Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / కాపు స‌ర్వే వెనుకా ఏబీఎన్ కుట్ర‌ కోణం.. సేనాని దెబ్బ‌కి ప‌చ్చ వ్యూహం ఫెయిల్‌..

కాపు స‌ర్వే వెనుకా ఏబీఎన్ కుట్ర‌ కోణం.. సేనాని దెబ్బ‌కి ప‌చ్చ వ్యూహం ఫెయిల్‌..

img-20161130-wa0046

స‌ర్వే అన్నాం.. ఏ ప‌ద‌వీ లేకున్నా జ‌న‌సేనాని ప‌నితీరు భాగోలేద‌న్నాం.. ఆ పార్టీ ఒక్క‌సీటు గెల‌వ‌ద‌న్నాం.. ఆఖ‌రికి మూడు శాతం మించి ఓట్లు రాల‌వ‌నీ తేల్చాం.. ఇన్ని అబ‌ద్దాలాడినా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గాని., ఆ పార్టీ నేత‌లుగాని ఒక్క‌రూ నోరు మెద‌ప‌రేం.. ఏదైనా మాట్లాడితే., గుమ్మ‌డికాయ‌ల దొంగ‌లంటూ ముద్ర వేసేయొచ్చు.. ఏమీ లేక‌పోయినా ఏదో ఉంద‌ని జ‌నాన్ని న‌మ్మించేయొచ్చు.. కానీ ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌టం లేదు.. ఇలా ఆలోచ‌న చేసీ..చేసీ చివ‌రికి మ‌రో కుట్ర‌తో కూడిన ప‌న్నాగాన్ని అమ‌లు చేసింది.. టీడీపీ స‌ర్కారు అధికారిక మీడియా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి.. ఏమ‌న్నా మాట్లాడ‌టం లేదు.. క‌నీసం కులం ఇంకు అయినా చ‌ల్లేస్తే పోలా అన్న ఆలోచ‌న చేసి., చివ‌రికి ఇప్ప‌టికి ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే కాపు సామాజిక‌వ‌ర్గం ఎవ‌రి వైపు అనే అంకెల గార‌డీని తెర‌పైకి తెచ్చింది..

అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లో కాపుల్ని బీసీల్లో చేర్చేస్తామ‌న్న హామీని తుంగ‌లో తొక్కినందుకు., కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి ఏడాదికి వెయ్యి కోట్ల అభివృద్ది నిధులు కేటాయిస్తామ‌న్న హామీని గాల్లో క‌లిపేసి అడ్డంగా మోస‌గించినందుకు., కాపు సోద‌రులు మొత్తం మ‌ళ్లీ సైకిల్ స‌వారీనే చేస్తామంటున్నారంట‌.. స‌ర్వే వేస్తే వేశారుగాని., మ‌రీ ఇంత విడ్డూర‌మా.. వెట‌కార‌మా.. ఇప్ప‌టికే ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోలేద‌న్న కోపంతో ఉన్న కాపులు టీడీపీకే కాపు కాస్తార‌న‌డం., ఏబీఎన్ స‌ర్వే ఎంత‌టి న‌మ్మ‌శ‌క్య‌మైన‌దో చెప్ప‌క‌నే చెబుతోంది.. ఇక్క‌డా కాపు ఓటు బ్యాంకుని జనాధ‌ర‌ణ లేని అధికార‌, విప‌క్షాలే కొల్ల‌గొడుతున్నాయంట‌.. జ‌న‌సేన పార్టీకి ఐదు శాతం కాపులు మాత్ర‌మే మ‌ద్ద‌తు తెలుపుతున్నారంట‌.. కాపులు మీ అంత‌టి అతితెలివి గ‌ల వారు కాదులే రాధాకృష్ణ‌గారు.. కాపు కాసే ఆ సామాజిక‌వ‌ర్గానికి కాస్త విజ్ఞ‌త ఉంది.. ఎవ‌రికి ఓటు వేయాలో., ఎవ‌రిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కూడ‌దో వారికి భాగా తెలుసు..

ఇక కుల స‌మీక‌ర‌ణాల్లో ముందుగా కాపు సామాజిక‌వ‌ర్గాన్నే మీరు ఎంచుకోవ‌డం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు.. కాపుల ఓట్లు మొత్తం మాకే అని జ‌న‌సేన పార్టీ నుంచి ఎవ‌రైనా అంటే., వెంట‌నే ప‌వ‌న్‌కళ్యాణ్ ముఖాన కుల ముద్ర గుద్దేయొచ్చు.. ఆయ‌న‌కి అండ‌గా ఉన్న మిగిలిన వ‌ర్గాల‌ని దూరం చేయొచ్చు.. అన్నదే మీ ఆలోచ‌న క‌దా.. అయ్యో మ‌రి ఈ పాచికా పారిన‌ట్టు లేదే.. కాపులు ఓట్లు మొత్తం మూకుమ్మ‌డిగా టీడీపీవేన‌న్నా ఎవ‌రూ నోరుమెద‌ప‌లేదే.. ఈ సారి మీ ప‌చ్చ చొక్కాల ఓట్లన్నీ లెక్కేసుకుని వంద‌శాతం మ‌ద్ద‌తు టీడీపీకే అని రాసుకోండి.. విలువాస‌లువా లేని ఇలాంటి స‌ర్వేలు రోజూ ప్ర‌చారం చేసినా., జ‌నాన్ని న‌మ్మించ‌లేరు.. వారి న‌మ్మ‌కాన్ని మార్చ‌లేరు.. ఏదో మీ రాక్ష‌స ప్ర‌య‌త్నం మీరు చేయాలి కాబ‌ట్టి చేయండి.. ఆల్ ద బెస్ట్‌..

Share This:

2,064 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

One comment

  1. orey radha krishna nuvvu eppatiki maratav raa
    babu adini evarikanna choopinchandra ala vodleyakandra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 3 =