Home / ఎడిటోరియల్స్ / ఓ నాయ‌కులారా.. మీ పోరు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా..? ప్రజల పైనా..?

ఓ నాయ‌కులారా.. మీ పోరు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా..? ప్రజల పైనా..?

politicians1
ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే ఏం చేయాలి..? పాల‌కులు, అధికారులు త‌మ విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాలి.. నిర్వ‌ర్తించ‌క‌పోతే ప్ర‌శ్నించాల్సిన బాధ్య‌త విప‌క్షం పైన ఉంది.. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీన్ మాత్రం వేరుగా ఉంది.. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన స‌ర్కారు, కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తుంటే., ప్ర‌జ‌ల త‌రుపున పోరాడాల్సిన విప‌క్షం మాట్లాడితే ధ‌ర్నాలు, బంద్‌లు అంటూ., స‌మ‌స్య‌లు లేని జ‌నానికి కూడా వాటి రుచి చూపిస్తోంది.. మ‌రి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే నాధుడు లేడా అని జ‌నం వెతికిన‌ప్పుడు వారికి క‌న‌బ‌డుతున్న ఒకే ఆప్ష‌న్ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎన్నిక‌ల వేళ ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీ త‌రుపున ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న కూడా ప్ర‌జ‌ల‌కు ఓ హామీ ఇచ్చారు.. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు నెర‌వేర్చేలా చూసే బాధ్య‌త త‌న భుజాల‌పై వేసుకుంటాన‌ని.. అప్ప‌టి నుంచి జ‌న‌సేనాని అదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు కూడా.. అయితే త‌మ గొప్పే త‌ప్ప ఎదుటివారి గొప్ప‌ని జీర్ణించుకునే వ్య‌వ‌స్థ మ‌న నాయ‌కుల‌కి లేదు. అందుకే ప‌వ‌న్ చేస్తున్న మంచిని కూడా చెడుగా చిత్రించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.. అంతుకు త‌మ‌కు వ‌త్తాసు ప‌లికే మీడియాని పూర్తిగా వినియోగించుకుంటూ., జ‌నాన్ని అదే భావ‌న‌లోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌క త‌ప్ప‌దా..? స‌భ‌లు, స‌మావేశాలు పెట్టాల్సిందేనా..? బ‌ంద్‌లు, ధ‌ర్నాలు చేసి మిగిలిన జ‌నాన్ని కూడా ఇబ్బంది పెట్టాలా..? ఇలాంటి ప‌ద్ద‌తుల్లో మార్పు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌న‌సేనాని. స‌మ‌స్య అంటూ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టాన్ని తీర్చేందుకు త‌న వంతు కృషి చేస్తూనే ఉన్నారు.. ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూనే ఉన్నారు.. జ‌నం రోడ్డెక్కినా, విప‌క్షాలు అర‌చి గీపెట్టినా ప‌ట్టించుకోని స‌ర్కారు., ఓ స‌మ‌స్య ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి వ‌చ్చిందంటే మాత్రం వెంట‌నే ప‌రిష్కార మార్గం అన్వేషించే ప‌నిలో ప‌డుతోంది ప్ర‌భుత్వం.. అందుకు కార‌ణం జ‌న‌సేనాని జ‌నంలోకి వ‌స్తే., ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగితే తట్టుకునే శ‌క్తి వారికి లేక‌పోవ‌డ‌మే.. రాజ‌ధాని భూసేక‌ర‌ణ విష‌యం ద‌గ్గ‌ర్నుంచి అన్ని విస‌యాల్లో అదే జ‌రిగింది.. తాజాగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్ట్ వ్య‌వ‌హారంలో కూడా స‌మ‌స్య ప‌వ‌న్ చెంత‌కు వ‌చ్చిన వెంట‌నే దానిపై చ‌ర్చించేందుకు చంద్ర‌బాబు కేబినెట్ భేటీ అయ్యింది కూడా.. మొన్న‌టికి మొన్న ప్ర‌త్యేక హోదాపై జ‌న‌సేనాని పెద‌వి విప్ప‌గానే., ఆ వ్య‌వ‌హారాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు ప్యాకేజ్ అంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కొత్త నాట‌కానికి తెర తీశాయి.. ఈ మొత్తం వ్య‌వ‌హారం చూస్తే అంద‌రికీ క్లియ‌ర్‌గా అర్ధ‌మైపోతుంది. జ‌న‌సేనాని రోడ్డెక్క‌కుండానే పాల‌కుల్లో క‌ద‌లిక తేగ‌ల‌డ‌ని.. మ‌రి అలాంట‌ప్పుడు ఆయ‌న బంద్‌లు, ధ‌ర్నాలు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది..?

ప‌వ‌ర్‌స్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ఏర్ప‌రుచుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్, జ‌న‌సేన పార్టీని స్థాపించిందే జ‌నం కోసం.. అయితే జ‌నంలో ఆయ‌న‌కున్న క్రేజ్ దృష్ట్యా ఆయ‌న ఎప్పుడంటే అప్పుడు జ‌నం మ‌ధ్య‌కు రాలేరు.. ఆయ‌న స‌భ‌ల‌కి, స‌మావేశాల‌కీ వ‌చ్చేది అద్దె జ‌నం కాదు, అభిమాన‌జ‌నం. పార్టీలోని ఏ కేడ‌ర్ ఆయ‌న కోసం ప్ర‌త్యేకంగా జ‌న స‌మీక‌ర‌ణ చేయాల్సిన ప‌నిలేదు.. బిర్యానీలు పంచాల్సిన ప‌ని అవ‌స‌రం అంత‌కంటే లేదు.. అలాంటి అభిమానాన్ని కంట్రోల్ చేయ‌డం ఎవ‌రివ‌ల్లా కాని విష‌యం. అయితే ప్ర‌జ‌లకు క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న‌దైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు.. ప‌రిష్కారం కోసం పాల‌కుల‌పై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.. అయితే ఈ మ‌ధ్య ఓ వ‌ర్గం జ‌న‌సేనానిపై ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టింది. స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పంద‌న స‌రిగా లేద‌ని, త‌మ‌కు న‌చ్చిన నేత‌లు చేసేదే పోరాటం అని అభివ‌ర్ణిస్తూ త‌మ మీడియాలో పిచ్చిగీత‌లు గీసేస్తున్నారు.. అలా ప్ర‌చారం చేసే వారంద‌రినీ నేనే ప్ర‌శ్నిస్తున్నా.. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే బంద్‌లు, ధ‌ర్నాలు చేయాలా..? భారీ ఎత్తున స‌భ‌లు, స‌మావేశాలు పెట్టాలా..? అలా చేసే నిర‌స‌న‌ల వ‌ల్ల స‌మ‌స్య‌లు లేని ఎందుకు ఇబ్బందులు ప‌డాలి..? కూర్చున్న చోటు నుంచే స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌గ‌లిగే వాడు నాయ‌కుడు కాదా..? ఈ ప్ర‌శ్న‌ల‌కు మీ వ‌ద్ద బ‌దులుందా..?

Share This:

1,413 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 3 =