Home / జన సేన / కోటిలింగాల మృతుల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాళి.. బాధిత కుటుంబాల‌ని ఆదుకోవాల‌ని డిమాండ్‌..

కోటిలింగాల మృతుల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాళి.. బాధిత కుటుంబాల‌ని ఆదుకోవాల‌ని డిమాండ్‌..

వ‌రంగ‌ల్ జిల్లా కోటిలింగాల‌లో బాణాసంచా గోదాములో జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదం 11 మందికి పైగా కార్మికుల్ని పొట్ట‌న‌పెట్టుకున్న వార్త విని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ షాక్ తిన్నారు.. ఈ ఘ‌ట‌న త‌న‌ను బాధించింద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. విశాఖ జిల్లాలో పోరాట యాత్ర‌లో ఉన్న జ‌న‌సేనాని., ఘ‌ట‌న‌పై ఆరా తీశారు.. ఈ దుర్ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింద‌న్నారు.. బాణాసంచా గోదాములో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌ని ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.. క్ష‌త‌గాత్రుల‌కి మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.. భ‌విష్య‌త్తులో ఇలాంటి దుర్ఘ‌ట‌న‌ల‌కి పున‌రావృతం కాకుండా నిబంధ‌న‌ల్ని క‌ఠినంగా అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని జ‌న‌సేన అధినేత అభిప్రాయ‌ప‌డ్డారు.. మృతుల కుటుంబాల‌కి ప్ర‌గాఢ సానుభూతిని ప‌వ‌న్ వ్య‌క్తం చేశారు..

Advertisement..

Share This:

805 views

About Syamkumar Lebaka

Check Also

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =