Home / పవన్ టుడే / ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

అధికారం చేతిలో ఉంటే ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. సొంత పార్టీ నాయ‌కుల జేబులు నిండితే చాలు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ నోట్ల‌లో కొంత జ‌నానికి బిచ్చం వేసి ఓట్లు దండుకోవ‌చ్చు.. అధికార పార్టీ ఆలోచ‌న ఇది అయితే., జ‌నం మ‌న‌ల్ని తిర‌స్క‌రించారు కాబ‌ట్టి వారిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. మ‌నం ఎప్పుడు గెలిస్తే అప్పుడే ప్ర‌జా స‌మ‌స్యల మీద ఆలోచిద్దాం.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీని బ‌తికించిన వారిని కాకుండా, ఆర్ధిక పుష్టి ఉన్న వారికి అవ‌కాశం ఇచ్చి, అధికార పార్టీ కంటే ఓ రూపాయి ఎక్కువ పంచి గెలిచేద్దాం.. ఇది ప్ర‌తిప‌క్ష పార్టీ వ్యూహం.. మొత్తానికి రెండింటి ల‌క్ష్యం ఒక‌టే, ప్ర‌జ‌ల కోసం ఏం చేసినా చేయ‌కున్నా, ఆఖ‌ర్లో ఓ నోటు ముఖాన ప‌డేసి ఓటు వాళ్లే వేస్తారు ఇది నేటి రాజ‌కీయ నాయ‌కుల‌ ఆలోచ‌న‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముక్కోణ‌పు వార్ జ‌ర‌గ్గా, ఒక్క జ‌న‌సేన పార్టీ మాత్ర‌మే ఓటుకు నోటు పంచ‌కుండా ఎన్నిక‌ల‌కు వెళ్లింది.. మిగిలిన రెండు ప్ర‌ధాన పార్టీలు ద‌న‌ప్ర‌వాహాన్ని బాగానే పారించాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.. ఆఖ‌రుకు ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌ల‌తో చెక్‌పోస్టులు పెట్టి త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు సైతం జ‌న‌సేన పార్టీ వాహ‌నాల్లో ఏమీ ఉండ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన ప‌రిస్థితి.. నియోజ‌క‌వ‌ర్గాల వారీ త‌నిఖీల‌కు వ‌చ్చిన స్పెష‌ల్ స్క్వాడ్స్‌, పోలీసులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు గుమిగూడి ఉన్నా వారి ద‌గ్గ‌రం ఏమీ దొర‌క‌దు కాబ‌ట్టి చెక్ చేయ‌డం కూడా వృధా అని వ‌దిలేసి వెళ్లిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు..

ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓటుకు నోటు ప్ర‌భావం ఎంత‌..? డ‌బ్బు పంచిన పార్టీలు గెలుపు మీద విప‌రీత‌మైన ధీమాతో ఉన్నాయి.. తాము పంచిన నోట్లు ఓట్ల వ‌ర్షం కురిపిస్తాయ‌నీ, త‌మ పార్టీని విజ‌య తీరాల‌కు చేరుస్తాయ‌ని.. ఎన్నిక‌ల సంద‌ర్బంగా స‌ర్వేలు నిర్వ‌హించిన సంస్థ‌లు సైతం ఎవ‌రు గెలుస్తారు అనే అంశం మీద మాత్ర‌మే దృష్టి సారించాయి.. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సైలెంట్ ఓటింగ్ శాతం, అంటే ఏ పార్టీకి ఓటు వేశామ‌నే విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది.. దీంతో ఈ స‌ర్వేల్లో వ‌చ్చిన విజ‌యం నేతి బీర‌లో నేతి చంద‌మేన‌ని తేలిపోయింది.. దీంతో ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే క్ర‌మంలో ఇటీవ‌ల మ‌రో సంస్థ ఒక వినూత్న‌మైన ఆలోచ‌న‌తో ముందుకు వెళ్లింది.. మూడు పార్టీల మ‌ధ్య హోరాహోరి పోరు ఉన్న కీల‌క‌మైన జిల్లాల్లో ఈ సంస్థ త‌న స‌ర్వేను నిర్వ‌హించింది.. స‌ద‌రు సంస్థ ఏ ఒక్క‌రినీ ఏ పార్టీకి ఓటు వేశారు అనిగానీ, ఏ అభ్య‌ర్ధికి ఓటు వేశారు అనే అంశాన్ని గానీ ప్ర‌స్థావించ‌లేదు.. నోటుకు ఓటును అమ్ముకున్నారా.? లేదా.? అనే అంశాన్ని మాత్ర‌మే ప్ర‌శ్న రూపంలో సంధించింది.. ఓటు కోసం నోటు ఇచ్చిన వారికి ఓటు వేశారా.? లేదా.? అన్న ఈ ప్ర‌శ్న‌కు సుమారు 90 శాతం మంది ప్ర‌జ‌లు నోటు తీసుకున్న అభ్య‌ర్ధుల‌కు నామం పెట్టామ‌నే స‌మాధాన‌మే ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.. ఓటు కోసం ఇచ్చిన నోటును ఇందులో 60 శాతం మంది స్వాగ‌తించారు.. ఏ పార్టీ అభ్య‌ర్ధి పంచినా అది త‌మ నుంచి దోచుకున్న‌దే కనుక తీసుకోవ‌డంలో త‌ప్పులేదు అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.. అదే స‌మ‌యంలో అంద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బు తీసుకున్నా ఓటు ఎవ‌రికి వేయాల‌న్న విష‌యంలో మాత్రం త‌మ‌కు ముందు స్ప‌ష్ట‌త ఉంద‌ని తెలిపారు.. నోటు ప్ర‌భావం త‌మ ఓటు మీద ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు.. మిగిలిన వారిలో 30 శాతం ఓటుకు ఇచ్చిన నోటును తిస‌ర్క‌రించిన‌ప్ప‌టికీ బ‌లవంతంగా ఇచ్చిపోయారంట‌.. వీరు కూడా త‌మ మ‌న‌స్సాక్షి మేర‌కు, త‌మ‌కు భ‌విష్య‌త్తులో అండ‌గా నిల‌బ‌డే వారికే ఓటు వేసిన‌ట్టు తెలిపిన‌ట్టు స‌ద‌రు స‌ర్వే సంస్థ తెలిపింది.. ఇక మిగిలిన 10 శాతం ఓట‌ర్లు మాత్రం నోటు ఇచ్చిన వారికి న్యాయం చేశారంట‌.. అంద‌రు అభ్య‌ర్ధులు ఇచ్చిన డ‌బ్బు తీసుకున్న వారు., ఇంట్లో ఉన్న ఓట్ల‌ను సైతం అన్ని పార్టీల‌కు స‌మంగా పంచారంట‌..

అంటే ఓటు కోసం నోట్లు ఇచ్చిన అభ్య‌ర్ధుల‌కు ఈ ఎన్నిక‌ల్లో జ‌నం చుక్క‌లు చూపార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.. దీంతో మొన్న‌టి వ‌ర‌కు పంచిన నోట్లు రాల్చే ఓట్ల‌తో గెలిచేయొచ్చ‌న్న భ్ర‌మ‌లో ఉన్న అభ్య‌ర్ధులు ఈ స‌ర్వే రిపోర్టుతో నిద్ర‌లో కూడా ఉలిక్కి ప‌డుతున్నారు.. మొన్న‌టి వ‌ర‌కు 130 సీట్లు మావే అంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు సైలెంట్ ఓటింగ్ ఎవ‌రిని ముంచేయ‌నుందోన‌న్న లెక్క‌ల్లో మునిగాయి.. ఎన్నిక‌లు ముగిసిన రోజు నుంచి నేటి వ‌ర‌కు ఒక్క జ‌న‌సేన మాత్ర‌మే త‌మ పార్టీకి ఎంత మంది ఓటు వేశారు.. ఎంత మంది అభ్య‌ర్ధులు గెలుస్తారు అన్న లెక్క‌లు వేయ‌కుండా, ప‌డిన క‌ష్టానికీ, ప్ర‌జ‌ల త‌రుపున చేసిన పోరాటానికి ఫ‌లితం కోసం వేచిచూస్తోంది.. ఏది ఏమైనా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మాత్రం ఓ నూత‌న ఒర‌వ‌డికి నాందీ ప‌ల‌క‌డం ఖాయంగా క‌నిస్తోంది.

Share This:

1,360 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 7 =