Home / పాలి 'ట్రిక్స్' / ”ఒక్క అడుగు”తో ఏపీలో పొలిటిక‌ల్ ప్ర‌కంప‌న‌లు..

”ఒక్క అడుగు”తో ఏపీలో పొలిటిక‌ల్ ప్ర‌కంప‌న‌లు..

untitled-1-copy

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా నిర్ణ‌యం ఆంధ్రప్ర‌దేశ్ పొలిటిక్స్‌లో పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.. త‌న అడ్డా హైద‌రాబాద్ నుంచి ఏపీకి మార్చేందుకు ఏర్పాట్లు చేయ‌మంటూ ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు జారీ చేసిన ఆదేశాలు., ప్ర‌త్య‌ర్ధుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేశాయి.. ఇన్నాళ్లు జ‌నంలోకి రాడు.. రాడు.. రాజ‌కీయాలు తెలియ‌దు అంటూ గేలిచేసిన నేత‌లంతా., ఇప్పుడు ప‌వ‌న్‌ని ఆప‌డం ఎలా అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. జ‌న‌సేనాని హైద‌రాబాద్‌లో ఉంటేనే నిత్యం వేలాది మంది ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.. మ‌రి అందుబాటులోకి వ‌స్తే.. ఆ సంఖ్య ఎంత‌వుతుందో.. ఇక త‌మ పార్టీల్లో కార్య‌క‌ర్త‌లు ఉంటారా..? కార్య‌క‌ర్త‌లు ఖాళీ అయిపోతే నేత‌లు ఉంటారా..? జ‌నాక‌ర్ష‌ణ విష‌యానికి వ‌స్తే.., ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ్య‌మేలుతున్న రెండు ప్ర‌ధాన పార్టీల నేత‌ల కంటే దాదాపు రెట్టింపు ప‌వ‌ర్‌స్టార్ సొంతం.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఓ హీరోగా అభిమానించే వారి సంఖ్య కంటే ఓ లీడ‌ర్‌గా ఆరాధించే వారి సంఖ్యే ఎక్కువ‌.. ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ చేసిన తొలి రోజు నుంచి ఈ సంఖ్య నిత్యం పెరుగుతూనే వ‌స్తోంది.. దీంతో పాటు స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ స్పందిస్తున్న తీరు., ఆయ‌న క‌ల్పించుకున్న స‌మ‌స్య‌ల‌కు ఇట్టే ప‌రిష్కారం దొరికడం వంటి విష‌యాలు రియ‌ల్ హీరో ఇమేజ్ ఇచ్చాయి.. దీంతో హైద‌రాబాద్‌లో ఉన్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార, విప‌క్షాల‌కు ఎప్పుడూ జ‌న‌సేనాని కంట్లో న‌లుసుగానే ఉన్నారు.. ఆయ‌న బ‌య‌టికి వ‌స్తే కంట్రోల్ చేయ‌డం ఎలా అన్న దిగులు అధికార పార్టీకి ఉంటే., తాము ఎన్ని ర‌చ్చ చేసినా స్పందించ‌ని స‌ర్కారు ప‌వ‌న్ చూపుకే కంగారు ప‌డితే., ఇంకా జ‌నంలో త‌మ‌కు విలువేముంటుంద‌న్న‌ది విప‌క్షం భ‌యం.. ఈ భ‌యంతో అలా అలా నెట్టుకొస్తున్న స‌మ‌యంలో., సోమ‌వారం రాత్రి ఏలూరులో ఇల్లు చూడ‌మంటూ ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌., వీరికి కంటి మీద కునుకు క‌రువ‌య్యేలా చేసింది..

ప‌వ‌న్ పూర్తి స్థాయి పాలిటిక్స్ మొద‌లు పెడితే., ముందుగా ఎవ‌రి కొంప కాలుతుందో తెలియ‌ని ఆయోమ‌యంలో., ప్ర‌ధాన పార్టీలు ఉన్నాయి.. ప‌వ‌న్‌ని ఎలా నిలువ‌రించాల‌న్న క్ర‌మంలో ఇప్ప‌టికే రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టే ప‌నిలో ప‌డ్డాయి.. పేరుకి మ‌ద్ద‌తు ఇచ్చినా., ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో ప్ర‌తి నిమిషం ప‌వ‌న్‌తో త‌ల‌నొప్పే., మ‌రి ఇక్క‌డ అడుగుపెట్టాక ఆఆ స‌మ‌స్య ఇంకాఆ పెరుగుతుంది.. ఆయ‌న‌తో క‌లిసి న‌డ‌వాలా., క‌ట్ చేసుకోవాలా..? క‌ల‌సి అడుగులు వేస్తే ప‌రిస్థితిఇ ఏంటి..? క‌ట్ చేసుకుంటే వ‌చ్చే లాస్ ఏంటి..? ఇలా లాభ‌న‌ష్టాలు భేరీజు వేసుకునే ప‌నిలో అధికార టీడీపీ ప‌డింది.. అస‌లు ఆయ‌న ఎంట్రీ ఇస్తే., త‌మ పార్టీ కేడ‌ర్ ప‌రిస్థితి ఏంటి అన్న‌ది ఆ పార్టీ దిగులు..

ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీది మ‌రో గోల‌., రాష్ట్రంలో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోలేని ప‌రిస్థితి.. వైఎస్ ఫొటోనే ఆ పార్టీకి మిగిలిన ఛ‌రిష్మా.. ఆయ‌న పేరు చెప్పుకుని ఎన్నాళ్లు నెట్టుకొస్తారో ఆ పార్టీ నేత‌ల‌కే తెలియ‌దు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ఏపీ ఎంట్రీ., గ‌ట్టి దెబ్బ‌గానే వైసీపీ భావిస్తోంది.. మొత్తానికి అడుగు పెట్ట‌క ముందే జ‌న‌సేనాని ఏపీ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌ల‌కు కేంద్ర బిందువ‌య్యారు.. మ‌రి ఆ ఒక్క అడుగూ ఏలూరు సెంట‌ర్‌లో పెట్టేస్తే.. ఇక ఏమౌతుందో.. చూడాల్సిందే..

Share This:

2,898 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

2 comments

  1. Sir, Excellent News Items Was published. Your concept is very Good. If you want any legal issues Kindly contact me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 1 =