Home / జన సేన / కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాదంపై జ‌న‌సేనాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాల‌కి సంతాపం..

కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాదంపై జ‌న‌సేనాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాల‌కి సంతాపం..

ప‌దుల సంఖ్య‌లో అమాయ‌కుల ప్రాణాలు తీసిన కొండ‌గ‌ట్టు ఘాట్ రోడ్డు బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.. ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకున్న వెంట‌నే., ఈ విషాదం త‌న గుండెల్ని పిండేసింద‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. అత్యంత హృద‌య విదార‌క ఘ‌ట‌న‌గా కొండ‌గ‌ట్టు ప్ర‌మాదాన్ని పేర్కొన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., 50 మంది మృతి చెందార‌ని తెలియంతో త‌న మ‌న‌సంతా భారంతో కూడిన దుఃఖంతో నిండిపోయింద‌ని తెలిపారు.. మ‌రో ప‌ది మంది గాయ‌ప‌డ‌డం ప‌ట్ల ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. మృతుల్లో 25 మంది మ‌హిళ‌ల‌తో పాటు ఎడుగురు చిన్నారులు ఉండ‌డం త‌న‌ను మ‌రింత బాధించిన‌ట్టు తెలిపారు..

కొద్దిక్ష‌ణాల్లో మృత్యువు పొంచి ఉంద‌ని తెలియ‌ని ఆ అమాయ‌క ప్ర‌యాణికుల్ని త‌ల‌చుకుంటే మ‌న‌సు ద్ర‌వించిపోతుంద‌న్నారు.. ఆర్‌.టి.సి బ‌స్సులు ప్ర‌యాణించ‌ని అంత ఇరుకైన ఘాట్ రోడ్డులోకి ప్ర‌మాదానికి గురైన బ‌స్సు అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లితీసుకోవ‌డానికే వ‌చ్చిన‌ట్టు అనిపించింద‌న‌న్నారు.. నిండుగా ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఈ బ‌స్సు లోయ‌లోకి ప‌డిపోవ‌డాన్ని దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌గా ప‌వ‌న్ అభివ‌ర్ణించారు.. చ‌నిపోయిన వారి ఆత్మ‌ల‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్ధించిన జ‌న‌సేనాని., మృతుల కుటుంబాల‌కి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.. మృతుల కుటుంబాల‌కి, గాయ‌ప‌డిన వారికి త‌గిన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు..

Advertisement.

Share This:

1,142 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 15 =