Home / పెన్ పోటు / కామినేని గారూ… మీ డాక్ట‌ర్‌గిరితో అంద‌మైన అబ‌ద్దాలు బాగానే చెప్పారు..

కామినేని గారూ… మీ డాక్ట‌ర్‌గిరితో అంద‌మైన అబ‌ద్దాలు బాగానే చెప్పారు..

kamineni

వైద్యో నారాయ‌ణో హ‌రి.. ప్రాణాలు కాపాడే వైద్యుడు భ‌గ‌వంతుడితో స‌మానం అన్న‌మాట‌.. మ‌రి మ‌న వైద్య‌మంత్రి కామినేని స్వ‌త‌హాగా వైద్యుడు అయ్యివుండి కూడా ఇన్ని అబ‌ద్దాలు ఎలా చెబుతున్నారు.. అంత‌పెద్ద సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, మెడిక‌ల్ కాలేజీలు కూడా ఉన్న మీరు., జ‌నాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం., అదీ ఓ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి.. ఎంత వ‌ర‌కు క‌రెక్టు.. ఒక‌సారి ఆత్మప‌రిశీల‌న చేసుకోండి.. కిడ్నీ వ్యాధి వ‌స్తే డ‌యాల‌సిస్‌, ట్రాన్స్‌ప్లాంట్ మిన‌హా వేరే దారి లేదంటూ అంత ప‌చ్చ అబ‌ద్దాలు ఎలా చెబుతారు..?

uddanam2download

మ‌రి మా జ‌న‌సేన డాక్ట‌ర్ల బృందం ఏంటి ఇలా అంటోంది.. మొద‌టి మూడు స్టేజిల్లో మూత్ర‌పిండాల వ్యాధిని మందుల‌తో న‌యం చేయోచ్చ‌ని దీని మీద ప‌రిశోధ‌న చేస్తున్న డాక్ట‌ర్లలో ఒక‌రైన దుర్గారావుగారు చెబుతున్నారు.. ఆయ‌న మాట‌ల్లో ఒక‌టో స్టేజ్‌లో జీఎఫ్ ఆర్ 90ML/MIN ఉంటుంద‌ట.. ఒక‌ర‌కంగా ఇది నార్మ‌ల్ స్టేజే.. ఇక త‌ర్వాతి స్టేజీలో CKD 60-89 ML/MIN, స్టేజ్ 3ఏ లో CKD 45-59 ML/MIN, స్టేజ్ 3బీ లో CKD 30-44 ML/MIN ఉంటుంద‌ట‌.. ఇక్క‌డి వ‌ర‌కూ కూడా రోగాన్ని మందుల‌తోనే న‌యం చేయొచ్చ‌ని జ‌న‌సేన నియ‌మించిన క‌మిటీలో డాక్ట‌ర్లు చెబుతున్నారు.. రోగం ముదిరి నాలుగు ఐదు స్టేజిల్లోకి వ‌స్తే కిడ్నీ ఫంక్ష‌నింగ్ పూర్తిగా దెబ్బ‌తింటుంది కాబ‌ట్టి., దాన్ని మెరుగు ప‌ర్చేందుకు మాత్ర‌మే డ‌యాల‌సిస్‌, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు అవ‌స‌ర‌మౌతాయి.. మ‌రి డాక్ట‌ర్ కామినేని గారు మీరు ఏంటి అలా చెబుతున్నారు.. మీరు కిడ్నీ శాస్త్రం చ‌దువుకోలేదా..? లేక వ్య‌వ‌హారాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించే ల‌క్ష్యంతో అలా మాట్లాడారా.. మా డాక్ట‌ర్లు చెబుతుంది అబ‌ద్దం అయితే., వారితో బ‌హిరంగ చ‌ర్చ‌కు మీరు కూర్చో వ‌చ్చు.. ఇది ఓపెన్ ఛాలెంజ్‌..

kamineni-srinivas

జ‌న‌సేనాని బ‌రిలోకి దిగారంటే., ఏదీ పూర్తిగా తెలుసుకోకుండా బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ‌రు మీలా.. ఉద్దానం ప్రాంతంలో 70 వేల మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు ఉంటే., మీకు ఏడు వేల మందే క‌న‌బ‌డ్డారా..? అవును ప‌వ‌న్‌కళ్యాణ్ మండ‌లానికి ఓ డ‌యాల‌సిస్ సెంట‌ర్ కావాల‌ని అడిగారు.. ఎందుకంటే చివ‌రి స్టేజ్‌లో ఉన్న‌వారిని చికిత్స నిమిత్తం ఎక్కువ దూరం తీసుకెళ్ల‌డం క‌ష్టం కాబ‌ట్టి.. ఆ మాట‌ని ప‌ట్టుకుని మీరు క‌ట్టుక‌థ అల్లేశారు.. ఏ జిల్లాలో రెండుకి మించి డ‌యాల‌సిస్ యూనిట్లు లేవు.. ఇక్క‌డే ఎక్కువ కేటాయించాం అంటున్నారు.. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న చోటే క‌ధ చికిత్స అవ‌స‌రం..

స‌మ‌స్య జ‌నిటిక‌ల్ కాదు అని మీరే చెప్పారు.. కార‌ణం భూగ‌ర్భ జ‌లాలే కావొచ్చు అన్న ప్రాధ‌మిక నిర్ధార‌ణ‌లు ఉన్నాయి.. మ‌రి ఈ ప్రాణాంత‌క వ్యాధికి గురికాకుండా స‌ర్కారు నుంచి జాగ్ర‌త్త‌లు ఏవి.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి., ఆర్ ఓ వాట‌ర్ ఈ ఏడు మండ‌లాల్లో ఎన్ని ఊర్ల‌కు, ఎంత మందికి అందిస్తున్నారు.. త్వ‌ర‌లో అంద‌రికీ అందిస్తాం.. అంటారు.. జ‌న‌సేనాని ఆ ప్రాంతంలో అడుగు పెట్టే వ‌ర‌కు ద‌శాబ్దాల నుండి ఉన్న స‌మ‌స్య తీవ్ర‌త‌, జ‌నం చావులు మిమ్మ‌ల్ని ఎందుకు క‌రిగించ‌లేదు.. ఇప్ప‌టి వ‌ర‌కు బాధిత ప్రాంతాల‌కు క‌నీసం ర‌క్షిత మంచినీరు కూడా ఎందుకు ఏర్పాటు చేయ‌లేదు..

100 కోట్లు కేటాయిస్తే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌యితే., కేటాయిస్తామంటున్నారుగా..? కేటాయిస్తే., అంద‌రికీ ఆర్ ఓ వాట‌ర్ స‌ర‌ఫ‌రా చేయొచ్చు., మొద‌టి మూడు ద‌శ‌ల్లో రోగం ఉన్న‌వారికి ఉచితంగా మందులు ఇవ్వ‌వ‌చ్చు.. ఇస్తామంటున్న మీ మాట‌ల్లో చిత్త‌శుద్ది ఉంటేనేలెండి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌స్ పాస్‌లు ఇవ్వ‌మ‌న్న త‌ర్వాత రోగుల‌ని తీసుకువెళ్లేందుకు ప్ర‌త్యేక వాహ‌నాలు ఏర్పాటు చేస్తాం అని చెబుతున్నారు.. సంతోషం.. కానీ కామినేని గారు.. మీరు ఏర్పాటు చేసిన రెండు డ‌యాల‌సిస్ యూనిట్ల‌లో ఎంత మందికి వైద్యం అందించ‌గ‌లుగుతారు..? శ‌్రీకాకుళం, విశాఖ వంటి సుధూర ప్రాంతాల్లో వైద్యం చేయించుకునే వారి ప‌రిస్థితి ఏంటి..? ఆ ప్ర‌జ‌ల ఓట్ల‌తోనే గెలిచామ‌న్న చిత్త‌శుద్ది మీకు, మీ స‌ర్కారుకీ ఉంటే.. 48 గంటల్లో స‌మ‌స్య ప‌రిష్కరించ‌న‌వ‌స‌రం లేదు.. చ‌ర్య‌లు ప్రారంభించొచ్చు.. నోబెల్ బ‌హుమ‌తి సాధించిన వారికి 100 కోట్లు అవ‌స‌రం లేదు.. ఇలాంటి ఆభాగ్యుల‌కి ఇవ్వండి అవేవో..

ఇక్క‌డ మీరు మాట్లాడిన ఇంకో మాట‌కి మేం బ‌దులు చెప్పాలి… ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు వేసిన క‌మిటీ., వ్యాధి ఎందుకు వ‌స్తుందో ప‌రిశోధ‌న చేస్తుంద‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు.. ఎక్క‌డెక్క‌డ వ‌స్తోంది..? ఏ ఊరిలో ఎంత మందికి ఉంది..? మందుల‌తో న‌య‌మ‌య్యే స్టేజీలో ఎంత మంది ఉన్నారు..? డ‌యాల‌సిస్ అవ‌స‌ర‌మున్న వారు ఎంత మంది..? స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా తీసుకోవాల్సిన త‌క్ష‌ణ చ‌ర్య‌లు ఏంటి..? ఇప్ప‌టి వ‌ర‌కు మీ పాల‌కులు చేసింది ఏంటి..? అనే అంశాల‌పై మాత్ర‌మే నివేధిక ఇస్తారు.. డాక్ట‌ర్ కామినేనిగారు., అబ‌ద్దాలు చెప్ప‌డం, వెట‌కారాలు మాట్లాడ‌టం మాని., స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించండి.. ప్ర‌జ‌లు ఓట్లేసి గెలిపించింది మీకే., జ‌న‌సేనాని మీ బాధ్య‌త మీకు గుర్తు చేస్తున్నారు.. మీరు చేయాల్సిన ప‌నులు కూడా ఆయ‌న చేసే కాడికి ఆ ప‌ద‌వులు మీకెందుక‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.. ఇప్పటికిప్పుడు కాకున్నా 2019లో వారికి ఖ‌చ్చితంగా బ‌దులు చెప్పాల్సిందే..

Share This:

1,725 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 9 =