Home / పవన్ టుడే / కులాల కుంప‌ట్లలో చ‌లికాచుకుంటున్న కుటిల రాజ‌కీయాల్లో ప‌చ్చి మీడియా పాతివ్ర‌త్యం మ‌హా దొడ్డు..!!!

కులాల కుంప‌ట్లలో చ‌లికాచుకుంటున్న కుటిల రాజ‌కీయాల్లో ప‌చ్చి మీడియా పాతివ్ర‌త్యం మ‌హా దొడ్డు..!!!

జనసేనుడు కుల సమావేశాలను నిర్వహిస్తూ వివిధ కులాల సాధక బాధకాలను తెలుసుకొంటున్నది కులాలను రెచ్చగొట్టడానికేగాని కులాలను కలపడానికి కాదేమో అని పచ్చ భాష్యాలు చెబుతున్న పచ్చ మీడియా వాదనలో నిజమెంత? పాలిత వర్గాలు కొత్తగా కారుస్తున్న మొసలి కన్నీరులో ఉన్నది పన్నీరునా లేక కమ్మని తేనేపూసిన దొడ్డ విషపు పానీయమా?

జనసేనుడు హరిరామజోగయ్యని కలిస్తే “పాతకాపుని కలిసిన జనసేనుడు” అనే శీర్షికలతో ప్రచారము చేస్తారు. కానీ చంద్రబాబుని లగడపాటి కలిస్తే కమ్మనాయుడుని, మరొక కమ్మ నాయుడు కలిశారు అని రాయరు. శ్రీ వెంకయ్య నాయుడిని, బాబు కలిస్తే కమ్మ నాయుడి గారిని, మరొక కమ్మ బాబు కలిశారు అని రాయరు. ప‌త్రికాధిపతులు, బాబుని కలిస్తే కమ్మ ప్రతికా అధిపతులు, కమ్మ బాబుని కలిశారు అని ప్రచారము చేయరు.

రోజా, జగనన్న’కి మద్దతు ఇస్తే ఒక రెడ్డి మరొక రెడ్డికి మద్దతునిస్తున్నది అని రాయరు. ఆనం సోదరుడు జగన్ని కలిస్తే ఒక రెడ్డి మరొక రెడ్డి పార్టీలో చేరుతున్నాడు అని రాయరు. జగన్ తన పరిధిలో ఉన్న PAC పదవిని ఒక రెడ్డికి ఇస్తే ఒక రెడ్డి మరొక రెడ్డికి ఇచ్చారు అని రాయరు. కానీ వేరే అణచివేయబడ్డ కులానికి ఇస్తే వారి కులంపేరుతో రాస్తారు. ఒక రెడ్డిని తిట్టడానికి మరొక రెడ్డి అధికార ప్రతినిధిని ఉపయోగించరు. ఒక కమ్మ నాయకుడిని తిట్టడానికి కమ్మ అధికార ప్రతినిధిని ఉపయోగించరు. కానీ మాల అయితే మాలతో, మాదిగ అయితే మాదిగతో, బీసీ అయితే బీసీతో, కాపు అయితే కాపుతో తిష్ఠిస్తారు.

జనసేనుడు, జేడీని కలిస్తే కాపుల కలయిక అంటారు. జనసేనుడుని మోత్కుపల్లి కలిస్తే కులాలను రెచ్చగొట్టడము అంటారు. ఇదెక్కడి న్యాయము. ఎన్నాళ్లీ వివక్షతా పూరిత పచ్చ విష ప్రచారాలు?

ఎస్సీలను విభజిస్తాను, రజకులను ఎస్సీలలో కలుపుతాను, మత్సకారులను ఎస్టీలలో కలుపుతాను, కాపులను బీసీలలో కలుపుతాను అన్న కమ్మని బాబుని కుల రాజకీయాలు చేస్తున్నారు అని ప్రచారము చేయరు. దీనికి తాళము వేసిన దొడ్డ దొరని కుల రాజకీయాలు చేస్తున్నారు అని అనరు. దళిత తేజము, కాపుల సింహనాదం, బీసీల గర్జన పేరుతో కుల సమావేశాలను ప్రభుత్వమే పెడుతుంటే, వీటికి మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరు అవుతుంటే వీరిని కుల రాజకీయాలు చేస్తున్నారు అని ప్రచారము చేయరు. కమ్మని దొడ్డ దొరలు తమ ఓట్లు కోసం వివిధ కులాలను వీధుల్లోకి లాగి, ఎన్నికలు అయినతరువాత నడి రోడ్డు మీద వదిలి పబ్బము గడుపుకొంటున్నాగాని పాతుకుపోయిన పార్టీలను కుల రాజకీయాలు చేస్తున్నారు అని ప్రచారము చేయరు.

పాలిత వర్గాలు పదిరికుప్పం, కంచికచర్ల, కారంచేడు, చుండూరులలో దళిత సోదరులపై చేసిన నరమేధముపై కమ్మని దొడ్డ మీడియాలో ప్రచారము చేయరు. నేటి తరానికి పాలిత వర్గాల అణచివేతని మీడియాలో చెప్పరు. మొన్న పెందుర్తిలో దళిత మహిళపై చేసిన దౌర్జన్యాన్ని మీడియాలో చెప్పరు. కానీ అణచివేయబడ్డ వర్గాల్లో ఏదో చిన్న చిన్న చిరుబొరికలు వస్తే మాత్రము పెద్ద రాద్దాంతము చేస్తారు. అణచివేయబడ్డ కులాలు కలవకుండా కొట్టుకుచావాలి అనే తలంపుతో అగ్నికి ఆజ్యము పోస్తుంటారు. ఇదెక్కడి న్యాయము. ఎన్నాళ్లీ వివక్షతా పూరిత పచ్చ విష ప్రచారాలు?

ప్రభుత్వము, కార్యనిర్వాక వర్గము, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలన్నిటితో పాటు మీడియా కూడా ఈ రెండు వర్గాల చేతుల్లో ఉండడమే దీనికి కారణము. అందుకే ఆ రెండు వర్గాలపై, వారికి ఊడిగము చేస్తున్న వారిపై ఈగ కూడా వాలకుండా ఈ కమ్మని దొడ్డ మీడియా కాపు కాస్తూ ఉంటుంది.

కానీ నేడు పరిస్థితి భిన్నముగా ఉన్నది. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తున్నది. ప్రచండ పవనాలు అన్ని చోట్లా వీస్తున్నాయి. విడిపోయి కొట్టుకుచస్తున్న వివిధ కులాల్లో జనసేనుడు ఆలోచనను మొలకెతెస్తున్నాడు. అగ్రవనాల్లోఉన్న పేదల్లో జనసేనుడు ధైర్యాన్ని కలిపిస్తున్నాడు. మహిళా రిజర్వేషనులు, ఉచిత గ్యాసు అంటూ మహిళలకు భరోసా నిస్తున్నాడు

జనసేనుడుని ఇలానే వదిలేస్తే పాలిత కుటుంబాల మనుగడే కష్టము. జనసేనుడిని అడ్డుకోకపోతే కుర్చీలను అంటిపెట్టుకొని ఉన్న కమ్మని పచ్చ సామ్రాజ్యాలు, కుర్చీలుకోసము పిల్లిమొగ్గలు వేస్తున్న జలగ సామ్రాజ్యాలు పతనం ఖాయం. అందకే కమ్మని దొడ్డ మీడియా విష ప్రచారాలు ముమ్మరం చేస్తోంది. వీరి ప్రచారాల్లో తమ తమ వర్గ పరిరక్షణేగాని సమాజ శ్రేయస్సు కానే కాదు అని అణచివేయబడ్డ వర్గాలు మరింత గ్రహించినరోజున పచ్చని దొడ్డ మీడియా రోదన అరణ్యరోదనే కాగలదు. నాడు రాజకీయాల్లో మార్పు రాగలదు. అప్పుడు అన్ని వర్గాల్లో ఆనందం పరిఢవిల్లగలదు.

Share This:

1,826 views

About Syamkumar Lebaka

Check Also

సేనాని బాటే నా మాట‌.. అసెంబ్లీలో ప్ర‌యాణంపై జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు ఎన్నికయిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభినంద‌న‌లు తెలియ‌చేశారు.. తూర్పుగోదావ‌రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 8 =