Home / జన సేన / ఓడినా తుది శ్వాస వ‌ర‌కు రాజ‌కీయాలు వీడ‌ను..పోరాటం ఆప‌ను-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ఓడినా తుది శ్వాస వ‌ర‌కు రాజ‌కీయాలు వీడ‌ను..పోరాటం ఆప‌ను-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీడియా ముందుకు వ‌చ్చారు.. మొద‌టి నుంచి ఏదైతే చెబుతున్నారో., అదే అంశాన్ని మ‌రోసారి పున‌రుద్ఘాటించారు.. గెలిచినా, గెల‌వ‌కున్నా ఇచ్చిన మాట‌కు నిల‌బ‌డ‌తాన‌ని, తుది శ్వాస వ‌ర‌కు రాజ‌కీయాల్లో కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.. ప్ర‌జా స‌మ‌స్య‌లపై మ‌రింత బ‌ల‌మైన పోరాటం కొన‌సాగిస్తాన‌ని మాటిచ్చారు.. మ‌రోసారి ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న న‌రేంద్ర మోడీకి, రాష్ట్రంలో బ‌ల‌మైన మెజార్టీతో విజ‌యం సాధించిన వైసీపీకి, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు హార్ధిక శుభాకాంక్ష‌లు తెలిపారు.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తెస్తామని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని కోరారు.. మీకు సొంతంగా మెజారిటీ వ‌చ్చింది కాబ‌ట్టి ఈ సారైనా ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని సూచించారు.. స‌మాజంలో మార్పు కోసం, క్లీన్ పాలిటిక్స్ ల‌క్ష్యంగా 2014లో పార్టీ స్థాపించాన‌ని., న్యూ ఏజ్ పాలిటిక్స్ ల‌క్ష్యంగా 25 సంవ‌త్స‌రాల రాజ‌కీయ ప్ర‌స్థానం కొన‌సాగిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు.. అన్ని ర‌కాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే స‌త్తా, ధైర్యం త‌న‌కు ఉన్నాయ‌న్నారు.. అన్నింటికీ సిద్ధ‌ప‌డే ముందుకు వ‌చ్చాన‌న్న జ‌న‌సేనాని., ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు చేప‌ట్టిన పోరాట యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి చేరువ‌యిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.. న్యూ ఏజ్ పాలిటిక్స్‌కు ఆహ్వానం ప‌లుకుతూ జ‌న‌సేన పార్టీకి ఓటు వేసిన ప్ర‌తి అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. పార్టీ కోసం ప‌ని చేసిన జ‌న‌సైనికుల‌కు, విదేశాల నుంచి ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చి ఓటు వేసిన అంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు.. ఎన్నిక‌ల్లో సారా, డ‌బ్బు ప్ర‌భావం లేకుండా క్లీన్ పాలిటిక్స్ చేశామంటూ సంతృప్తి వ్య‌క్తం చేశారు.. కొత్త‌త‌రం, యువ‌త‌కు సీట్లు ఇవ్వ‌డం ఆనందాన్నిచ్చిన‌ట్టు ప‌వ‌న్ చెప్పారు.. అది భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌తో కూడుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలిపారు.. జ‌న‌సేన పార్టీ రాజోలు అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగ‌లిగింది.. అయినా ఓట‌మి తాలూకు అధైర్యం ప‌వ‌న్ ముఖంలో క‌న‌బ‌డ‌లేదు.. పార్టీని ముందుకు న‌డిపించే అంశం మీదే ఆయ‌న దృష్టి సారించారు..

Share This:

519 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − three =