Home / జన సేన / ఒంగోలు గిత్త‌ల ఉత్సాహం.. ప్ర‌కాశం పోరుగ‌డ్డ స్పూర్తి.. జ‌న‌సైన్యం సెల‌క్ష‌న్స్ హైలెట్స్‌..

ఒంగోలు గిత్త‌ల ఉత్సాహం.. ప్ర‌కాశం పోరుగ‌డ్డ స్పూర్తి.. జ‌న‌సైన్యం సెల‌క్ష‌న్స్ హైలెట్స్‌..

జ‌న‌సేన పార్టీ ఎక్క‌డ ఎక్కువ బ‌లంగా ఉంది..? జ‌న‌సేన‌కు ఆ బ‌లం, బ‌ల‌గం ఎలా వ‌చ్చారు..? ఈ ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌కాశం జిల్లా వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేన కేడ‌ర్ ఎంపిక శిభిరం ఓ అద్భుత‌మైన స‌మాధానం ఇచ్చింది.. స్పీక‌ర్స్‌, అన‌లిస్టులు, కంటెంట్ రైట‌ర్స్… జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపు మేర‌కు ఈ మూడు విభాగాల్లో ప‌ని చేసేందుకు జిల్లా నుంచి వంద‌లాది మంది శిభిరానికి హాజ‌ర‌య్యారు.. వాస్త‌వానికి అనంత‌, శ్రీకాకుళం జిల్లాల మాదిరి ప్ర‌కాశం జిల్లా కూడా క‌రువు జిల్లా., అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉన్న జిల్లా., స‌మ‌స్య‌లు అత్యంత ఎక్కువ‌గా గ‌ల జిల్లా.. అందుకే స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్న జిల్లా కాబ‌ట్టే., ఎక్క‌డ స‌మ‌స్య‌లు ఉంటే అక్క‌డ జ‌న‌సైన్యం అన్న చందంగా ఒంగోలు జిల్లాలో నిర్వ‌హించిన జ‌న‌సేన శిభిరానికి ఊహించ‌ని రీతిలో స్పంద‌న ల‌భించింది.. వ‌చ్చిన మొత్తంలో 90 శాతం పార్టీకి పూర్తి స్థాయిలో ఉప‌యోగ‌ప‌డే స్థాయి మేథో సంప‌త్తి క‌లిగిన వారే.. రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డికి నాందీ ప‌లుకుతూ జ‌న‌సేనుడు ఇచ్చిన పిలుపుకి స్పందించిన వారే..

రెండు రోజుల పాటు జ‌రిగిన ఒంగోలు జ‌న‌సేన ఎంపిక శిభిరంలో పార్టీ అధికార ప్ర‌తినిధులు., త‌మ‌కు ఏం కావాలి..? న‌వ‌నాయ‌క‌త్వం నుంచి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఏం ఆశిస్తున్నారు..? పార్టీ నిర్మాణంలో ఎలాంటి వారికి ప్రాధాన్య‌త ఉంటుంది..? అనే విష‌యాల‌ను విడ‌మ‌ర్చి చెప్పారు.. ఇక స్పీక‌ర్‌, అన‌లిస్ట్‌, కంటెంట్ రైట‌ర్ విభాగాల‌కు హాజ‌రైన అభ్య‌ర్ధుల‌కి కూడా పూర్తిగా జిల్లాలో గ‌డ‌చిన 50 ఏళ్లుగా పెన‌వేసుకున్న స‌మ‌స్య‌లు., బ్రాండ్ ఆఫ్ ప్ర‌కాశం ఒంగోలు గిత్త ప్ర‌హ‌స‌నాల‌పైనే ప్ర‌శ్నావ‌ళి ఎదురైంది..

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ప‌రిస‌రాల్లో ఉన్న మంచినీటి స‌మ‌స్య‌., వేస‌విలో జ‌నం ప‌డుతున్న క‌ష్టాలు, వెలిగొండ‌, గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టుల నిర్మాణం. అట‌కెక్కిన రామాయంపేట పోర్టు., గ్ర‌నైట్ అక్ర‌మ త‌వ్వ‌కాలు., వాటికి అండ‌గా నిల‌బ‌డుతున్న నేత‌లు., జ‌నం ప‌డుతున్న వెత‌లు.. జ‌న‌సేన వైపు అడుగులు వేసిన న‌వ‌నాయ‌త్వం ప్ర‌స్థావించిన స‌మ‌స్య‌లు ఇవి.. స‌మ‌స్య‌-ప‌రిష్కారం రెండూ చాలా మంది నోటి నుంచి వెలువ‌డ‌డం., జ‌న‌సేనాని ఏదైతే కోరుకున్నారో., పార్టీ నిర్మాణం ఆ ల‌క్ష్యం ద‌శ‌గా దూసుకుపోతోంది..

జ‌న‌సేన కేడ‌ర్ రిక్రూట్‌మెంట్ అంట‌.. ప‌రీక్ష‌లు పెడ‌తారంట‌,, హా..హ్హా.. హ్హా అంటూ న‌వ్వుకున్న వారి నోళ్ల‌కు తాళాలు ప‌డ్డాయి.. వేలాది మంది రూపంలో బ‌ల‌మైన కేడ‌ర్ జ‌న‌సేన వైపు అడుగులు వేయ‌డం., స్థానిక నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేస్తోంది.. చాలా జిల్లాల్లో రిక్రూట్‌మెంట్ త‌ర్వాత‌., నాయ‌కులు లాభ‌న‌ష్టాల లెక్క‌ల్లో ప‌డుతున్నారు.. ఇదిగో జ‌న‌సేన కేడ‌ర్‌.. ఇదే నిజ‌మైన‌, నిబ‌ద్ద‌త క‌లిగిన కేడ‌ర్‌.. మ‌రి అలాంట‌ప్పుడు ఆ మాత్రం భ‌యం ఉండ‌దా మ‌రి.. ఇక శ‌నివారం నుంచి తూర్పుగోదావ‌రిలో శిభిరాలు మొద‌లవుతాయి.. ఇక్క‌డ స్పంద‌న పార్టీ ప్ర‌తినిధుల‌ని ఒకింత క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేస్తుంది.. రెండు రోజుల్లో ఎప్పిక ప్ర‌క్రియ పూర్త‌వుతుందా అన్న భావ‌న‌ను క‌లిగిస్తోంది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

సోష‌ల్ మీడియాలో ప్ర‌కంప‌న‌లు రేపిన పోల్‌.. దెబ్బ‌కి రెండు పిట్ల‌ల్ని కొట్టిన ఆన్‌లైన్ స‌ర్వే..

దొంగ‌లు..దొంగ‌లు ఊళ్లు పంచుకుంటే.. పోలిటీషియ‌న్సేమో మీడియాని పంచేసుకున్నారు.. ప‌చ్చ మీడియా ప్ర‌తిప‌చ్చ‌(క్ష‌) మీడియాగా మారి రాష్ట్ర ప్ర‌జ‌ల మేలు కోరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 18 =

%d bloggers like this: