Home / జన సేన / కార్య‌క‌ర్త‌ల మృతి ప‌ట్ల జ‌న‌సేనాని ఆవేద‌న‌.. ఇరువురి కుటుంబాల‌కి అండ‌గా వుంటామ‌ని హామీ..

కార్య‌క‌ర్త‌ల మృతి ప‌ట్ల జ‌న‌సేనాని ఆవేద‌న‌.. ఇరువురి కుటుంబాల‌కి అండ‌గా వుంటామ‌ని హామీ..

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం, విభ‌జ‌న హామీల అమ‌లు ధ్యేయంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వన్‌క‌ళ్యాణ్ చేప‌ట్టిన పోరాట యాత్ర కోసం ప్ర‌చార ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు విద్యుత్ ఘాతానికి గుర‌వ‌డం పార్టీ అధినేత‌తో పాటు జ‌న‌సేన శ్రేణుల‌ని తీవ్ర మ‌నోవేధ‌న‌కి గురిచేసింది.. విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట‌లోని సూర్య మ‌హాల్ సెంట‌ర్‌లో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఈ విషాదం చోటు చేసుకుంది.. బ్యానర్లు ఏర్పాటు చేయ‌బోతూ విద్యుత్‌ఘాతానికి గురై తోళెం నాగ‌రాజు, భీమ‌వ‌ర‌పు శివ అనే ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు మృత్యువాత ప‌డ్డారు.. ఈ విషాద వార్త విని జ‌న‌సేనాని ఒక్క‌సారిగా క‌ల‌వ‌ర‌పాటుకి గుర‌య్యారు.. క‌రెంట్ షాక్‌తో ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌లు మృత్యువాత ప‌డ్డార‌న్న వార్త త‌న మ‌న‌సుని క‌ల‌చి వేసిందంటూ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. ఈ దుర్ఘ‌ట‌న‌లో టి.నాగ‌రాజు, శివ‌ల మ‌ర‌ణం త‌నను చాలా బాధించింద‌ని తెలిపారు.. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుణ్ణి ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు..

శివ‌, నాగ‌రాజుల మ‌ర‌ణం వారి కుటుంబీకుల‌కి ఎంత‌టి వేద‌న క‌లిగిస్తుందో తాను అర్ధం చేసుకోగ‌ల‌న‌ని., మృత్యువాత ప‌డిన వారి కుటుంబాల‌ను తాను స్వ‌యంగా ప‌రామ‌ర్శిస్తాన‌ని తెలిపారు.. జ‌న‌సేన పార్టీ ఆ ఇరువురి కుటుంబాల‌ని ఆర్ధికంగా అదుకుంటుంద‌ని కూడా భ‌రోసా ఇచ్చారు.. ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా అండ‌గా ఉంట‌మాని మాటిచ్చారు.. అటు జ‌న‌సేన పార్టీ శ్రేణులు కూడా ఈ ఇరువురి కుటుంబాల‌ను త‌మవంతు ఆదుకునేందుకు స్వ‌చ్చందంగా ఏర్పాట్లు చేస్తున్నాయి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం.. ఇక్క‌డి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాలు..

జ‌న‌సేన పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం కొత్త భ‌వ‌నానికి మారింది.. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ భ‌వంతిలో నూత‌న కార్యాల‌యం ప్రారంభ‌మైంది.. శుక్ర‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + eleven =

%d bloggers like this: