సార్వత్రిక ఎన్నికల్లో పరాభవం అనంతరం అందరి చూపు జనసేన పార్టీ వైపే ఉంది.. పవన్‌కళ్యాణ్ పార్టీని కొనసాగిస్తాడా..? కొనసాగిస్తే అది ఎన్నాళ్లు..? ఇలా ఎన్నో ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికీ మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా జనసేన అధినేత నోటితోనే బదులిస్తున్నారు.. గడచిన మూడు రోజులుగా జిల్లాల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పవన్., నాయకులతో పాటు మధ్య మధ్యన పార్టీ శ్రేణులతోనూ మమేకమవుతున్నారు.. వారు చెప్పే సమస్యలు వింటున్నారు.. ప్రతి ఒక్కరి నుంచి నేరుగా సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు.. అంతేకాదు తనపై ఈ ఓటమి భారం ఏ మాత్రం లేదన్న విషయాన్ని చేతలతోనూ నిరూపిస్తున్నారు.. శనివారం సమీక్షల అనంతరం కాసేపు కార్యకర్తలతో గడపిన ఆయన., కాసేపు వారిని ఉద్దేశించి ప్రసంగించారు.. ఈ ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపారు.. అంతే కాదు తాను ఓటమిని అంగీకరించే వాడిని కాదని జయం వశం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని తనలోని ధైర్యాన్ని చాటుకున్నారు.. తన జీవితం రాజకీయాలకు అంకితమన్న జనసేనాని., తన శవాన్ని నలుగురు మోసుకువెళ్లే వరకు తాను జనసేనను మోస్తానని పునరుద్ఘాటించారు.. తనకు ఓటమి కొత్త కాదనీ., దెబ్బ తినే కొద్ది మరింత పైపైకి ఎదుగుతానని చెప్పుకొచ్చారు.. ఓటమి ఎదురైతే తట్టుకోగలనా లేదా అని తనను తాను పరీక్షించుకున్న తర్వాతే జనసేనను స్థాపించినట్టు వెల్లడించారు.. తాజా ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్, డబ్బు ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇలాంటి వాటన్నింటినీ తాను పట్టించుకోనన్నారు.. ప్రజా తీర్పును గౌరవించి వైసీపీ పాలన ఎలా వుంటుందో చూద్దామని చెప్పారు.. రెండు రోజుల క్రితం తాను ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న సమయంలో సూరంపల్లిగ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్లకార్డులతో రోడ్డు మీదికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న పవన్., సమస్య ఉన్న ప్రతి చోటా జనసేన గుర్తు కనబడాలని ఆకాంక్షించారు.. పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పదే పదే కృతజ్ఞతలు తెలిపారు..
దీంతో పాటు పవన్‌కళ్యాణ్‌ని నేరుగా కలవాలి, ఆయనతో స్వయంగా తమ సమస్యలు విన్నవించుకోవాలి అని కోరుకునే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఓ తీపి కబురు కూడా చెప్పారు.. మంగళగిరి పార్టీ కార్యాలయం తన కష్టార్జితంతో కట్టుకున్నదనీ., ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చని స్పష్టం చేశారు.. అంతేకాదు తనను సాధారణ ప్రజలు, కార్యకర్తలు కలిసేందుకు ఓ సమయం కూడా కేటాయించనున్నట్టు వెల్లడించారు.. జనసేన ప్రయాణం ఎంతటి దృడ సంకల్పంతో సాగుతుందో చెప్పకనే చెప్పారు..