Home / పాలి 'ట్రిక్స్' / కిర‌ణ్‌-ప‌వ‌న్ చ‌ర్చ‌లు అబ‌ద్దం.. 23న జ‌న‌సేన‌లో చేర‌డం ప‌చ్చిఅబ‌ద్దం..

కిర‌ణ్‌-ప‌వ‌న్ చ‌ర్చ‌లు అబ‌ద్దం.. 23న జ‌న‌సేన‌లో చేర‌డం ప‌చ్చిఅబ‌ద్దం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలిటిక్స్‌లో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్‌గా మార‌డంతో., రాజ‌కీయాల‌న్నీ ఆయ‌న చుట్టూతే తిరుగుతున్నాయి.. జ‌నంలో ప‌వ‌న్ ప‌వ‌ర్ చూసి., రాజ‌కీయ నిరుద్యోగులు చాలా మంది జ‌న‌సేన వైపు చూస్తున్నారు కూడా.. ఆయ‌న ఓకే అంటే ఈ పాటికే పార్టీ కార్యాల‌యం మొత్తం నిండిపోయి ఉండేది కూడా.. అయితే గ‌తి త‌ప్పిన నేటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని ప్ర‌క్షాళ‌ణ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ప్ర‌తి అడుగు ఆచితూచి వేస్తూ జ‌న‌సేన నిర్మాణం గావిస్తున్నారు.. దీంతో కొంద‌రు ప‌వ‌న్‌ని క‌ల‌వ‌డం ఎలా..? అని గుంపు చింపులు ప‌డుతుంటే.. మ‌రికొంద‌రు ఎవ‌రు చెబితే జ‌న‌సేనాని వింటారు అనే కోణంలో మంత‌నాలు జ‌రుపుతున్నారు.. వీరంతా ఒక ఎత్త‌యితే ఇంకొంద‌రు స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం మైండ్‌గేమ్ మొద‌లుపెట్టారు.. మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి జ‌న‌సేన పార్టీలో చేరుతున్నారంటూ వ‌స్తున్న వార్త కూడా అలాంటిదే.. కిర‌ణ్-ప‌వ‌న్‌లు మంచి స్నేహితుల‌నీ, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి 23న జ‌న‌సేన పార్టీలో చేరుతున్నార‌నీ, ఆయ‌న జ‌న‌సేన పార్టీ ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తార‌నీ., కిర‌ణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మ‌రికొంద‌రు జ‌న‌సేన‌లో చేరుతున్నార‌ని., ఇంకా మాట్లాడితే బెంగ‌ళూరులో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మంత‌నాలు జ‌రుపుతున్నార‌నీ., మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. ఇక జాతీయ మీడియా అయితే ఏకంగా కిర‌ణ్‌కుమార్‌రెడ్డి తాను క‌ట్టుకోబోయే వ‌దువు పేరు జ‌న‌సేన అని., 23న ముహుర్తం అని స్వ‌యంగా చెప్పిన‌ట్టు రాసుకొచ్చింది.. అయితే ఇలాంటి ఏ వార్త‌లోనూ నిజం లేదు..

కిర‌ణ్‌-ప‌వ‌న్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు అబ‌ద్దం.. ఆయ‌న పార్టీలో చేర‌డ‌మూ అబ‌ద్ద‌మే.. కానీ ఎక్క‌డో వ‌చ్చిన వార్త‌లు చూసి ప‌వ‌న్ అభిమానులు ఆ విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు కూడా.. ఈ వార్త‌ని విప‌రీతంగా స‌ర్క్యులేట్ చేస్తున్నారు కూడా.. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి బీజేపీ వైపు చూస్తుంటే., జ‌న‌సేన‌లో చేరుతున్నార‌నే వార్త ఎలా వ‌చ్చింది..? ఎందుకు వ‌చ్చింది..? ఇది కిర‌ణ్ మైండ్‌గేమా.,ప్ర‌త్య‌ర్ధుల ప‌న్నాగ‌మా.. లేక ప‌వ‌న్‌పార్టీని దెబ్బ తీసేందుకు జ‌రుగుతున్న కుట్రా..? విష‌యం ఏమై ఉంటుంద‌నేది ప‌క్క‌న‌పెడితే., ద‌య‌చేసి ఇలాంటి పుకార్ల‌ను ప్ర‌చారం చేయోద్ద‌ని పార్టీ అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య‌గారు జ‌న‌సైన్యానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఏ విష‌య‌మైనా., అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు ప్ర‌చారం చేయొద్ద‌ని కోరుతున్నారు.. ఇలాంటి వార్త‌ల వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లుగుతుంద‌ని, ప్ర‌త్య‌ర్ధులు వేసే ఎత్తుల్లో మీరు పావులు కావొద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు..

జ‌న‌సేన‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి సంబంధించిన సోష‌ల్ మీడియాలో ఇలాంటి వార్త‌ల‌కు అత్యంత ప్రాచుర్యం ఉండ‌డం చూసి., ప‌వ‌న్‌టుడే ద్వారా గ‌తంలో ఒక‌సారి విజ్ఞ‌ప్తి చేయ‌డం జ‌రిగింది.. ఇలాంటి పుకార్ల‌ను ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంది.. పార్టీ విధానాలు గానీ, పార్టీకి సంబంధించిన ఎలాంటి అడుగ‌యినా జ‌న‌సేనాని నేరుగా అంద‌రితో పంచుకుంటారు.. పార్టీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు ఇలాంటి వార్త‌ల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌కండి..

Share This:

1,176 views

About Syamkumar Lebaka

Check Also

దూకుడు పెంచిన జ‌న‌సేన.. అభ్య‌ర్ధుల ఎంపిక‌కి ఐదుగురు స‌భ్యుల స్క్రీనింగ్ క‌మిటీ..

అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం శ‌ర‌వేగంగా సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేన పార్టీ., అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ‌కి అడుగులు వ‌డివ‌డిగా వేస్తోంది.. ఏపీ అసెంబ్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + 7 =