Home / జన సేన / కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న లేదనీ, పోల‌వ‌రం ప్రాజెక్టుకి ఎంతిస్తారో తెలియ‌క‌పోగా., ప్ర‌త్యేక నిధుల ఊసు లేక‌పోవ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ అంశంలో కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర బ‌డ్జెట్‌పై జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున స్పంద‌న తెలియ చేసిన మాదాసు.. మ‌న తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. బ‌డ్జెట్‌లో ఎక్క‌డా విభ‌జ‌న హామీల ప్ర‌స్తావ‌నే లేద‌ని., మొద‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడింది జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణేన‌ని తెలిపారు. ప్ర‌త్యేక ప్యాకేజీని తిర‌స్క‌రించింది కూడా ఆయ‌నేన‌న్న విష‌యాన్ఇన గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింద‌న్న భావ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నివురుగ‌ప్పిన నిప్పులా ఉందన్న మాదాసు., ప్ర‌జ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాల‌న్నారు.. తెలుగు ప్ర‌జ‌ల్ని అస‌హ‌నానికి గురి చేయ‌వ‌ద్ద‌ని కేంద్రానికి సూచించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ పార్ల‌మెంటు సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రం., క‌నీసం ప్ర‌త్యేక నిధులు కూడా కేటాయించ‌లేద‌న్నారు.. ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర విద్యా సంస్థలకు ఇచ్చిన నిధులు ఏవీ లేవు.. కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టుల ప్రస్తావన కూడా కేంద్ర ఆర్థికమంత్రి చేయలేద‌ని ఆరోపించారు.. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం గురించి ఏమీ చెప్పకపోవడం ప‌ట్ల అనుమానం వ్య‌క్తం చేశారు.. గిరిజన వ‌ర్శిటీకి ఇచ్చిన‌ రూ.8 కోట్ల‌లో తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 4 కోట్లు వస్తాయ‌న్నారు.. గత బడ్జెట్ లో కూడా ఇలాగే నిధులు కేటాయించి అవి కూడా సరిగా ఇవ్వలేదని ఆరోపించారు..
పెట్రోల్‌, డీజిల్ మీద మ‌రో రూపాయి సెస్ విధించడం ద్వారా సామాన్యుడి మీద మ‌రింత భారం మోపార‌నీ., ఇప్ప‌టికే ర‌హదారుల నిర్మాణం నెపంతో రూ. 8 సెస్ వ‌సూలు చేస్తున్నార‌ని తెలిపారు. భార‌త దేశ ర‌క్ష‌ణ మా బాధ్య‌త అంటూ డాంబికాలు ప‌లికారు. బ‌డ్జెట్‌లో చూస్తే జాతీయ భ‌ద్ర‌త‌కు విదిల్చింది అర‌కొర నిధులేన‌ని మండిప‌డ్డారు.. ఇప్ప‌టికే దేశంలో ఉత్త‌రాది, ద‌క్షిణాది భావ‌న వెళ్లూనుకుంటోంద‌నీ., అటువంటి భావ‌న‌ను ఈ బ‌డ్జెట్ మ‌రింత పెంచే విధంగా ఉంద‌న్నారు.. జాతీయతా భావం క‌లిగిన జ‌న‌సేన పార్టీ భార‌త‌దేశ అభివృద్దితో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్దిని కూడా కాంక్షిస్తోంద‌న్నారు.. దేశ అభివృద్దికి దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు అవ‌స‌ర‌మే కానీ, అది సామాన్య మ‌ధ్య త‌ర‌గ‌తి ప‌ట్ల బాధ్య‌త‌తో కూడిన‌దిగా ఉండాల‌న్న‌ది జ‌న‌సేన పార్టీ అభిప్రాయ‌మ‌ని తెలిపారు.. ఈసారి అవి ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు. పైగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో మ‌రింత న‌డ్డి విరిచారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యివేటుపై అతి ప్రేమ చూపిందన్న అభిప్రాయాన్ని మాదాసు వ్య‌క్తం చేశారు.. యువ‌త‌, మ‌హిళ‌ల‌కు కొద్దిపాటి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం మిన‌హా ఈ బ‌డ్జెట్‌లో సంతృప్తిక‌ర అంశాలు ఏవీ వ‌ని., కేంద్రం తీరు ప‌ట్ల జ‌న‌సేన పార్టీ అసంతృప్తి వ్య‌క్తం చేస్తుంద‌ని తెలిపారు..

Share This:

332 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 12 =