Home / జన సేన / కాకినాడ‌లో విద్యార్ధి సేన మీట్‌.. ప‌వ‌న్ సిద్ధాంతాల‌పై చ‌ర్చ‌..

కాకినాడ‌లో విద్యార్ధి సేన మీట్‌.. ప‌వ‌న్ సిద్ధాంతాల‌పై చ‌ర్చ‌..

img-20161225-wa0119

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన ప్ర‌ధాన బ‌లం యువ‌త‌.. కాలేజీ కుర్రాళ్ల ద‌గ్గ‌ర్నుంచి 40 ఏళ్ల‌లోపు న‌డివ‌య‌స్కుల వ‌ర‌కు ఉర‌క‌లెత్తే ఉడుకు నెత్తురుతో కూడిన ఏజ్ గ్రూప్‌లో 80 శాతం మంది జై జ‌న‌సేన అంటున్నారు.. అందులో విద్యార్ధి లోకందే కీల‌క‌పాత్ర‌.. 2019 ఎన్నిక‌ల నాటికి ఓట్లు వ‌చ్చేవారు కొంద‌రైతే., ఇప్ప‌టికే ఓటు హ‌క్కు పొందిన వారు మ‌రికొంద‌రు.. ఇందులో ప‌వ‌న్‌పై సినీ అభిమానం ఉన్న‌వారే ఎక్కువ‌.. వీరంతా ఇప్పుడు ఆయ‌న‌కి భ‌క్తులుగా మారుతున్నారు.. జ‌న‌సైనికులుగా మారి సేన‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు సై అంటున్నారు.. తూర్పులో ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ వేగంగా వేళ్లూనుకుంటుండ‌గా., ఇటీవ‌ల వ‌రుస‌గా జ‌రుగుతున్న ఔత్సాహికుల స‌మావేశాల్లో అదే విష‌యం తేట‌తెల్లం అవుతోంది..

img-20161225-wa0120

తాజాగా ఈ జ‌న‌సేన ఔత్సాహికుల లిస్టులో విద్యార్ధి లోకం కూడా చేరుతోంది.. ప‌వ‌న్ పార్టీ కోసం తాము ఎలాంటి పాత్ర పోషించేందుకైనా సిద్ద‌మేన‌ని విద్యార్ధులు చెబుతున్నారు.. కాకినాడ ఆర్ సి ఎం గ్రౌండ్‌లో క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినాన‌., విద్యార్ధులు, పార్టీ ఔత్సాహికుల మీట్ జ‌ర‌గ్గా.. విద్యార్ధులంతా ముక్త‌కంఠంతో జ‌న‌సేన‌కు జై కొట్టారు.. త‌మ ఓట్లు ఎటూ పోవ‌న్న విష‌యాన్ని బ‌ల్ల‌గుద్దిన వారు., పార్టీ అవ‌స‌రాన్ని భ‌ట్టి ప‌నిచేయ‌డానికి సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు..

విద్యార్ధి శ‌క్తి త‌ల‌చుకుంటే ఏదైనా సాధించ‌గ‌ల‌ద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసిన‌వారు., త‌మ ఇంపాక్ట్ ఎంత వ‌ర‌కు ఉంటుందో 2019లో తేలియ‌జెబుతామంటున్నారు.. ఓట్లు ఎలా వేయించాలో త‌మ‌కు భాగా తెలుస‌ని., ప్ర‌త్య‌ర్ధులు సిద్ధంగా ఉండాల‌ని స‌వాళ్లు చేస్తున్నారు..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 6 =

%d bloggers like this: