Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ఏబీఎన్ స‌ర్వేకి జ‌న‌సైన్యం కౌంట‌ర్‌..

ఏబీఎన్ స‌ర్వేకి జ‌న‌సైన్యం కౌంట‌ర్‌..

15241211_1042443519199861_1873884330132970026_n 15349700_1042444462533100_2075890379987566944_n జ‌న‌సేనాని ల‌క్ష్యంగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి రూప‌క‌ల్ప‌న చేసిన బూట‌క‌పు స‌ర్వే స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.. ప్ర‌జ‌ల్లో జ‌న‌సేనానికి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక‌., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఆయ‌న పార్టీల‌పై విషం చిమ్మ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌ర్వేను ప్ర‌చురించారు.. ఏబీఎన్‌ స‌ర్వేకీ, వాస్త‌వ ప‌రిస్థితుల‌కీ మ‌ధ్య భారీ అంత‌రం ఉండ‌డంతో., అస‌లు స‌ర్వే అంటే ఏంటి..? దానికి ఎలాంటి ప్ర‌మాణాలు పాటిస్తారు..? ఎలా నిర్వ‌హిస్తారు..? అన్న ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్ర ఉత్ప‌న్న‌మ‌య్యాయి.. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌జ‌ల అభిప్రాయం ప్ర‌చురించాల‌నుకున్న‌ప్పుడు., క‌నీసం జ‌నాభాలో 10 శాతం మంది అభిప్రాయాలు సేక‌రించాల్సి ఉంటుంది.. అభిప్రాయాలు ఏ ఏ అంశాల‌పై సేక‌రించారు..? ఎలా సేక‌రించారు అనే అంశానికి సంబంధించి పూర్తి వివ‌రాల‌తో కూడిన డేటాను కూడా స‌ద‌రు సంస్ధ పొందుప‌ర్చాల్సి ఉంటుంది.. అయితే ఏబీఎన్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఇలాంటివి ఏమీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.. ఈ స‌ర్వేకి సంబంధించిన అంకెలు త‌ప్ప‌., అస‌లు స‌ర్వే ఎప్పుడు నిర్వ‌హించారు..? ఎలా నిర్వ‌హించారు అనే అంశాలు ఆ సంస్థ‌లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కి సైతం తెలియ‌క‌పోవ‌డం విడ్డూరం

అందుకే స‌ర్వే అంటే ఇలా నిర్వ‌హించాలి అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఏబీఎన్‌, దాని సీఎండికి కౌంట‌ర్‌గా అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టారు.. వీరు నిర్వ‌హించిన స‌ర్వేకి సంబంధించి పూర్తి వివ‌రాలు.., వీడియో ఫుటేజ్‌తో స‌హా రికార్డు చేసి., అందుకు సంబంధించిన వీడియో మాంటేజ్‌ని యూట్యూబ్‌లో ఉంచారు.. స‌ర్వే అంటే ఇది.. జ‌నాభిప్రాయ సేక‌ర‌ణ అంటే ఇది.. ఇలా మీరు రియ‌ల్‌గా స‌ర్వే చేస్తే., పూర్తి వివ‌రాలు మీ మీడియాలో ప్ర‌చురించాలంటూ కౌంట‌ర్లు విసురుతున్నారు.. పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లో సాధార‌ణ ప్ర‌జానికం నుంచి సేక‌రించిన ఈ అభిప్రాయ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది..

Share This:

479 views

About Syamkumar Lebaka

Check Also

వెన్నుపోట్ల‌తో సిఎం కావాల‌నుకోవ‌ద్దు.. నారా లోకేష్‌కి జ‌న‌సేనుడి హిత‌వు..

జ‌న‌సేన పోరాట యాత్ర‌లో ప్ర‌తి అడుగులో ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి చ‌లించిపోయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆ క‌ష్టానికి కార‌ణ‌మైన పాల‌కులను న‌డిరోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × two =

%d bloggers like this: