Home / జన సేన / ఒక్క రోజులో వెయ్యి మందికి వైద్య సాయం.. జ‌న‌సేవ‌లో బెజ‌వాడ జ‌న‌సైన్యం..

ఒక్క రోజులో వెయ్యి మందికి వైద్య సాయం.. జ‌న‌సేవ‌లో బెజ‌వాడ జ‌న‌సైన్యం..

రాజ‌కీయం అంటే కేవ‌లం ప్ర‌జాసేవ‌.. నిత్యం ఎవ‌రో ఒక‌రికి ., ఏదో ఒక మూల సాయం చేయ‌డం., ఆ సాయం క‌లిగించే ఆత్మసంతృప్తితో ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు మ‌రొక‌ర్ని వెతుక్కోవ‌డం.. సేవ..సేవ‌..అనునిత్యం ప్ర‌జాసేవ‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న సైన్యంలో ర‌గిల్చిన స్ఫూర్తి అలాంటిది మ‌రి.. ఒక విద్యార్ధి, ఒక వ్య‌క్తి, ఒక స‌మూహం.. సేవ‌-సాయం అవ‌స‌రం ఎవ‌రికి ఉన్నా., క‌నుక్కుని మ‌రీ వెళ్లి చేయ‌డంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వారికి వారే సాటి..

గ‌తంలో అక్క‌డొకటి., అక్క‌డొక‌టిగా క‌న‌బ‌డే సేవా కార్య‌క్ర‌మాలు ఇప్పుడు విస్తృతం అయ్యాయి.. రాజ‌ధాని న‌గ‌రాల‌కూ విస్త‌రించాయి.. వాస్త‌వానికి న‌గ‌రాల్లోనే ఎక్కువ మంది పేద‌లు ఎలాంటి సాయం అంద‌ని ప‌రిస్థితుల్లో ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు.. అలాంటి వారి కోసం నెల‌కి ఒక వార్డు ఎంచుకుని మ‌రీ సేవ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త ఠాకూర్ అజ‌య్‌వ‌ర్మ‌.. గ‌త నెల వ‌న్‌టౌన్ ప్రాంతంలో మెడిక‌ల్ క్యాంప్ పెట్టి కొన్ని వంద‌ల మందికి వైద్య సాయం అందే ఏర్పాటు చేసిన ఆయ‌న‌., ఈ సారి స్థానిక కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌ని ఎంచుకున్నారు..

కుమ్మ‌రిపాలెం సెంట‌ర్ ప‌రిస‌రాల్లోని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి ఫిబ్ర‌వ‌రి నెల‌కి గాను మ‌రో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు.. నెక్ట్స్ జ‌న్ హెల్సింగ్ ఫౌండేష‌న్‌, అజ‌య్‌వ‌ర్మ సంయుక్తంగా ఈ శిభిరాన్ని నిర్వ‌హించారు.. ఇక్క‌డ కేవ‌లం డాక్ట‌ర్ క‌న్స‌ల్టెన్సీ మాత్ర‌మే కాదు., వైద్య ప‌రీక్ష‌లు, రోగ నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన మందుల‌ని కూడా ఉచితంగా పంపిణీ చేశారు..

ఆదివారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు సాగిన ఈ మెగా మెడిక‌ల్ క్యాంప్ సుమారు వెయ్యి మంది పేద‌ల‌కి వైద్యాన్ని అందించింది.. చాలా మంది నిరుపేద‌లు ఈ శిభిరాన్ని వినియోగించుకున్నారు.. అంతేకాదు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల సేవా కార్య‌క్ర‌మాల్ని., జ‌న‌సేనుడి స్ఫూర్తిని వేనొళ్ల కొనియాడుతున్నారు.. అటు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తితో ఇలాంటి జ‌న‌సేవ కార్య‌క్ర‌మాలు మ‌రిన్ని చేసే ఓపిక ఆ దేవుడు ప్ర‌సాధించాల‌ని కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన జ‌న‌సైనికులు కోరుతున్నారు..

అజ‌య్‌వ‌ర్మ ఠాకూర్‌తో పాటు కుమ్మ‌రిపాలెంకి చెందిన జ‌న‌సైనికులు త‌మ్మిన లీలాక‌రుణాక‌ర్‌. సామినేని రాజ‌శేఖ‌ర్‌, గ‌న్ను శంక‌ర్‌, చింత‌ప‌ల్లి అజయ్ త‌దిత‌రులు శిభిర నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌లు భుజాన వేసుకున్నారు..

Share This:

1,417 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − thirteen =