Home / పోరు బాట / ఒంగోల్‌లో ప‌వ‌న్ నాలుగో మీటింగ్‌.. పండుగ త‌ర్వాత డేట్ ఫిక్స్‌…

ఒంగోల్‌లో ప‌వ‌న్ నాలుగో మీటింగ్‌.. పండుగ త‌ర్వాత డేట్ ఫిక్స్‌…

img-20170103-wa0000

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో త‌న‌కు ఎదురులేద‌ని ఉద్దానం బాధితుల వ్య‌వ‌హారంతో మరోసారి నిరూపించుకున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న పోరాటం వేగం పెంచేందుకు రెడీ అయ్యారు.. ఓ వైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే., మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా నినాదాన్ని వినిపిస్తున్న జ‌న‌సేనుడు., త‌న నాలుగో మీటింగ్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇటీవ‌లే ఇచ్చాపురం వేదిక‌గా ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై గొంతెత్తి., స‌ర్కారుకి డెడ్‌లైన్ పెట్టి మ‌రీ ఆ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌డంలో విజ‌యం సాధించారు.. అయితే ఆంధ్రుల‌కి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని చాటి చెప్పేందుకుగాను ప్ర‌తి జిల్లాలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి., జ‌నాన్ని ఉద్య‌మం దిశ‌గా జనాన్ని జాగృతం చేస్తున్న ఆయ‌న‌., త‌న త‌దుప‌రి అడుగుకి ప్ర‌కాశం జిల్లా కేంద్రం ఒంగోలుని ఎంపిక చేసుకున్నారు.. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా ప్రారంభించేశారు..

img-20170109-wa0013 img-20170109-wa0014

పార్టీ కోశాధికారి రాఘ‌వ‌య్య ఇప్ప‌టికే ఒంగోలులో ప‌ర్య‌టించి., స‌భ‌కు సంబంధించి స్థ‌ల ప‌రిశీలన కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.. ఇక స‌భ ఎప్పుడు అనే డేట్ మాత్ర‌మే ప్ర‌క‌టించాల్సి ఉంది.. అది కూడా అతి త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.. జ‌న‌వ‌రి నెలాఖ‌రుకి గాని., ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలోగాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నాలుగో బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలుస్తోంది.. పండుగ త‌ర్వాత అధికారికంగా తేదీని ప్ర‌క‌టిస్తారు..

నాలుగో స‌భ‌కు ఒంగోలే ఎందుకు..? ప్ర‌త్యేక హోదా పోరులో భాగంగా తిరుప‌తి నుంచి మొద‌లు పెట్టి కాకినాడ‌., ఆ త‌ర్వాత అనంత‌పురం ఆయా ప్రాంతాల్లో స‌భ‌లు పెట్ట‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు ఉన్నాయి.. తిరుప‌తిలో వినోద్ రాయ‌ల్ మృతి అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌., కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాకినాడ‌లోనే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి., అదే వేదిక‌ను తాను ప్ర‌శ్నించ‌డానికి తొలి వేదిక‌గా నిర్ణ‌యించుకున్నారు.. ఆ త‌ర్వాత క‌రువుసీమ‌కు అస‌లు సిస‌లు సింబ‌ల్‌గా పేరున్న అనంత‌లో స‌భ పెట్ట‌డానికి కార‌ణం.. ఇంత వెనుక‌బాటు ఉన్న ప్రాంతానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని చాటి చెప్ప‌డ‌మే.. మ‌రి ఒంగోలు ఎందుకంటే., అటు సింహ‌పురికి., ఇటు రాజ‌ధాని న‌గ‌రం గుంటూరుకీ మ‌ధ్య‌న ఉన్నా., అభివృద్దికి ఆమ‌డ‌దూరంలో నిల‌చిపోయింది.. ప్ర‌కాశం జిల్లా.. ఆ జిల్లా ప్ర‌జ‌ల క‌ష్టాలు, వెత‌లు చాట‌డం ద్వారా., మ‌రోసారి ప్ర‌త్యేక హోదా న‌గారా మోగించ‌డంతో పాటు అవ‌స‌రాన్ని చాటి చెప్పాల‌ని జ‌న‌సేనుడు భావిస్తున్నారు.. ప్ర‌కాశం జిల్లాకి సంబంధించి ఏఏ అంశాలు ప‌వ‌న్ కళ్యాణ్ దృష్టికి వ‌చ్చాయి అనే అంశాన్ని మ‌రో ఐటంలో మీ ముందు ఉంటుంది..

Share This:

2,438 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

One comment

  1. Jai janasena, from manikyalarao naidu.tatipakala, janasena party active member visakhapathanam, cell no, 9652720345

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 5 =