Home / జన సేన / కుల రాజ‌కీయాల‌పై జ‌న‌సేనాని ఫైర్‌.. మీ పార్టీల‌కి కులాలు వ‌ర్తించ‌వా..? అంటూ నిల‌దీత‌..

కుల రాజ‌కీయాల‌పై జ‌న‌సేనాని ఫైర్‌.. మీ పార్టీల‌కి కులాలు వ‌ర్తించ‌వా..? అంటూ నిల‌దీత‌..

ఉత్త‌రాంధ్ర పోరాట యాత్ర‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రోజుకో బాంబు ప్ర‌త్య‌ర్ధుల‌పై పేలుస్తున్నారు.. టార్గెట్ జ‌న‌సేన‌లో భాగంగా కుటిల రాజ‌కీయ శ‌క్తులు విసురుతున్న ప్ర‌తి స‌వాలునీ స్వీక‌రిస్తూ., ప్ర‌జ‌ల్ని స‌మాదానప‌రుస్తూ ముందుకి దూసుకుపోతున్నారు.. త‌మ అనుంగ మీడియా, కార్పొరేట్ శ‌క్తుల సాయంతో జ‌న‌సేన‌కి బ‌ల‌వంతంగా కులాన్ని అంట గ‌ట్టేందుకు అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీలు చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి.. ఈ మ‌ధ్య కాలంలో అధికార కావ‌రంతో ప‌చ్చ చొక్కాలు కులాల కుంప‌ట్లు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు.. గురువారం జ‌న‌సేన అధినేత రెండు ముక్క‌ల్లో వీట‌న్నింటికీ బ‌దులిచ్చారు..

అన్న చిరంజీవి రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం.. అంత‌కు ముందు కామ‌న్‌మెన్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ ఏర్పాటు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌ధ్యంలో జ‌న‌సేన ఆవిర్భావానికి దారి తీసిన ప‌రిస్థితుల్ని కార్య‌క‌ర్త‌ల‌కి వివ‌రించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., పార్టీకి కులాన్ని అంట‌గ‌డుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. మీరు పార్టీలు పెడితే కులాలు రావు.. మేము పార్టీలు పెడితేనే కులాలు గుర్తుకువ‌స్తాయా..? అంటూ జ‌న‌సేనుడు గ‌ర్జించారు.. మా ద‌గ్గ‌ర వేల కోట్లు లేవు, టీడీ ఛాన‌ల్స్ లేవు.. కానీ ధైర్యంగా పోరాటం చేసే స‌త్తా మాత్రం ఉందంటూ కాస్త ఘాటునే హెచ్చ‌రించారు.. నాకు కుల పిచ్చి ఉంటే 2014లో మీకు ఎందుకు మ‌ద్ద‌తిస్తాన‌న్ని ప్ర‌శ్నించారు..

హామీలు నిల‌బెట్టుకోకుంటే వదిలిపెట్ట‌న‌ని ఆనాడే చెప్పా..

2014 ఎన్నిక‌ల్లో సాయం చేయ‌మ‌ని తెలుగుదేశం పార్టీ వారే త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేసిన జ‌న‌సేన అధినేత‌., రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం ప్ర‌చారానికి వెళ్లిన‌ట్టు వివ‌రణ ఇచ్చారు.. తాను పోటీ చేయ‌న‌ని చంద్ర‌బాబుకి చెప్పాన‌న్నారు.. అందుకు ప్ర‌తిగా ప్ర‌జ‌ల‌కి సుప‌రిపాల‌న అందించాల‌ని మాత్రం కోరిన‌ట్టు తెలిపారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోని ప‌క్షంలో.. అదే ప్ర‌జా క్షేత్రంలో ప్ర‌శ్నిస్తాన‌ని ఆనాడే హెచ్చ‌రించిన‌ట్టు చెప్పారు.. ఇప్పుడు పాల‌న పూర్తిగా ప్ర‌జా కంట‌కంగా మారిన నేప‌ధ్యంలో పోతే ప్రాణాలు పోతాయి.. అంత‌కు మించి జ‌రిగేదేముంది అన్న ధైర్యంతోనే ముంద‌డుగు వేసిన‌ట్టు తెలిపారు.. అదే ధైర్యంతో పాల‌కులు చేస్తున్న త‌ప్పుల్ని న‌డిరోడ్డు మీద నిల‌దీస్తున్న‌ట్టు తెలిపారు.. రాజ‌కీయ నాయ‌కులు అనుకుంటే ఒక్క సంత‌కం, ఒక్క పెన్ను పోటుతో అన్నీ అయిపోతాయ‌న్నారు.. 23 వెనుక‌బ‌డిన కులాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బీసీ జాబితా నుంచి తొల‌గించిన విష‌యాన్ని గుర్తు చేసిన ఆయ‌న‌.. ఎమ్మెల్యే అయినా,వారి కొడుకు, అల్లుళ్లు అయినా.. ఎవ్వ‌రూ రాజ్యాంగానికి అతీతులు కార‌న్నారు.. దోపిడీలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు..

Advertisement..

Share This:

1,179 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + six =