Home / పెన్ పోటు / కొమ్మినేని పాచిపోయిన పాత్రికేయం జ‌నానికి వెగుటుపుడుతోంది.. జ‌గ‌న్‌జీ మార్చండి.. మారండీ… ప్లీజ్‌..

కొమ్మినేని పాచిపోయిన పాత్రికేయం జ‌నానికి వెగుటుపుడుతోంది.. జ‌గ‌న్‌జీ మార్చండి.. మారండీ… ప్లీజ్‌..

kommaneni-copy

హార్వార్డ్ యూనివ‌ర్శిటీ నుంచి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఆహ్వానం ఇలా అందిందో లేదో., ప‌త్రిప‌క్ష మీడియా సాక్షి జ‌న‌సేనుడిపై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం మొద‌లుపెట్టేసింది.. ఆ అక్క‌సు ఏ రేంజ్‌లో ఉందంటే., జ‌నం చూస్తే న‌వ్విపోతారు అన్న విష‌యాన్ని కూడా మ‌ర‌చి., విలువ‌లు చ‌చ్చిపోయిన పెయిడ్ పాత్రికేయుల‌తో స్ప‌ష్ట‌త‌లేని చిల్ల‌ర వార్త‌లతో ప్ర‌చారం షురూ చేసింది.. త‌న‌కు ద‌క్క‌ని గౌర‌వం ప‌క్కవారికి ద‌క్కితే స‌హించ‌లేని త‌నం ఉన్న స‌ద‌రు పెద్ద‌మ‌డిసి., తాను డ‌బ్బిచ్చి పోషిస్తున్న పాత్రికేయక‌లాల్లో ఒక‌టైన కొమ్మినేనికి ప‌వ‌న్‌పై విషంక‌క్కే బాధ్య‌త‌ను అప్ప‌చెప్పారు.. పొలిటిక‌ల్ కామెంట్‌ పేరిట‌., పాచిక‌బుర్లు చెప్పే కొమ్మినేని., అదే వేదిక నుంచి జ‌న‌సేనుడిని కించ‌ప‌ర్చే ఓ వార్త‌కు ప్రాణం పోయాల‌నుకున్నారు.. కానీ పాపం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెనుక ఏ త‌ప్పు ఎత్తిచూపాలో తెలియ‌ని కొమ్మినేని., తోక‌కీ ఈక‌కీ సంబంధం లేని ఓ క‌థ‌నాన్ని చిత్రించ‌డంతో అదికాస్త మిస్ ఫైర్ అయ్యింది.. ఆ వార్త చూసిన జ‌నం ఎంత సొంత మీడియా అయితే మాత్రం మ‌రీ ఇంత వెగుటు వ‌క్రీక‌ర‌ణ‌లా అని న‌వ్విపోతున్నారు..

వార్త ప్రారంభంలోనే తాన అక్క‌సు ఏ విష‌యంపైన అనే విష‌యాన్ని చెప్పేశారు కొమ్మినేని.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి హార్వార్డ్ ఆహ్వానం రావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మే అంటూ మొద‌లెట్టారు.. ప్ర‌తి చోట జ‌న‌సేనానికి ఏ విష‌యంలో స్ప‌ష్ట‌త లేద‌ని చెప్పేక్ర‌మంలో., తానే స్ప‌ష్ట‌త కోల్పోయి.. నానా తంటాలు ప‌డి ఓ వంక‌ర‌వార్త‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.. సంక్రాంతి సందేశంలో నోట్ల ర‌ద్దుకి సంబంధించి మోడీ పేరు ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌న్న‌ది ఈయ‌న చూపిన పెద్ద లోపం.. విమ‌ర్శ కేంద్రంపై చేసినా., కేంద్రంలోని పాల‌కుల‌పై చేసినా అది దానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న మోడీపై చేసిన‌ట్టుకాదా..? ఇన్నేళ్ల పాత్రికేయంలో మీరు నేర్చుకున్న‌ది ఇంతేనా..? మీకు ఆ స‌ద‌రు సంస్థ‌లు అస‌లు ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతాలు ఇచ్చి ఎలా పెట్టుకుంటున్నాయో అర్ధం కావ‌డం లేదు.. ఇక ఆ విష‌యానికి వ‌చ్చినా., మీ జ‌గ‌న్ నోట్ల ర‌ద్దుకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు తేలుకుట్టిన దొంగ‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. ఓ జ‌నం ఇబ్బందులు ఆయ‌న‌వి కాదా..

వెంక‌య్య‌పై విమ‌ర్శ‌ల వాడి త‌గ్గించార‌ని అన్నారు.. స‌మ‌యం సంద‌ర్బం లేకుండా నిత్యం వెంక‌య్య జ‌పం చేయ‌డానికి మా జ‌న‌సేనుడు మీకులా ఎదుటివారిపై బుర‌ద‌చ‌ల్లే ప‌ని ఒక్క‌టే పెట్టుకోలేదు.. హోదాకి సంబంధించి అనంత‌లో జ‌రిగిన స‌భ‌లో సైతం ఆయ‌న వెంక‌య్య స‌న్మానం విష‌యాన్ని ప్ర‌స్తావించారు.. వ‌య‌సు మ‌ళ్లి బ‌హుశా మీకు కాస్త‌——-(బ్లాంక్ మీరే పూరించుకోండి) వ‌చ్చి ఉంటుంది..

ఉద్దానం విష‌యంలో జ‌న‌సేనాని విజ‌యాన్ని కూడా వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు.. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేయ‌గానే న‌మ్మేశార‌న్నారు.. ఆయ‌న‌ పోరు అంత‌టితో ఆగ‌లేదు కొమ్మినేనిగారు.. ప‌వ‌న్ పుణ్య‌మా అని అక్క‌డ స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి.. కొత్త‌గా రెండు డ‌యాల‌సిస్ కేంద్రాల ఏర్పాటుకి జీవో నంబ‌ర్ 19ని స‌ర్కారు విడుద‌ల చేసింది.. ఒక్క‌సారి రిఫ‌ర్ చేసుకోండి..

మీరు సెల‌విచ్చిన చివ‌రి అంశం.. ప‌వ‌న్ గురించి జేసీ లాంటి కొంద‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌న్నారు.. ఏనుగు రోడ్డుపై వెళ్తుంటే కుక్కులు చాలా మొరుగుతాయి.. వాట‌న్నింటికీ బ‌దులిచ్చుకుంటూ పోతే ఏనుగు మ‌నుగ‌డ సాగ‌దు.. అయినా అలాంటి రాజ‌కీయాల‌కు తాము దూరం అని ప‌వ‌న్ చెప్పారు.. ఇక టీడీపీతో క‌లిసి వెళ్తారా..? ప‌్ర‌తిప‌క్షంగా ఉంటారా..? అంటూ ఏవేవో మాట్లాడారు.. అస‌లు ఆయ‌న ఓ పార్టీతో క‌లిసి వెళ్తాన‌ని ఎక్క‌డైనా ఎవ‌రికైనా చెప్పారా..? జ‌నం మీ మీడియా పార్టీకి ప‌దుల సంఖ్య‌లో సీట్లు క‌ట్ట‌బెట్టి., ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇచ్చినా., ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో మీ నాయ‌కుడు దారుణంగా విఫ‌ల‌యం అయ్యాడు.. మీ నాయ‌కుడి పాత్ర‌ను జ‌న‌సేనాని నిర్వ‌హిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు.. స‌ర్కారుకి అర్ధ‌మ‌య్యేలా చెప్పి., ప‌రిష్కారం విష‌యంలో విజ‌యం సాధిస్తున్నారు.. స‌ర్కారుని తిట్టిపోసి., బంద్‌లు, ధ‌ర్నాలు అంటా జ‌నాన్నిఇబ్బంది పెట్ట‌డం కంటే., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లా ప‌రిష్కారం వెత‌క‌డ‌మే మేలు క‌దా..

jaganreddy_afp

పుస్త‌కాల‌తో పాటు ప్రాక్టిక‌ల్ రాజ‌కీయాలు చ‌ద‌వ‌మ‌ని స‌ల‌హా ఇచ్చిన మీరు.. ముందు మీ రాత‌ల్లో ప్రాక్టికాలిటీ లోపించింది చూసుకోండి.. అయ్యా జ‌గ‌న్‌గారు.. మీ అక్క‌సు మీ పెయిడ్ పాత్రికేయుల క‌లాన్నించి వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. అయితే విశ్లేష‌ణ‌, వ‌క్రీక‌ర‌ణ ఇంత చెత్త‌గా ఉంటే దాన్ని జ‌నం స్వీక‌రించ‌రు.. మీ క‌లాల‌కు కాస్త ప‌దును పెట్టండి.. కొమ్మినేని లాంటి క‌లాలు., పాళీలు అరిగిపోయి ఇంకు క‌క్కుతుంటే రాసిందేంటో అర్ధంకాక‌., జ‌నం మీ ఛాన‌ల్ మార్చేస్తున్నారు.. మీరూ మారండి.. మీ అక్క‌సు వెళ్ల‌గ‌క్కేందుకు ప‌ద‌నైన కొత్త క‌లాల్ని కొనుక్కోండి.. ఇది నా మాట కాదండోయ్‌.. మీ ఛాన‌ల్ చూస్తున్న జ‌నం మాట‌..

18-01-2017-press-meet-selected-pictures-8

ఇంకో విష‌యం మ‌ర్చిపోయామండోయ్‌.. మీ సార్ అమ‌రావ‌తి రైతుల అన్యాయాన్ని ప్ర‌శ్నించేందుకు వెళ్దామ‌నుకుంటే., రైతులేమో న్యాయం కోసం జ‌న‌సేనానిని ఆశ్ర‌యించారు.. మీ సార్‌పై జ‌నానికి ఎంత న‌మ్మ‌కం ఉందో చూడండి.. త‌ర్వాతి ఎపిసోడ్‌లో దీనిపై కూడా అక్క‌సు వెళ్ల‌గ‌క్కండి..

 

Share This:

3,617 views

About Syamkumar Lebaka

Check Also

నిజం నిప్పులాంటిది.. ఆల‌స్యం అయినా అబ‌ద్ధాన్ని ద‌హించివేస్తుంది..

సత్యమేవ జయతే అంటూ దెయ్యాలు “వేదాలు” వల్లిస్తున్నాయి? దుర్మార్గులు “సన్మార్గం” గురించి మాట్లాడుతున్నారు! ప్రస్తుత మన రాజకీయ-మీడియా పరిస్థితులు చూస్తుంటే, …

4 comments

 1. Sakshi oka chetta chanel,pawan kalyan prajalu gurunchi poraduthunte covarage evvadhu,okavela esthe andhulo manchini chuduga chubetti covarage estundhi,andhuke nenu sakshi news chudanu,chadhavanu,jai jsnasena

 2. veedo natthi vaadu. purohithudiki, news reader/editor ki undakoodanidi adhey. alaantidi veedu ettaa ayyaado arthamekaadu. okappudu chaalaa patrikalu ilaanti ekasikaale chesi, mattilo kalisipoyaayi. vaari tharvaatha generation emayyaayo, ippudu kaalam elaa eedusthunnaaro koodaa choosaam choosthunnam. yedavanivvandi..eedilaantollu entha edisthe annaki antha dishti poddhi. kaakapothe grahanamorri tho and natthi tho edusthunnaade SPASHTATHA lekundaa ani baadha.

 3. pawantoday.com , toady only I come to know about this site, and it is having a lot of information about Jana Sena. but only problem is lack of publicity to this site, is keeping the hard core fans to visit other websites which degrade PSPK craze and Janasena activities,. The reason being I said this is, I am a hard core fan of PSPK, and daily by every hour i will keep on searching News for PSPK. Initially the sites used to give very good information about PK. but later on wards these sites publishing the news against PK and downgrading his craze and even News channels are also joined into this group.

  many fans are reading the other sites and feeling very bad about that shit. for example below sites..

  Tupaki.com
  Tolivelugu.com
  Enadu.in
  andhrajyothi.com

  I request all the activists to publish this site and make every one know about the JANASENA and PSPK craze.

  KEEP GOING…..

  Regards
  Anand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 11 =