Home / ఎడిటోరియల్స్ / కులాల గోడ‌ల్ని కూల్చేద్దాం మంటున్న జ‌న‌సేనాని.. ల‌క్ష్యం దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు..

కులాల గోడ‌ల్ని కూల్చేద్దాం మంటున్న జ‌న‌సేనాని.. ల‌క్ష్యం దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు..

కులాల్ని క‌లిపే ఆలోచ‌నా విధానం.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల్లో మొట్ట‌మొద‌టిది.. మ‌రి కులాల‌ని క‌ల‌ప‌డం సాధ్య‌మేనా..? అంటే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగూ ఆ దిశ‌గా వేస్తూనే ఉన్నారు.. సాధార‌ణం ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కులు వ‌ల‌విసిరేది కుల సంఘాల‌కే.. కుల సంఘ నాయ‌కులకి వ‌ల విస‌ర‌డం.. మీ కులానికి అది చేస్తాం.., ఇది చేస్తాం అంటూ లేని పోని హామీలు ఇవ్వ‌డం.. అంతే కాదు ఆ హామీలు నెర‌వేర్చాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఎదుటి కులాన్ని ఎగ‌దోసి కులాల మ‌ధ్య కుంప‌టి రాజేయ‌డం.. జ‌న‌సేనాని వ్య‌వ‌హారంలో మాత్రం సీన్ మ‌రోలా ఉంది.. జ‌న‌సేన‌కి మ‌ద్ద‌తు ఇస్తామంటూ కోర్కెల చిట్టా ప‌ట్టుకుని వ‌స్తున్న కుల సంఘాలతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మావేశం నిర్వ‌హించిన‌ప్పుడు.. ఆయ‌న చెబుతున్న మాట‌లు అందుకు అద్దం ప‌డుతున్నాయి.. కార్పొరేష‌న్ ఏర్పాటు ప్ర‌తిపాధ‌న‌ను రెల్లి సంఘం ఆయ‌న ముందు ఉంచ‌గా., కార్పొరేష‌న్లు కాదు కావ‌ల్సింది.. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికే అవ‌కాశం.. అది కుల వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌తోనే సాధ్య‌మ‌న్న ఆయ‌న మాట‌ల్లో అంత‌రార్ధం ఇట్టే అర్ధం అవుతుంది. ఎవ‌రికి వారు ప్ర‌భుత్వంలో ఉండి కార్పోరేష‌న్ ఏర్పాటు చేసుకునే స్థితికి తీసుకువెళ్తామ‌న‌డం వెనుక నిక్షిప్త‌మైన అస‌లు ఉద్దేశం కూడా అదే. వెనుక‌బాటు రూపుమాపితే, ఇంకా కులాల ప్ర‌స్థావ‌న ఎందుకు అన్న‌దే..

అంతేకాదు ఆర్ధిక ప‌రిస్థితి మెరుగు ప‌డితే, కుల ప్ర‌స్థావ‌న అంత‌ర్ధానం అయిపోతుంద‌న్న ఆలోచ‌నా విధానాన్ని కూడా ఆయ‌న ముందుకి తీసుకెళ్తున్నారు.. రెల్లి కుల‌స్తులతో జ‌రిగిన స‌మావేశంలో పారిశుధ్య కాంట్రాక్టులు వారికే కేటాయిస్తామ‌న‌డం వెనుక ర‌హ‌స్యం అదే కావ‌చ్చు.. అటు గ‌ర‌గ‌ప‌ర్రు లాంటి వ్య‌వ‌హారాలు, క్రైస్త‌వ మ‌త పెద్ద‌ల్ని క‌లిసిన స‌మావేశంలోనూ కుల‌మ‌తాల ప్ర‌స్థావ‌న వ‌చ్చింది.. ముఖ్యంగా ఓ కులాన్ని ఓ పార్టీకి అంట‌గ‌ట్ట‌డం.. ఈ మ‌తం ఈ పార్టీకి మ‌ద్ద‌తు అన్న బ్రాండింగ్ వేయొద్ద‌ని వారించారు.. అలా చేయ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కులాల మ‌ధ్య కుంప‌ట్లు రేపుతార‌న్న‌ది జ‌న‌సేనాని వాద‌న‌.. అంతే కాదు ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందించే వ్య‌వ‌హారంలో కూడా తేడాలు ఉంటున్నాయని కూడా అంటున్నారు.. ప్ర‌స్తుతం జ‌న్మ‌భూమి క‌మిటీల ముసుగులో జ‌రుగుతున్న దందా వెళ్లిన ప్ర‌తి చోటా ఆయ‌న దృష్టికి వ‌చ్చిన విష‌యం గ‌మ‌నార్హం.. గ‌ర‌గ‌ప‌ర్రు వ్య‌వ‌హారాన్ని భుజాన వేసుకోక‌పోవ‌డానికి కార‌ణాలు వివ‌రించే క్ర‌మంలో కూడా కులాల ప్ర‌స్తావ‌న‌ని జ‌న‌సేన అధినేత లేవ‌నెత్తారు.. ఏఐడీఆర్ఎఫ్ కార్య‌క‌ర్త‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో సంప్ర‌దాయ రాజ‌కీయాల నుంచి బ‌య‌టికి రావాలంటూ జ‌న‌సేనాని పిలుపునివ్వ‌డం వెనుక కూడా ప‌దే ప‌దే కుల ప్ర‌స్థావ‌న‌ల నుంచి యువ‌త‌ని బ‌య‌ట‌ప‌డేయ్యాల‌న్న ఉద్దేశ‌మే అంత‌ర్లీన‌మై ఉంది. గ‌ర‌గ‌పర్రు వ్య‌వ‌మారంలో ఇద్ద‌రు వ్య‌క్తుల్ని కూర్చొబెట్టి మాట్లాడితే స‌ర్ధుకుపోయే త‌గవుని కావాల‌నే పెద్ద‌ది చేశార‌న్న ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు తాను వ‌స్తే ., చంద్ర‌బాబు మ‌రోసారి కులాల మ‌ధ్య కుంప‌ట్లు రాజేయ‌డానికి సిద్ధంగా కాచుకు కూర్చున్నార‌ని తెలిపారు.

Advertisement.

ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులు అవ‌కాశం దొరికిన చొట‌ల్లా కులూల‌ను ఎగ‌దోసి ల‌బ్ది పొందుదామ‌న్న చందంగా ఉన్నాయి.. ఏ చిన్న గొడ‌వ జ‌రిగినా దానికి కులం రంగు పుల‌మ‌డం ఆన‌వాయితీగా మారిపోయింది. కానీ జ‌న‌సేన అధినేత ఏమో ప్ర‌తి అడుగుని కుల ప్ర‌స్థావ‌న‌కి దూరంగా వేస్తున్నారు. త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన కుల సంఘాల‌ని అందుకు ఒప్పిస్తున్నారు కూడా.. కులాల్ని క‌లిపే సిద్ధాంతాన్ని బ‌లంగా వినిపిస్తున్నారు.. కులాల్ని క‌లపాలంటే ముందు వెనుక‌బ‌డిన కులాల ఆర్ధిక వెనుక‌బాటు తొల‌గించాలి.. ఆ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రిలో నేను అన్న ఆత్మ‌విశ్వాసాన్ని నింపాలి.. మేం త‌క్కువ కాదు అన్న భరోసా క‌ల్పించాలి.. అందుకే ప్ర‌త్యేక కార్పొరేష‌న్లు పెట్టి అభివృద్ది చేయాల‌న్న డిమాండ్‌ని ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌తి కులానికీ అధికారంలో భాగ‌స్వామ్యం క‌ల్పించాలి.. ఎవ‌రిని వారే అభివృద్ది ప‌రుచుకునే దిశ‌గా బాట‌లు వేయాలి అన్న ఆలోచ‌న చేస్తున్నారు.. రెల్లి కుల‌స్థుల‌తో జ‌రిగిన మీటింగ్‌లో జ‌నసేన అధినేత అదే అంశాన్ని ప్ర‌స్థావించారు.. ప్ర‌భుత్వంలో మీరే ఉండి కార్పొరేష‌న్ ఏర్పాటు చేసుకునే స్థాయికి తీసుకువ‌స్తామ‌ని ఇచ్చిన హామీ అదే.. అంతేకాదు ప్ర‌తి ఒక్క‌రి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడే ప‌నిని కూడా జ‌న‌సేన భుజాన వేసుకుంటుద‌ని చెప్ప‌డం వంటి అంశాలు., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉన్న బ‌ల‌మైన ఆలోచ‌నా విధానానికి నిద‌ర్శ‌నం.. ఒక విధానం ప్ర‌జ‌ల్లోకి వెళ్ళ‌డానికి స‌మ‌యం తీసుకున్నా, దాన్ని ఖ‌చ్చితంగా సాధించాల‌న్న త‌ప‌న ఆయ‌న‌లో క‌న‌బ‌డుతోంది.. అందుకే ఓ 25 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానానికి నాందీ ప‌లికిన‌ట్టు ప‌దే ప‌దే చెప్ప‌డం వెనుక కార‌ణం అదే కావ‌చ్చు..

Advertisement.

Share This:

1,977 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − six =