Home / ఎడిటోరియల్స్ / ఓట‌మి భయాన్ని జ‌న‌సేనాని జ‌యించారు..!

ఓట‌మి భయాన్ని జ‌న‌సేనాని జ‌యించారు..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరు ముగిసింది.. ఓట‌రు తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్తమ‌య్యింది.. ఈవీఎంల‌లో ఉన్న తీర్పును ఎవ‌రూ మార్చ‌లేరు.. ఆ విష‌యం అంద‌రికీ తెలుసు.. అదే స‌మ‌యంలో గెలుపు మీద అంద‌రికీ ధీమా.. ధీమా అనే కంటే లోప‌ల ఓట‌మి భ‌యం వెన్నాడుతున్నా., పైకి మాత్రం అంతులేని మేక‌పోతుగాంభీర్యం క‌న‌బ‌ర్చ‌డం.. అధికార-ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తుంది ఇదే.. మాకు అన్ని సీట్లు వ‌స్తాయి అంటే., మాకు ఇన్ని సీట్లు వ‌స్తాయి అని లెక్క‌లు వేసుకుంటూ., వైసీపీ నేత‌లు అయితే ఏకంగా మంత్రి ప‌ద‌వులు పంచేసుకుంటూ ఎన్నిక‌ల‌కు-ఫ‌లితాల‌కు మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్‌ని కూడా వేడెక్కించేస్తున్నారు.. అయితే విజ‌యం గురించి రొమ్ము విరుచుకు మాట్లాడే ప్ర‌తి ఒక్క‌రికీ ఒక భ‌యం ఉంది.. అదే ఓట‌మి భ‌యం.. ఒక‌వేళ ఓడిపోతే అన్న భ‌యం..

అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం ఇలాంటి సాంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు చాలా దూరం పాటిస్తున్నారు. ఆది నుంచి మార్పు కోసం త‌న‌దైన శైలిలో పోరాటం చేస్తున్న జ‌న‌సేనాని., పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా అదే మార్పును కొన‌సాగిస్తున్నారు.. ఎన్నిక‌ల ముందు ఆయ‌న చెప్పిన మాట ”మీరు ఓటు వేసినా వేయ‌కున్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేస్తూనే ఉంటా.. గెలిపిస్తే ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతా.. గెల‌వ‌కున్నా ప్ర‌జ‌ల త‌రుపున పోరాటం చేస్తా”.. అది రాజ‌కీయాల్లో సాధ్య‌మా.? ప‌్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద పోరాటం అనే అంశాన్ని ప‌క్క‌నపెట్టి ముఖ్య‌మంత్రి అవ్వ‌డం అనే ఏకైక అజెండాతో ప‌నిచేసిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ఎన్నిక‌లు ముగిశాక కోట్లు ఇచ్చి తెచ్చుకున్న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌తో స‌మావేశం మిన‌హా., ఒక్క నాయ‌కుడిని కూడా మీ ప్రాంతంలో ఉన్న స‌మ‌స్య‌లు ఏంటి అని అడిగిన దాఖ‌లాలు లేవు.. ఇప్ప‌టికే ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికి వ‌దిలేసి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వైసీపీ అధినేత స్పీడు చూసి ఎక్క‌డ ఓట‌మి ఎదురౌతుందో అన్న భ‌యం మాత్ర‌మే క‌న‌బ‌డుతోంది..

అనారోగ్య కార‌ణాల‌తో పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన అనంత‌రం ప‌ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం ఎంతో ప్ర‌శాంతంగా క‌న‌బ‌డ్డారు.. ఒక‌టి, రెండు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయంటూ వెల్లువెత్తుతున్న స‌ర్వేల మ‌ధ్య ఆయ‌న‌లో ఆ ఆందోళ‌న ఏ మాత్రం క‌న‌బ‌డ‌లేదు.. ఆదివారం జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో స‌మావేశం అయిన ప‌వ‌న్ ముఖంలో ఏ మూల‌నా కూడా ఆందోళ‌న‌, భ‌యం అనే దాఖ‌లాలు క‌న‌బ‌డ‌లేదు.. ఓట‌మి ఎదురైతే అన్న మాట నోటి నుంచి రానూ లేదు.. పైగా ఓట‌మి భ‌యం లేని న‌వ‌త‌రం పునాదుల మీద రాజ‌కీయ మార్పును నిర్మించాల‌న్న త‌న ఆకాంక్ష‌ను బ‌లంగా త‌న అభ్య‌ర్ధుల‌లోకి తీసుకువెళ్ల‌గ‌లిగారు.. అతి సామాన్యుల‌ను రాజ‌కీయ ఉద్దండుల మీద నిల‌బెట్టిన జ‌న‌సేనాని., ఏ ఒక్క‌రినీ మీకు ఎన్ని ఓట్లు ప‌డ్డాయి అని ప్ర‌శ్నించ‌లేదు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మీకు ఎదురైన అనుభ‌వాలు చెప్ప‌మ‌ని మాత్ర‌మే అడిగారు.. అంతే కాదు ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి ఇక అంతా గ్రామ స్థాయికి వెళ్లి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప‌నిలో ఉండమంటూ దిశానిర్ధేశం చేశారు..

కుల‌, మ‌త‌, ప్రాంతాల వారీగా విడిపోయిన భార‌త దేశ రాజ‌కీయాల్లో ఇలాంటి మార్పు సాధ్య‌మా.? అంటే సాధ్య‌మేన‌ని నిరూపించారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ముఖ్యంగా ఆయ‌న చెప్పిన మాట‌లు ప్ర‌త్య‌ర్ధుల్లా అన్ని సీట్లు వ‌స్తాయి.. ఇన్ని సీట్లు వ‌స్తాయి. అని లెక్క‌లు వేయం.. ఎక్క‌డ ఏ స‌మ‌స్య ఉంది అన్న విష‌యం మీదే మా లెక్క‌లు.. అన్న అంశం ఆయ‌న ల‌క్ష్యాన్ని తెలియ‌చేస్తోంది.. అభ్య‌ర్ధులు త‌మ అనుభ‌వాలు చెబుతున్న స‌మ‌యంలో గానీ, వారికి ఆయ‌న దిశా నిర్ధేశం చేస్తున్న స‌మ‌యంలో గానీ ఆయ‌న ముఖంలో క‌నిపించిన గాంభీర్యం.. ప్ర‌జ‌లు ఎందుకు మార‌రో చూద్దాం అన్న‌ట్టు క‌న‌బ‌డింది.. ఒక్క‌సారిగా మార్పు సాధ్యం కాదు.. నెమ్మ‌దిగా మార్పు తీసుకురావాలి.. మార్పు సాధ్య‌ప‌డే వ‌ర‌కు వేచి చూడాలి.. వేచి చూసే ధైర్యం నాలో ఉంది.. అన్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు.. ఈ స‌మీక్ష‌కు హాజ‌రైన ఏ అభ్య‌ర్ధి ముఖంలో ఓట‌మి తాలూకు భ‌యం క‌న‌బ‌డ‌లేదు.. ఓట‌మి ఎదురైనా అధినేత దాన్ని సానుకూల దృక్ప‌దంతో స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న న‌మ్మ‌కం వారికి క‌లిగింది..

రాజ‌కీయాల కోసం ప‌ద‌వుల కోసం నాయ‌కులు, వారికి అండ‌గా ఉన్న వ‌ర్గాలు ఎన్నో నింద‌లు మోపాయి.. కానీ జ‌న‌సేనాని థియ‌రీ చూస్తే.. భ‌విష్య‌త్‌లో ఈ మొత్తాన్ని మార్చేయ‌గ‌ల‌ర‌న్న న‌మ్మ‌కం క‌లుగ‌క మాన‌దు.. మ‌న‌సులో విషం నింపుకోకుండా ఆయ‌న్ని ద‌గ్గ‌ర్నుంచి చూసిన ఏ ఒక్క‌రైనా దీన్ని ఒప్పుకోక త‌ప్ప‌దు…

Share This:

2,326 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + 6 =