Home / జన సేన / ఐదేళ్ల స‌మ‌స్య‌.. ఐదు రోజుల్లో ప‌రిష్కారం చూపిన నెల్లూరు జ‌న‌సైన్యం.. మూడు గ్రామాల‌కి ఊర‌ట‌..

ఐదేళ్ల స‌మ‌స్య‌.. ఐదు రోజుల్లో ప‌రిష్కారం చూపిన నెల్లూరు జ‌న‌సైన్యం.. మూడు గ్రామాల‌కి ఊర‌ట‌..

ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల్లో ఉన్నారు.. ఆ స‌మ‌స్య ప‌రిష్క‌రించాలి.. దానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనుస‌రించే ఫార్ములా.. మూడంచెల విధానం.. ముందుగా స‌మ‌స్య ప‌రిశీల‌న‌, స‌మ‌స్య‌పై అవ‌గాహ‌న‌.. త‌ర్వాత ప్ర‌భుత్వానికి-అధికారుల‌కి బాధ్య‌త గుర్తు చేయ‌డం.. అంత‌కీ ప‌ట్టించుకోని ప‌క్షంలో ప్ర‌జ‌ల త‌రుపున పోరాటం చేయ‌డం.. జ‌న‌సేనాని ర‌గిల్చిన ఈ స్ఫూర్తి తెలుగు రాష్ట్రాల్లోని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో భాగానే నాటుకుపోయింది.. ఇప్పుడు ఎక్క‌డ ప్ర‌జ‌ల‌కి ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌న‌సేన కార్య‌ర్త‌లు ముందుగా ఆ స‌మ‌స్య‌పై పూర్తిగా అధ్య‌య‌నం చేస్తున్నారు.. ప్ర‌జ‌ల ఇబ్బందుల‌కి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుంటున్నారు.. ప‌రిష్కార మార్గాలు క‌నుగొన్న త‌ర్వాతే., ముంద‌డుగు వేస్తున్నారు.. నెల్లూరు రూర‌ల్‌లో పరిధిలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మూడు గ్రామాల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిన తీరే అందుకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ‌..

నెల్లూరు న‌గ‌రానికి 15 కిలోమీట‌ర్ల దూరంలోని కొడ‌వ‌లూరు మండ‌ల పరిధిలోని చ‌లివేంద్ర‌, కొండాయ‌పాలెం,త‌ల‌మంచి గ్రామాల ప్ర‌జ‌లు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఓ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.. ఆ స‌మ‌స్య గ్రామాల‌పై ఈగ‌ల దాడి.. ఈ ఈగ‌ల‌తో వీరు ప‌డే అవ‌స్థ‌లు వ‌ర్ణ‌నాతీతం.. ఆహారంపై మూత తీయ‌డానికి ఉండ‌దు., కంచంలో అన్న వ‌డ్డించుకోనూ ఉండ‌దు.. ముసుగుతీసి నిద్రించే అవ‌కాశ‌మూ లేదు.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఆయా గ్రామాల ప్ర‌జ‌లు కంటినిండా నిద్ర‌పోయి కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డ‌చింది.. మ‌రోవైపు ఈగ‌ల దెబ్బ‌కి అంతుప‌ట్ట‌ని రోగాలు., చాలా మందిని మృత్యువు ఒడికి చేర్చాయి.. ప‌దే ప‌దే అధికారుల‌కి ఫిర్యాదులు చేయ‌గా., చేయ‌గా., నాలుగు రోజుల కండితుడుపు చ‌ర్య‌ల‌తో స‌రిపెట్ట‌డం.. ఈగ‌ల్ని తాత్కాలికంగా పార‌ద్రోలేందుకు మందుల పిచికారీ చేసి స‌రిపెట్ట‌డం.. మరుస‌టి రోజు నుంచి స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికే.. ఈ స‌మ‌స్య జ‌న‌సేన కార్య‌క‌ర్త రాజాయాద‌వ్ దృష్టికి వ‌చ్చింది..

రంగంలోకి దిగిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌పై అధ్య‌య‌నం చేప‌ట్టారు.. ఈ స‌మ‌స్య‌కి స‌మీపంలో ఉన్న కోళ్ల ఫారాలేన‌ని తేల్చారు.. గ‌తంలో వైద్య బృందాలు కూడా ఇదే నివేదిక ఇవ్వగా., త‌హ‌సీల్దార్ సంబంధిత యాజ‌మాన్యాల‌కి నోటీసులు కూడా ఇచ్చారు.. అయితే అది కంటితుడుపు చ‌ర్య‌గానే మిగిలిపోయింది.. మందుల పిచికారీ వ‌ల్ల స‌మ‌స్య మ‌రోరూపం దాల్చ‌డం మిన‌హా ఉప‌యోగం లేద‌ని నిర్ధారించారు.. మూడు గ్రామాల ప్ర‌జ‌ల ఇబ్బందులు తొల‌గాలంటే కోళ్ల ఫారాల నిర్మూల‌న‌తోనే సాధ్య‌మ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు.. కోళ్ల ఫారాల‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.. ముందుగా స‌మ‌స్య తీవ్ర‌త‌ని జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువెళ్లిన రాజాయాద‌వ్ అండ్ కో, వైద్యాధికారుల‌కి త‌మ విజ్ఞాప‌న‌లు అంద‌జేశారు.. మ‌రికొంత మంది సంబంధిత అధికారు దృష్టిలో కూడా స‌మ‌స్య‌ని ఉంచి యుద్ధ‌ప్రాతిప‌ధిక‌న ప‌రిష్క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ని చాటారు..

స‌మ‌స్య తీవ్ర‌త‌ని తెలిపే ప్ర‌య‌త్నంలో భాగంగా స్థానిక మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట ఆయా గ్రామాల ప్ర‌జ‌ల త‌రుపున జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నాకు దిగారు.. అనంత‌రం కోళ్ల ఫారాల‌ను వెంట‌నే తొల‌గించాల‌న్న డిమాండ్‌ను అధికారుల ముందుంచారు.. లేని ప‌క్షంలో మూడు గ్రామాల ప్ర‌జ‌ల‌తో క‌ల‌సి ఉద్య‌మిస్తామ‌ని., ఇక్క‌డే నిరాహార‌దీక్ష‌కి దిగుతామ‌ని హెచ్చ‌రించారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఒత్తిడితో దిగివ‌చ్చిన త‌హ‌సిల్దార్ మండ‌ల మేజిస్ట్రేట్ హోదాలో కోళ్ల ఫారాల పూర్తి స్థాయి తొల‌గింపుకు ఉత్త‌ర్వులు జారీ చేశారు.. ఫిబ్ర‌వ‌రి 18 లోపు గ్రామాల స‌మీపంగా ఉన్న ఫారాలు త‌ర‌లించకుంటే యాజ‌మాన్యాల‌పై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని నోటీసులు ఇచ్చారు..

ఐదేళ్ల స‌మ‌స్య‌.. ఐదు రోజుల్లో ప‌రిష్కారం.. ఓ స‌మ‌స్య‌ని జ‌న‌సేన అధినేత గానీ, కార్య‌క‌ర్త‌ల దృష్టికి గాని తీసుకువెళ్లిన‌ప్పుడు., అది ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు.. ప్ర‌జ‌ల‌కి స్వాంత‌న చేకూరే వ‌ర‌కు పోరాడ‌టం.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం.. జ‌నానికి జ‌న‌సేన‌పై న‌మ్మ‌కాన్ని రోజు రోజుకీ పెంచుతోంది.. ముఖ్యంగా త‌ట‌స్థ ఓట‌ర్లు జ‌న‌సేన వైపు విప‌రీతంగా ఆక‌ర్షితులు అవుతున్న‌ట్టు వ‌స్తున్న స‌ర్వేలు., ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం..

Share This:

1,580 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + twelve =