Home / జన సేన / కాన్స‌ర్ భారిన ప‌డిన జ‌న‌సైనికుడు.. జ‌న‌సేనాని ఆప‌న్న‌హ‌స్తం..

కాన్స‌ర్ భారిన ప‌డిన జ‌న‌సైనికుడు.. జ‌న‌సేనాని ఆప‌న్న‌హ‌స్తం..

పార్టీ నుంచి రూ. 2 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం
త‌లో చెయ్యి వేసిన జ‌న‌సైనికులు
రూ. 10 వేలు ఇచ్చిన ముక్కా శ్రీనివాస‌రావు
రూ. 1.15 ల‌క్ష‌లు అంద‌చేయ‌నున్న ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైన్యం
రెక్కాడితే గాని డొక్కాడ‌ని కుటుంబం.. త‌ల్లిదండ్రులు రోజు కూలీలు.. అయినా విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని నిస్వార్ధ జ‌న‌సైనికుల జాబితాలో అత‌ని పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది.. పార్టీ ప‌రంగా అయినా, వ్య‌క్తిగ‌తంగా అయినా ఎవ‌రికి ఏ సాయం కావాల‌న్నా తన శ‌క్తి మేర‌కు సాయం అందించ‌డంతో ముందుండే వాడు.. ఆ జ‌న‌సేన కార్య‌క‌ర్త పేరు విశ్వ‌తేజ‌. రెండేళ్ల క్రితం వివాహం అయిన ఇత‌నికి బ్ల‌డ్ కాన్స‌ర్ రూపంలో అనారోగ్యం వెంటాడింది.. అదృష్ట వ‌శాత్తు రోగం మొద‌టి స్టేజ్‌లోనే ఉన్నా., చికిత్స‌కు ఖ‌ర్చు చేసే అంత‌టి స్థోమ‌త లేదు.. విశ్వ‌తేజ అనారోగ్యం గురించి తెలుసుకుని సాటి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వెంట‌నే స్పందించారు. త‌మ వంతు సాయం చేయ‌డంతో పాటు పార్టీ నాయ‌కుల దృష్టికి విష‌యాన్ని తీసుకువెళ్లారు.. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నం మ‌హాత్మాగాంధీ కాన్స‌ర్ ఆసుప‌త్రిలో బ్ల‌డ్ కాన్స‌ర్‌కు చికిత్స చేయించుకుంటున్న విశ్వ‌తేజ‌కు విజ‌య‌న‌గ‌రం ఎంపి అభ్య‌ర్ధి ముక్కా శ్రీనివాస‌రావు, మ‌రో నాయ‌కుడు సురేష్ మ‌ర్రాపు త‌లా ప‌ది వేల రూపాయిలు సాయం అందించారు.. విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే అభ్య‌ర్ధి పాల‌వ‌ల‌స య‌శ‌స్వి విష‌యాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.. సోమ‌వారం విశ్వ‌తేజ భార్య‌తో స‌హా హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యానికి వెళ్లి విష‌యాన్ని ఆయ‌న‌కు వివ‌రించారు.. జ‌న‌సైనికుడికి ఆప‌ద వ‌చ్చింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్న జ‌న‌సేనాని., వెంట‌నే స్పందించి పార్టీ నుంచి రూ. 2 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో య‌శస్వి విశ్వ‌తేజ భార్య‌కు అంద‌చేశారు.


ఇక విశ్వ‌తేజ అనారోగ్యం విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన ఎన్‌.ఆర్‌.ఐ విభాగం కూడా త‌మ‌వంతు ఆపన్న‌హ‌స్తం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు అరుణ్ ప‌డాల‌, కృష్ణ బైరెడ్డి, కిషోర్ బొబ్బ‌ర‌ల‌తో పాటు మ‌రికొంద‌రు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌మ వంతుగా త‌లో చేయి వేసి ల‌క్షా 15 వేల రూపాయిల మొత్తాన్ని పోగు చేశారు.. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో జులై 3వ తేదీ బుధ‌వారం నాడు గుండుబిల్లి విశ్వ‌తేజ‌కు అంద‌చేయ‌నున్నారు. బ్ల‌డ్ కాన్స‌ర్ మొద‌టి స్టేజ్‌లో ఉన్నా చికిత్స అత్యంత ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. విశ్వ‌తేజ‌కు సాయం చేయ‌ద‌ల‌చిన దాత‌లు నేరుగా సాయం అందించవ‌చ్చు.. విశ్వ‌తేజ గూగుల్ పే నంబ‌ర్‌: 9494454012, బ్యాంక్ అకౌంట్‌(ఐసిఐసిఐ బ్యాంక్‌) నంబ‌ర్‌: 631601537573.. సాటి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌కు చిన్న వ‌య‌సులో ఆప‌ద వ‌చ్చింది ఆదుకోండి.. సాయం చేయ‌డానికి జ‌న‌సైనికులే అవ‌స‌రం లేదు, స్పందించే హృద‌యం ఉన్న ఎవ‌రైనా మీ వంతు ఆప‌న్న‌హ‌స్తం అందించ‌వ‌చ్చు..

Share This:

456 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × one =