఏబీఎన్ ఎల్లో స‌ర్వేలో నిబ‌ద్ద‌త నేతిబీర‌లో నేతి చంద‌మే..

స‌ర్వే పేరుతో ప‌చ్చ మీడియా ఏబీఎన్‌(సిబిఎన్‌), దాని అధినేత రాధాకృష్ణ చేస్తున్న హ‌డావిడి.. చాల్లే ఎవ‌రైనా వింటే న‌వ్విపోదురు అన్న చందంగా ఉంది.. టీడీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి స‌ద‌రు మీడియా., ప్ర‌భుత్వ అధికారిక ఛాన‌ల్‌గా మారిపోయిన విష‌యం జ‌గ‌ద్విత‌మే. స‌ర్కారీ కార్య‌క్రామాల లైవ్‌లు కావాల‌న్నా ఏబీఎన్ ఉర‌ఫ్ సీబీఎన్ నుంచి అంతా సిగ్న‌ల్ తీసుకోవాల్సిందే.. దాని వెనుక భారీ ఆర్ధిక ఒప్పంద‌మే ఉంద‌న్న‌ది కూడా మీడియాలో టాక్‌.. ఇక ఆ ప‌చ్చ ఛాన‌ల్ సిఎండి రాధాకృష్ణ గారికి సిఎంతో ఉన్న బంధం కూడా చాలా దృడ‌మైన‌ది.. ఆయ‌న కోసం ఈయ‌న ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు.. స‌ర్కారీ వ్య‌వ‌హారాల్లో ఆయ‌న మాట కూడా అంతే చెల్లుబాటు అవుతుంది.. మంత్రులు కూడా సొంత వ్య‌వ‌హారాలు ఏమైనా ఉంటే రాధాకృష్ణ ద్వారానే బాబుగారికి విన్న‌వించుకుంటార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.. మ‌రి అలాంటి వ్య‌క్తి స‌ర్వే అంటే అది ఎవ‌రికి ఫేవ‌ర్‌గా ఉంటుందో.. వేరే చెప్పాలా.. మ‌రి మీరు ముందే టీడీపీకి ఫేవ‌ర్‌గా రిజ‌ల్ట్ అనౌన్స్ చేయాల‌నుకున్న‌ప్పుడు., ఈ బూట‌క‌పు స‌ర్వేలు ఎందుకు.. ఇలాంటివి చూస్తే జ‌నం ఏమ‌నుకుంటార‌న్న ఆలోచ‌న కూడా లేని మీరు ఏ కోవ‌కి చెందుతారు.. నిత్యం స‌ర్కారీ పాట పాడే మీరు., ప‌చ్చ చొక్కాల మెప్పు పొందాలంటే., పాల‌నను పొగుడుతూ వార్త మీద వార్త రాసుక‌వ‌చ్చు క‌దా.. సొంత లెక్క‌ల్ని జ‌నంపై రుద్ద‌డం ఎందుకు..

15253511_379583032388354_4726081231141937904_n

ఇక మీ స‌ర్వేకి ప్రామాణికం ఏంటి..? ఎంత మంది ద‌గ్గ‌ర మీరు అభిప్రాయాలు సేక‌రించారు..? రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లోనే జ‌నాభా ఐదు కోట్ల పైచిలుకు., ఇప్పుడు ఆ సంఖ్య మ‌రి కాస్త పెరిగి ఉంటుంది.. ఇందులో ఎంత మంది ఒపీనియ‌న్లు సేక‌రించారు.. ఎక్క‌డెక్క‌డ సేక‌రించారు.. స‌ర్వే అంటే నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌నీసం ఉన్న మందిలో ప‌ది శాతం నుంచి ఒపీనియ‌న్స్ స్వీక‌రించాలి.. మాది ఫ్లాష్ స‌ర్వే ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు వేల మంది చొప్పున అభిప్రాయాలు సేక‌రించాం అంటే., దానికున్న నిబ‌ద్ద‌త ఎంత‌..? ఆ నియోజ‌క‌వ‌ర్గాలు ఏవి..? అభిప్రాయాలు మీ అనుకూలురు ద‌గ్గ‌ర మాత్ర‌మే సేక‌రించి., అంకెల గార‌డీ చేస్తే అయిపోతుందా..? లేక మీ పాత్రికేయ వ‌ర్గం మీకు భ‌య‌ప‌డి., ఇచ్చిన‌వా..? ఒక వేళ మీరు మీ మ‌చ్చ‌ల నాలుక‌తో ప‌ది శాతం ప‌బ్లిక్ ద‌గ్గ‌ర అభిప్రాయాలు సేక‌రించాం అని చెప్పరు క‌దా..? ఎందుకంటే ఇప్ప‌టికే జ‌నం మా అభిప్రాయం కాదంటే., మా అభిప్రాయం కాదు అంటూ ముఖాముఖాలు చూసుకుంటున్నారు.. చంద్ర‌బాబు గారి కోడ‌లు బ్ర‌హ్మ‌ణి వేయించిన స‌ర్వేలో స‌ర్కారీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తుంటే., జ‌నం అనుకుంటున్న‌ట్టు దాన్ని సానుకూలంగా మార్చేందుకు మీ ప‌చ్చ ఇంకు పేప‌ర్‌పై పెట్టారా..?

చంద్ర‌బాబు, వైసీపీల వ్య‌వ‌హారం ప‌క్క‌న పెడితే జ‌న‌సేనాని మీ వ‌ద్ద ఎందుకు మార్కులు సాధించ‌లేక‌పోయారు..? గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీల సంయుక్త భాగ‌స్వామ్యానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ఇస్తే ప‌డిన ఓటింగ్ శాతం 14.. ఇది స్వ‌యంగా టీడీపీ నేత‌లే ఒప్పుకున్న వాస్త‌వం.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ జ‌నంలో ఆయ‌న కీర్తి ఇంతింతైంద‌న్న‌ది ప్ర‌భుత్వ‌-ప్ర‌తిప‌క్షాలు విడివిడిగా నిర్వ‌హించిన స‌ర్వేల్లో తేలిపోయింది.. అలాంట‌ప్పుడు జ‌న‌సేనానికి మీరిచ్చిన మూడు శాతం ఎక్క‌డిది.. కొంప‌తీసి స‌ర్వేలో మీ ప‌చ్చ చొక్కాల‌కి వ‌చ్చిన పాయింట్ల‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఆపాదించ‌లేదు క‌దా.. మీరు అంత‌టి స‌మ‌ర్ధులే., అందుకే జ‌నంతో చివాట్లు తింటున్నారు.. ఇక‌నైనా కాస్త నైతిక‌త‌కు ప్రాధాన్యం ఇవ్వండి లేక‌పోతే మీ ప‌త్రిక‌, ఛాన‌ళ్లు మీరూ మీ ప‌చ్చ‌చొక్కాలే చూసుకోవాల్సి వ‌స్తుంది…

Share This:

1,422 views

About Syamkumar Lebaka

Check Also

నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

సత్యమేవ జయతే అంటూ దెయ్యాలు “వేదాలు” వల్లిస్తున్నాయి? దుర్మార్గులు “సన్మార్గం” గురించి మాట్లాడుతున్నారు! ప్రస్తుత మన రాజకీయ-మీడియా పరిస్థితులు చూస్తుంటే, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − 6 =