Home / జన సేన / కేంద్రం ఇవ్వ‌లేదు.. రాష్ట్రం అడ‌గ‌లేదు.. ప్ర‌జ‌ల‌కి జ‌రిగిన అన్యాయంపై ఇక పొలిటిక‌ల్ యాక్ష‌న్ త‌ప్ప‌దు-జ‌న‌సేనాని..

కేంద్రం ఇవ్వ‌లేదు.. రాష్ట్రం అడ‌గ‌లేదు.. ప్ర‌జ‌ల‌కి జ‌రిగిన అన్యాయంపై ఇక పొలిటిక‌ల్ యాక్ష‌న్ త‌ప్ప‌దు-జ‌న‌సేనాని..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చొర‌వ‌తో., మాజీ ఐఏఎస్‌లు, రాజ‌కీయ మేధావులు, వివిధ రంగాల‌కు చెందిన నిపుణుల క‌ల‌యిక‌తో ఏర్పాటైన జాయింట్‌ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC) ఏం చేసింది..? ప్ర‌భుత్వాలు వేసే క‌మిటీల్లా నెల‌లు, సంవ‌త్స‌రాలు స‌మ‌యం తీసుకోలేదు.. ఎక్క‌డా ఏక‌ప‌క్ష వాద‌న‌లు చేయ‌లేదు.. ప్ర‌తి అంశంలో ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించి., ఏది నిజం అనే అంశంపై కేవ‌లం ప‌దే ప‌ది రోజుల్లో రిపోర్టు సిద్ధం చేసింది.. ఈ రిపోర్టు ఎవ‌రి ప‌క్షం.. ? విజ్ఞుల‌యిన రాజ‌కీయ వాదులు, సామాజిక‌వాదులు రాజ‌కీయ కోణం ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త ఇక్క‌డ గ‌మ‌నార్హం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి జ‌రిగిన అన్యాయం భ‌ర్తీ అవ్వాలంటే., ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం మిన‌హా అందుకు స‌రిపోల్చ‌ద‌గిన‌ మ‌రో అంశం అయితే లేదు అన్న‌ది జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC) వాద‌న‌..

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ మాట‌ల్లో.. విభ‌జ‌న హామీలకి సంబంధించి ఒక్క‌టంటే., ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి న్యాయం చేయ‌లేదు.. విభ‌జ‌న చ‌ట్టంలో చాలా స్ప‌ష్టంగా పొందుప‌ర్చిన అంశాల‌ను., ఎన్నిక‌ల త‌ర్వాత స్వ‌యంగా ప్ర‌ధాని ఇచ్చిన హామీల‌ను అన్నింటినీ కేంద్రం ప‌క్క‌న‌పెట్టేసింది.. ఆ విష‌యం తెలిసీ రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగేళ్ల పాటు నోరు మెద‌ప‌లేదు.. ఇదే అంశాన్ని జ‌న‌సేనాని, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC) నివేదిక రూపంలో ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యేలా ఎత్తి చూపారు..

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మొద‌టి ఏడాది 2014లో రాష్ట్రానికి రావాల్సిన ఏరియ‌ర్స్‌పై ఇంకా ఆలోచిస్తున్నామ‌ని కేంద్ర ఆర్ధిక‌మంత్రి చెబుతున్నారు.. ప‌ది రోజుల్లో న‌లుగురు ఐఏఎస్‌ల‌తో క‌ల‌సి., నాలుగేళ్ల పాల‌న‌పై JFC ఓ నివేదిక రూపొందించిన‌ప్పుడు., ఇంత పెద్ద యంత్రాంగం ఎందుకు నాలుగేళ్లుగా ఎంద‌కు నాన్చుతోంది..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌శ్న‌.. ఏది అడిగినా సాధ్య‌ప‌డ‌దు అని చెబుతున్న కేంద్రం., అస‌లు ఎలాంటి సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించి రాష్ట్రాన్ని విడ‌గొట్టారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. పార్ల‌మెంట్ సాక్షిగా ఒక చ‌ట్టం రూపొందించిన త‌ర్వాత‌., కొత్త చ‌ట్టం దాని అమ‌లుకి ఎలా అడ్డంకి అవుతుందో చెప్పాల‌ని జ‌నం త‌రుపున జ‌న‌సేన అధినేత డిమాండ్ చేశారు..

కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి విభ‌జ‌న హామీలు అమ‌లుప‌ర్చేందుకు ఉన్న స‌మ‌స్య‌లు ఏంటో చెప్పాలంటూ నిల‌దీశారు.. రెండు చోట్లా ఎన్డీఏ స‌ర్కారే అధికారంలో ఉన్న‌ప్పుడు., ప్ర‌జ‌ల ఓట్ల‌తో నెగ్గిన ఇరు పార్టీల నేత‌లు., రెండు ప్ర‌భుత్వాల్లో ప‌ద‌వులు అనుభ‌విస్తున్నప్పుడు.., స్ప‌ష్ట‌త ఎందుకు లోపించింది..? చేసిన చ‌ట్టాన్ని ఎలా ప‌క్క‌న ప‌డేస్తారో చెప్పాల‌ని జ‌న‌సేనాని కోరారు.. ప్ర‌తి అంశంలో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది.. అది తెలిసీ రాష్ట్ర ప్ర‌భుత్వం చూస్తూ ఊర‌కుంది..? ఆ కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం అంతా ఇంతా కాదు.. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC) గ్ర‌హించిన ప్ర‌ధాన అంశం ఇదేన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు..

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ(JFC) రూపొందించిన నివేదిక‌ను ఓ లెట‌ర్ స‌హా ప్ర‌ధానికి పంప‌నున్న‌ట్టు జ‌న‌సేనాని తెలిపారు.. ఇక పొలిటిక‌ల్ యాక్ష‌న్‌కి స‌న్న‌ద్దం కావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ని కూడా ఆయ‌న ప్ర‌స్థావించారు.. క‌మిటీని హేళ‌న చేయ‌డం మాని., ప్ర‌జ‌ల‌కి న్యాయం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించాల‌ని అన్ని పార్టీల‌కి సూచించారు.. ఇక పొలిటిక‌ల్ యాక్ష‌న్‌కి సంబంధించిన వ్యూహ‌ప్ర‌తి వ్యూహాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు జ‌న‌సేనాని తెలిపారు.. పొలిటిక‌ల్ యాక్ష‌న్ అనే హెచ్చ‌రిక‌తో ఢిల్లీ స్థాయిలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.. మ‌రి స్పంద‌న ఎలా ఉంటుందో వేచిచూడాలి..

JFC-Recomendations

Share This:

2,107 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 3 =