Home / జన సేన / కార్మికుల హ‌క్కులు కాపాడాలి.. జ‌న‌సేనుడి కార్మిక దినోత్స‌వ సందేశం..

కార్మికుల హ‌క్కులు కాపాడాలి.. జ‌న‌సేనుడి కార్మిక దినోత్స‌వ సందేశం..

శ్రామిక శ‌క్తికి ప్ర‌తీక‌గా., ఇంట్లో త‌ల్లి ద‌గ్గ‌ర నుంచి ఫ్యాక్ట‌రీలో కార్మికుడి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి శ్ర‌మ‌ను గౌర‌విస్తూ మెడ‌లో ఎర్ర తుండు వేసుకు తిరిగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ త‌న‌ను తాను నిత్య శ్రామికుడిగానే మ‌ల‌చుకున్నారు.. ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం, వ్య‌వ‌స్థ నిర్మాణంలో స‌మిధ‌లుగా మారే కార్మికుల హ‌క్కుల కోసం నిరంత‌ర పోరాటాలు చేయ‌డానికి తాను ఎల్ల‌ప్పుడు సిద్ధ‌మేన‌ని ఎన్నో సంద‌ర్బాల్లో చాటి చెప్పారు.. స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం నినాదాన్ని భుజానికెత్తుకుని కార్మిక శ‌క్తికి తాను ఎలాంటి విలువ ఇస్తారో చెప్ప‌క‌నే చెప్పారు.. జాతి నిర్మాణంలో కార్మికుల శ్ర‌మ‌ను గుర్తించాల్సిన‌, గౌర‌వించాల్సిన బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ కార్మికుల‌కి జ‌న‌సేనాని మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు..

కార్మికుల దినోత్స‌వం సంద‌ర్బంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో కార్మికుల ప‌ట్ల పాటించాల్సిన క‌నీస ధ‌ర్మాన్ని గుర్తు చేస్తూ జ‌న‌సేన అధినేత సందేశ‌మిచ్చారు.. ఒక జాతి నిర్మాణం, పురోగ‌మ‌నంలో కార్మికుల కోఠోర శ్ర‌మ‌, అంకిత‌భావం విస్మ‌రించ‌లేనివ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. కార్మికుల శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ఇచ్చి గౌర‌వించ‌డం మ‌న ధ‌ర్మమ‌ని సూచించారు.. కార్మికులు త‌మ‌కు న్యాయ‌బ‌ద్దంగా ద‌క్కాల్సిన హ‌క్కుల కోసం, క‌నీస వేత‌నాల కోసం ఉద్య‌మించే ప‌రిస్థితులు ఉత్ప‌న్నం కాకుండా కార్మిక చ‌ట్టాలు ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చూడాల్సిన బాధ్య‌తను ప్ర‌భుత్వానికి గుర్తు చేశారు.. మే 1 వ తేదీ కార్మికుల దినోత్స‌వం సంద‌ర్బంగా కార్మిక లోకానికి, త‌న త‌రుపున‌, జ‌న‌సేన త‌రుపున ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప‌లాస‌లో నేడు జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు.. కాశీబుగ్గ బ‌స్టాండ్ వ‌ద్ద జ‌న‌సేనుడి గ‌ర్జ‌న‌..

విభ‌జ‌న‌తో వంచించ‌బ‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌రుపున‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేప‌ట్టిన పోరాట యాత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 2 =

%d bloggers like this: