Home / జన సేన / కొల్లేరు నిర్వాసితుల గోడు విన్న జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం..

కొల్లేరు నిర్వాసితుల గోడు విన్న జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం..

img-20161122-wa0019 మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోదావ‌రి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం., సాయంత్రానికి కైక‌లూరుకి చేరుకుంది.. కొల్లేరు నిర్వాసితుల్ని ప‌లుక‌రించింది.. వైఎస్ ఆప‌రేష‌న్ కొల్లేరుకి బ‌లైపోయిన నిర్వాసితులు అప్ప‌టి నుంచి ప‌రిహారం అంద‌క అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు.. ఆప‌రేష‌న్ కొల్లేరు బాధితులు కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో చాలా మందే ఉన్నారు.. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి నేత‌లు హామీలు అయితే ఇస్తున్నారు గానీ., వారికి న్యాయం చేసిన దాఖ‌లాలు లేవు.. తాజాగా కొల్లేరును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకి కుదిస్తామంటూ ఎన్నిక‌ల స‌మ‌యంలో సిఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.. గెలిచాక ఇచ్చిన హామీని మాత్రం నెర‌వేర్చ‌లేక పోయారు.. కొల్లేరును మూడో కాంటూరుకి కుదిస్తే., సుమారు 40 వేల ఎక‌రాల వ‌ర‌కు ఆప‌రేష‌న్ కొల్లేరు నిర్వాసితుల‌కు పంచే అవ‌కాశం ఉంటుంది.. నాడు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు అంటూ అడ్డంగా చిన్న‌, స‌న్న‌కారు రైతుల చెరువులు క‌లిపేసిన పాల‌కులు., వారికి న్యాయం చేయ‌లేక‌పోయారు.. అప్పుడు ఇప్పుడు కొల్లేరు ప్రాంతంలో బ‌డా బాబుల ఆక్ర‌మ‌ణ‌లు, ఆగ‌డాలు అయితే కొన‌సాగుతూనే ఉన్నాయి.. ఇదే విష‌యాన్ని కైక‌లూరు ప్రాంతానికి చెందిన ప‌లువురు బాధితులు జ‌న‌సేనాని దృష్టికి తీసుకువ‌చ్చారు.. ఓ సారి వ‌చ్చి త‌మ దీనావ‌స్థలు ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు..

img-20161122-wa0020

దీంతో భీమ‌వ‌రం ఆక్వాఫుడ్ పార్క్ ప్రాంతంలో వాస్త‌వాలు తెలుసుకునేందుకు వ‌చ్చిన జ‌న‌సేన బృందం., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు అక్క‌డి నుండి నేరుగా కొల్లేరు ప్రాంతానికి వెళ్లింది.. వారికి జ‌రిగిన అన్యాయం ఏంటి..? ఏం చేస్తే వారి స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది అనే అంశాల‌కు సంబంధించి వారితో చ‌ర్చించి., బాధితులు ఇచ్చిన విజ్ఞాప‌న‌లు స్వీక‌రించింది.. వాస్త‌వానికి కాంటూరు కుదింపు వ్య‌వ‌హారం కేంద్రం ప‌రిధిలోనిది కాగా., రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ వ్య‌వ‌హారంలో తూతూ మంత్రంగా తీర్మానాలు మాత్ర‌మే పంపుతుండ‌డంతో ప‌ని జ‌ర‌గ‌డం లేదు.. జ‌న‌సేన బృందం ప‌ర్య‌ట‌న‌తో., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌లుచుకుంటే అయినా త‌మకు న్యాయం జ‌రుగుతుంద‌ని బాధితులు ఆశ‌తో ఉన్నారు.. కొల్లేరు నిర్వాసితుల గోడు విన్న పార్టీ కోశాధికారి రాఘ‌వ‌య్య నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందం., దీనికి సంబంధించి జ‌న‌సేనానికి స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని హామీ ఇచ్చింది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + 16 =

%d bloggers like this: