కమనీయ కార్తీకం.. ఓ పుణ్యతిధి.. గురువారం.. హరనామస్మరణలో తరించారు జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఏటో ఆ శివయ్య ఏటనుకుంటున్నాడో.. ఈ జనసేనుడితో ఏం చేయించుకోవాలనుకున్నాడో.. తెలియదుగాని భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటిదీపోత్సవంలో మాత్రం ఆయనతో లింగార్చన చేయించుకున్నాడు.. ఏ పని చేసినా దాన్ని పూర్తి శ్రద్ధాభక్తులతో చేయాలన్నది పవన్ నైజం.. అందుకే కోటిదీపోత్సవానికి ప్రత్యేక అతిధిగా తరలివచ్చిన ఆయన., ఆ గరళకంఠుడికి అర్చనలు చేసి తరించారు.. నేలపై కూర్చుని కళ్యాణాన్ని వీక్షించారు.. ఆ లయకారుడి పల్లకిని మోశారు.. వేదపండితుల ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.. ఆయన వెంట కాటమరాయుడు నిర్మాత శరత్‌మరార్ తదితరులు కోటిదీపోత్సవానికి తరలివచ్చారు..
1,078 views