Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ఏబీఎన్ స‌ర్వేపై టీం జ‌న‌సేన స్పంద‌న‌.. ప్రామాణిక‌త ఏంటో చెప్పాల‌ని ప్ర‌శ్న‌..

ఏబీఎన్ స‌ర్వేపై టీం జ‌న‌సేన స్పంద‌న‌.. ప్రామాణిక‌త ఏంటో చెప్పాల‌ని ప్ర‌శ్న‌..

గ‌త నాలుగు రోజులుగా స‌ర్వే పేరుతో హ‌ల్ ఛ‌ల్ చేస్తున్న ఏబీఎన్(సీబీఎన్‌) ఆంధ్ర‌జ్యోతి., పూర్తిగా జ‌న‌సేనాని ల‌క్ష్యంగా దీనికి రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు స్ప‌ష్టంగా అర్ధ‌మౌతోంది.. అయితే ఓట్లు రావ‌న్నా., ప‌నితీరు భాగాలేద‌న్నా ఏమ‌న్నా జ‌న‌సేనాని మౌన‌మే వ‌హించారు.. జ‌న‌సేనానికి బ‌దులు ఏబీఎన్ రాధాకృష్ణ‌కి చివాట్ల‌తో జ‌నమే బ‌దులిస్తున్నారు.. ఇంకా ప‌వ‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందా..? ఇదంతా ప‌క్క‌న పెడితే ఎలాగైనా జ‌న‌సేనానిని త‌మ ఉచ్చులోకి లాగాలి., ఆయ‌న స్పందిస్తే., ఏదో ఒక మ‌కిలి ఆయ‌న‌కి అంటించాలని భావిస్తున్న ఏబీఎస్‌., చివ‌రికి కుల స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది.. అయినా వ‌ర్క‌వుట్ కాలేదు.. అయితే ఏద‌న్నా ఊర‌కుంటే., అది చేత‌కాని త‌న‌మౌతుందేమొనన్న భావ‌న‌తో చివ‌రికి జ‌న‌సేన టీం స్పందించింది.. పార్టీలోని ఓ కీల‌క స‌భ్యుడు ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కి చెందిన ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుని పిలిపించుకుని., అస‌లు మీరు వేస్తున్న స‌ర్వేకి ప్రామాణిక‌త ఏంటి..? ఎంత మంది అభిప్రాయాలు సేక‌రించారు..? ఆ స‌ర్వే నిజంగా చేయించారా లేదా వంటి ప్ర‌శ్న‌లు అడిగారు.. అయితే ఆ పాత్రికేయుడి నుంచి చిత్ర‌మైన స‌మాధానం వ‌చ్చింది.. స‌ర్వేకీ ఏబీఎన్‌లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కీ ఎలాంటి సంబంధం లేదంట‌.. కేవ‌లం గ‌ణాంకాలు రాధాకృష్ణ ఇస్తే., యాజ‌మాన్యం స్టాండ్‌కి క‌ట్టుబ‌డి వీరు దాన్ని తెర‌కెక్కిస్తున్నారంట‌.. ఫ్లాష్ స్వ‌చ్చంద సేవా సంస్థ నిర్వాహ‌కుడు శ్రీనివాస్ ఆ స‌ర్వే వ్య‌వ‌హారం మొత్తం చూసుకున్న‌ట్టు ఆ పాత్రికేయ మిత్రుడు బ‌దులిచ్చారు…

ఇంత‌కీ ఈ శ్రీనివాస్ ఎవ‌రు..? ఆయ‌న ఎక్క‌డెక్క‌డ స‌ర్వే నిర్వ‌హించారు.. ఎలాంటి ప్రామాణిక‌త‌ను పాటించారు.. అంటే అందుకు సంబంధించి కూడా సిబ్బంది ద‌గ్గ‌ర ఎలాంటి బ‌దులూ లేదు.. అయితే స‌ద‌రు శ్రీనివాస‌రావు వివ‌రాలు సేక‌రిస్తే., స‌ర్వేలో నిబ‌ద్ద‌త ఏ పాటిదో తేలిపోయింది.. ఈ శ్రీనివాస‌రావు స‌ర్వేలే అల్ల‌డంలో సిద్ధ‌హ‌స్తుడేనంట‌.. అయితే తాజా స‌ర్వే కోసం మాత్రం ఆయ‌న ఎలాంటి క‌ష్ట‌మూ ప‌డ‌లేదంట‌.. ఇంట్లో కూర్చునే అంకెల గార‌డీ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి.. సైదా స‌ద‌రు శ్రీనివాస్ గారికి ఎవ‌రు అధికారంలో ఉంటే వారి పాట పాడే అల‌వాటు కూడా ఉందంట‌.. ఏలూరు బార్ కౌన్సిల్‌లో కీల‌క‌పాత్ర పోషించే ఈయ‌న ప‌వ‌ర్‌ని బ‌ట్టి అటూ ఇటూ మారిపోతూ ఉంటారంట‌.. అంటే ఈయ‌న‌గారి క్రెడిబులిటీ ఇట్టే అర్ధ‌మ‌వుతోంది.. తాజా స‌ర్వేకి కూడా భారీ ఎత్తున సొమ్ములు చేతులు మార‌య‌న్న ఆరోప‌ణ‌లు కూడా విన‌బ‌డుతున్నాయి.. స‌ద‌రు వ్య‌క్తి సొంత జిల్లాలో ఏ ఎమ్మెల్యే తిరిగి గెలుస్తామ‌న్న గట్టిగా చెప్ప‌లేక‌పోతున్నారు.. మ‌రి జిల్లాలో టాక్ అదయితే., మ‌రి ఈయ‌న‌గారి స‌ర్వే మాట ఏంటి.. ఐదున్న‌ర కోట్ల జ‌నాభా ఉన్న ఏపీలో మీరు ఎంత మంది ద‌గ్గ‌ర అభిప్రాయాలు సేక‌రించారు.. అందుకు సంబంధించిన ప్ర‌తులు ఎక్క‌డ‌.. ఇవేమీ లేకుండా స‌ర్వే రిపోర్టు ఇచ్చేశారా.. అంటే మీ స‌ర్వే విలువ ఏంటో ఇట్టే తెలిసి పోతుంది.. మ‌రి ఇప్ప‌టికైనా మీరు మార‌రా రాధాకృష్ణ‌గారు..

Share This:

1,243 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 12 =