Home / పవన్ టుడే / కాట‌మ‌రాయుడు ”ఫ‌స్ట్ లుక్” కేక‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌.

కాట‌మ‌రాయుడు ”ఫ‌స్ట్ లుక్” కేక‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌.

14720516_780323825453490_6075096094056329113_nజ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోస్ట్ ఎవెయిటెడ్ ఫిల్మ్ కాట‌మ‌రాయుడు ఫస్ట్ లుక్ లీక్ అయ్యింది.. ప‌వ‌ర్‌స్టార్ చిత్రాల‌కు లీకేజీ కామ‌నే అయినా అదీ రెట్టింపు క్రేజీ సంపాదించి పెడుతుంది.. లుంగీ, పింక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌తో ప‌క్కా ప‌ల్లెవాతావ‌ర‌ణం ఉట్టిప‌డుతున్న‌ట్టు క‌న‌బ‌డుతున్న ఈ ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే ల‌క్ష‌ల క్లిక్స్ కొట్టేసింది.. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు ఉన్నాయి.. చిత్రంలో రాయ‌ల్ ఇన్‌ఫీల్డ్ బుల్లెట్‌, జీప్ కూడా ప‌వ‌న్ న‌డ‌ప‌నుండ‌గా., సైకిల్‌పై లుక్కే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కావ‌డంతో., ప‌వ‌న్ దాన్నే ఫ‌స్ట్‌లుక్‌కి ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.. వాస్త‌వానికి దీపావ‌ళి రోజున ఈ పోస్ట‌ర్ విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా., అదికాస్తా రెండు రోజుల ముందే లీక్ అయ్యింది.. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.. అటు ముందుగా సినిమా మొత్తం లీక్ అయినా ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌గ‌ల స‌త్తా ప‌వ‌ర్‌స్టార్ సొంత‌మ‌ని అత్తారింటికి దారేది చిత్రం చెప్ప‌క‌నే చెప్పింది.. ఇప్పుడు లీక‌యిన కాట‌మ‌రాయుడు పోస్ట‌ర్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చెసుకుంది.. ఈ చిత్రం మార్చ్ చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకి రానుంది..

Share This:

897 views

About Syamkumar Lebaka

Check Also

వ‌రుస‌గా రెండో రోజూ సామాన్యుడి గ‌డ‌ప త‌ట్టిన జ‌న‌సేనుడు.. దూసుకుపోతున్న త‌రంగం..

జ‌న‌సేన త‌రంగం.. ప్ర‌తి ఇంటికి జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు చేర్చే క్ర‌మంలో రూపొందించిన కార్య‌క్ర‌మం.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 4 =