Home / జన సేన / కేసీఆర్ థ‌ర్డ్‌ఫ్రంట్‌కి జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. హోదాకి మ‌ద్ద‌తిచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు..

కేసీఆర్ థ‌ర్డ్‌ఫ్రంట్‌కి జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. హోదాకి మ‌ద్ద‌తిచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు..

థ‌ర్డ్‌ఫ్రంట్‌కి అంకురార్ప‌ణ చేస్తూ ముంద‌డుగు వేసిన తెలంగాణ సిఎం కేసీఆర్‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌న‌స్ఫూర్తిగా మ‌ద్ద‌తు ప‌లికారు.. ప్ర‌స్తుత దేశ రాజ‌కీయాల్లో మూడో ఫ్రంట్ అవ‌స‌రాన్ని జ‌న‌సేన గుర్తించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.. ప్రాంతాల వారీగా ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ని జాతీయ పార్టీలు అర్ధం చేసుకొన‌ప్పుడు, గౌర‌వించ‌న‌ప్పుడు ఇలాంటి థ‌ర్డ్‌ఫ్రంట్ ఏర్ప‌డుతుంద‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చాలామందిలో ఆదే భావ‌న ఉంద‌న్నారు.. ప‌దేళ్ల యూపీఏ పాల‌న దేశాన్ని అస్థ‌వ్య‌స్థం చేసింద‌ని భావించిన ప్ర‌జ‌లు., బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అధికారం ఇచ్చార‌ని., అయితే అందువ‌ల్ల స‌మ‌స్య‌లు పెరిగాయే గానీ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ప‌వ‌న్ అన్నారు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో మూడో ఫ్రంట్ ఉండి తీరాల‌న్నారు.. బూజుప‌ట్టిన పాత‌త‌రం రాజ‌కీయాల‌ని మార్చాలంటే., పాలిటిక్స్‌లో కొత్త‌ర‌క్తం పుట్టాల‌ని ., థ‌ర్డ్‌ఫ్రంట్ ఒక‌టి ఉండాల‌ని అన్నారు.. అలాంటి ప్ర‌య‌త్నానికి అంకురార్ప‌ణ చేసిన కేసీఆర్‌కి మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు.. సాటి తెలుగువాడిగా ఈ ప్ర‌య‌త్నాన్ని స్వాగ‌తిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు..

ఈ థ‌ర్డ్‌ఫ్రంట్‌ని లీడ్ చేయ‌గ‌ల‌ స‌మ‌ర్ధ‌త‌, బ‌లం కేసీఆర్‌కి ఉన్నాయ‌ని జ‌న‌సేనాని న‌మ్మకాన్ని వ్య‌క్తం చేశారు.. ద‌శాబ్దంన్న‌ర‌పాటు సుధీర్ఘ పోరాటాన్ని., ఓ బ‌ల‌మైన మూమెంట్‌ని ఏ మాత్రం ఒడిదుడుకులు లేకుండా ముందుకి న‌డిపించిన వ్య‌క్తిగా., దేశ‌వ్యాప్తంగా బ‌ల‌మైన ప‌రిచ‌యాలు ఉన్న వ్య‌క్తిగా., జాతీయ స్థాయిలో అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉన్న ఇలాంటి నాయ‌కుడి చేతుల్లోకి థ‌ర్డ్‌ఫ్రంట్ ఉండ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం అన్నారు.. ప్రాంతీయ పార్టీల‌కి జాతీయ దృక్ప‌దం ఉండాల‌ని ప‌దే ప‌దే చెప్పే జ‌న‌సేన అధినేత‌., మ‌రోసారి ఆ అవ‌స‌రాన్ని గుర్తుచేశారు.. త్రిక‌ర‌ణ‌శుద్దిగా ముందుకి వెళ్తే విజ‌యం త‌ద్య‌మ‌న్న జ‌న‌సేనాని., 2019 ఎన్నిక‌లు ప్రాంతీయ పార్టీల ప్ర‌మేయం లేకుండా జ‌ర‌గ‌వ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. సాటి తెలుగువాడిగా కేసీఆర్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నానికి మ‌న‌స్ఫూర్తిగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌., ఆయ‌న థ‌ర్డ్‌ఫ్రంట్‌ని ముందుకి తీసుకెళ్ల‌గ‌లర‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.. రానున్న రోజుల్లో దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మార్పులు చోటు చేసుకోనున్నాయ‌న్న సంకేతాల‌ని జ‌న‌సేనుడు ప్ర‌జ‌ల‌కి పంపారు..

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి ఎందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నించ‌డంతో పాటు., హోదా సాధ‌న‌కి స‌హ‌క‌రిస్తామ‌న్న కేసీఆర్ వ్యాఖ్య‌ల్ని జ‌న‌సేన అధినేత స్వాగ‌తించారు.. హోదాకి మ‌ద్దతిచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. ఎక్క‌డ ఉన్నా తెలుగువారంతా ఒక్క‌టేన‌ని మ‌రోసారి కేసీఆర్ చాటార‌న్న ప‌వ‌న్‌., రేప‌టి నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ సెష‌న్స్‌లో పోరాటం చేయాల‌ని మిగిలిన పార్టీల‌కి సూచించారు.. టీడీపీ-వైసీపీలు టిఆర్ఎస్ స‌హ‌కారంతో హోదా సాధించాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కోరారు.. ప్ర‌జ‌ల‌కి మంచి జ‌రిగే అంశం ఏదైనా., నిర్మొహ‌మాటంగా మ‌ద్ద‌తు తెల‌పే ధైర్యం.. మంచి చేసింది ప్ర‌త్య‌ర్ధి అయినా మంచిని మంచి అని ఒప్పుకునే ధైర్యం., ఒక్క జ‌న‌సేనుడికి మాత్ర‌మే సొంతమ‌న్న విష‌యం మ‌రోసారి నిరూపితం అయ్యింది..

Share This:

1,998 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + thirteen =